రంగారెడ్డి
Saturday, December 9, 2017 - 13:34

హైదరాబాద్ : మధ్య తరగతి వారి నుంచి .. ప్రజా ప్రతినిధుల పిల్లల వరకూ అందరూ తమ పిల్లల్ని ఆ కాలేజ్‌లో చదివించాలని తహతహలాడతారు. ఆ కాలేజ్‌లో సీటు రావాలంటే ఆషామాషీ ర్యాంకులు సరిపోవు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ మోస్ట్ కాలేజ్‌గా పేరొందిన ఆ కాలేజ్‌ కీర్తి ఇప్పుడు మసకబారుతోంది. మధ్య తరగతి విద్యార్ధులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పడిన ఆ కాలేజ్‌ ఇప్పుడు ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం...

Thursday, December 7, 2017 - 22:06

రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలంలో నిర్మించ తలపెట్టిన ఫార్మాసిటీకి అడ్డంకులు తొలగడం లేదు. ఫార్మాసిటీ కోసం  నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. రైతులంతా తమ భూములు ఇవ్వబోమని... తమ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు వద్దంటూ ఆందోళనకు దిగారు. ఫార్మాసిటీ భూసేకరణలో అవకతవకలకు పాల్పడిన వారిని ముందుగా శిక్షించాలని స్థానికులు పట్టుబట్టారు. ఒకే ప్రాంతంలోని రైతులకు పరిహారం ఇచ్చే...

Thursday, December 7, 2017 - 10:11

రంగారెడ్డి : ప్రైవేటు కాలేజీలో ఫీజుల 'జులుం' కొనసాగుతోంది. పలు కళాశాలల్లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీబీఐటీ కాలేజ్ యాజమాన్యం పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని..వెంటనే ఉన్నత విద్యా మండలి స్పందించాలని విద్యార్థులు..తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అధిక...

Thursday, December 7, 2017 - 06:39

రంగారెడ్డి : జిల్లా... గండిపేటలోని CBIT కళాశాల విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా వందలాది మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి.. ధర్నా చేశారు. కాలేజ్‌ యాజమాన్యం భారీగా ఫీజులను పెంచిందంటూ.. విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షా 13 వేలు ఉన్న ఫీజును రెండు లక్షలకు పెంచారని.. దీంతో తమ చదువులు ఆగిపోయేటట్టు ఉన్నాయని వాపోయారు. ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు...

Monday, December 4, 2017 - 19:40

రంగారెడ్డి : జిల్లా..ఇబ్రహీంపట్నం మండలం, ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను .. టిప్పర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన ఇద్దరు హైదరాబాద్‌ బడంగ్‌ పేట్‌కు చెందిన శీల మహేశ్‌, లోకేశ్‌ దుర్గా ప్రసాద్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Sunday, December 3, 2017 - 11:59

సంగారెడ్డి : జిల్లాలోని పుల్కల్‌ మండలం రాయిపాడ్‌లో జరిగిన అంతర్జాతీయ ఫార్మా కల్చర్‌ సదస్సు ముగిసింది. 72 దేశాలకు చెందిన 750 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం  నారాయణ తదితరులు హాజరయ్యారు. విదేశీ ప్రతినిధులు స్థానికులతో మమేకమయ్యారు. ఫార్మా సదస్సు ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక...

Pages

Don't Miss