రంగారెడ్డి
Friday, October 6, 2017 - 12:03

రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలం చౌదరిపల్లి గేట్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బొలారే వాహనం, కారు, లారీ ఢీకొనడంతో... ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు కాగా... ఆస్పత్రికి తరలించారు. మృతులు మైలారం మల్లయ్యతో పాటు డ్రైవర్‌ మర్రిగూడ మండలానికి చెందినవారుగా గుర్తించారు. 

 

Wednesday, September 27, 2017 - 13:58

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసులు చిరువ్యాపారులపై దౌర్జన్యం ప్రదర్శించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారన్న నెపంతో తోపుడు బళ్లను బలవంతంగా లాక్కెళ్లారు. చిరువ్యాపారులు వద్దని బతిమాలిన వినకుండా తోపుడు బళ్లను వాహనంలో తీసుకెళ్లారు. 

Wednesday, September 27, 2017 - 08:50

రంగారెడ్డి : సరదాకి ఆడిన కబడ్డీ ఆట ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. చిన్న గొడవ పెద్దదిగా మారి ఒకరు మృతి చెందిన సంఘటన.. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, ముచింతల్‌లో చోటు చేసుకుంది. ముచింతల్ గ్రామంలో నివాసముండే మీసాల నరసింహకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు మల్లేశ్‌ ఉన్నారు. మల్లేశ్ దసరా సెలవులు కావడంతో అరుణ్‌ అనే అబ్బాయితో.. కబడ్డీ ఆడాడు. అయితే గొడవ జరిగి అరుణ్‌ మల్లేశ్‌ మెడపై...

Tuesday, September 26, 2017 - 20:13

రంగారెడ్డి : జిల్లాలోని షాద్‌నగర్‌లో.. వైద్యం వికటించి పసికందు మృతి చెందిన సంఘటనలో డాక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ప్రేమ్‌కుమార్‌ను శిక్షించడంచో పాటు ఆసుపత్రిని సీజ్‌ చేయాలన్నారు. షాద్‌నగర్‌ ముఖ్య కూడలిలో పాప తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ధర్నాకు దిగారు. పాప తల్లిదండ్రులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి...

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Sunday, September 24, 2017 - 12:59

రంగారెడ్డి : జిల్లాలోని షాబాద్‌ మండలం సంకేపల్లిగూడలో ఉన్న లక్ష్మీనివాస్‌ భారత్‌ గ్యాస్‌ గోదాములో దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు 221 సిలిండర్లను ఎత్తుకెళ్లారు. దొంగతనాన్ని గుర్తించిన గ్యాస్‌ ఏజెన్సీ సిబ్బంది పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. 

Saturday, September 23, 2017 - 10:48

రంగారెడ్డి : జిల్లాలోని షాద్ నగర్ లో బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రజా గాయకురాలు విమలక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మను కార్పొరేట్ బతుకమ్మగా మారుస్తున్నారని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు హక్కులను కాపాడుకోవాలని విమలక్క అన్నారు. తెలంగాణ వనరులను కబ్జాదారుల నుంచి...

Friday, September 22, 2017 - 10:34

రంగారెడ్డి : జిల్లాలోని తాండూరులో ఆత్మహత్యాయత్నం చేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త అయూబ్‌ ఖాన్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 30న తాండూరులో మంత్రి మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశానికి అయూబ్‌ హాజరయ్యాడు. ఉద్యమ కారులకు పార్టీలో గుర్తింపు ఇవ్వడంలేదంటూ మనస్తాపం చెందిన అతను... సమావేశంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అయూబ్‌ను స్థానిక...

Pages

Don't Miss