రంగారెడ్డి
Tuesday, June 21, 2016 - 17:36

హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య కన్ను మూశారు. గత కొంతకాలంగా అంజయ్య మూత్ర పిండాలు, కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో పాటలు రాశారు. తెలంగాణ ప్రజలు అంజన్న అని ముద్దుగా పిలుచుకునేవారు. 1955లో ఆదిలాబాద్ జిల్లా లింగాపురంలో జన్మించారు. అంజన్న మరణ వార్త విన్న తెలంగాణ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. 

ఊరు మనదిరా..ఈ వాడ మనదిరా పాట రాశారు.
...

Saturday, June 18, 2016 - 13:48

రంగారెడ్డి : ప్రభుత్వం వెంటనే ధరలను నియంత్రించాలని కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పెరిగిన కూరగాయల ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి వ్యవసాయ మార్కెట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూరగాయలు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులపై పెనుభారం పడుతోందని మండిపడ్డారు. కూరగాయల...

Friday, June 17, 2016 - 11:40

రంగారెడ్డి : జిల్లాలోని జీడిమెట్లలో విషాదం నెలకొంది. డ్రైవర్ నిర్లక్ష్యం బాలుడి ప్రాణం తీసింది. స్కూల్ బస్సు కింద పడి ఎల్ కేజీ విద్యార్థి మృతి చెందాడు. జస్వంత్  రెడ్డి (6) విద్యార్థి జీడిమెట్లలోని వివేకానందనగర్ లో విజ్ఞాన సుధ టాలెంట్ స్కూల్ లో ఎల్ కేజీ  చదువుతున్నాడు. రోజులాగే విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ దగ్గర వదిలి వెళ్లారు. బాలుడు స్కూల్ వైపు నడిచివస్తుంగా అదే స్కూల్...

Friday, June 17, 2016 - 11:29

రంగారెడ్డి : దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. రోజురోజకు వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జిల్లాలోని పేట్ బషీర్ బాగ్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. సుచిత్ర చౌరస్తా వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంకులో ఇద్దరు దండగులు చోరీకి విఫలయత్నం చేశారు. రాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఇద్దరు దండగులు సుత్తితో ఆంధ్రాబ్యాంకు షెటర్ ను తొలగించే ప్రయత్నం చేశారు. శబ్ధాలు విన్న స్థానికులు అక్కడి వచ్చి చోరీకి...

Wednesday, June 15, 2016 - 21:57

రంగారెడ్డి : కుక్క కాటుతో ఫీవర్‌ ఆస్పత్రిలో మృతిచెందిన బాలుడి ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది.. ఈ ఘటనను సుమటోగా తీసుకున్న కమిషన్‌... బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని సూచించింది.

Tuesday, June 14, 2016 - 11:23

రంగారెడ్డి : నయిమ్ అనుచరుడు, రౌడీ షీటర్ షకీల్ గుండెపోటుతో మృతి చెందాడు. నల్గొండ జిల్లా బహిష్కరణ ఆదేశాలతో షకీల్ హైదరాబాద్ లో ఉంటున్నాడు. మేడ్చల్ లో షకీల్ గుండెపోటుతో మరణించాడు. షకీల్ 150 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. మాజీ మావోయిస్టు సాంబశివుడు హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.  

 

Tuesday, June 14, 2016 - 10:30

అదృశ్యమౌతున్న మహిళల ఆచూకీ ఏదీ ? రాజధాని శివారులో ఏం జరుగుతోంది ?

కళ్ల ముందు కనిపించిన చిన్నారుల జాడ తెలియడం లేదు. స్కూల్ కు వెళ్లిన బాలికలు..కాలేజీకి వెళ్లిన అమ్మాయిలు కనిపించడం లేదు. భర్తతో గొడవపడో..మరో ఇతర సమస్య మీద గడప దాటిన ఇలాళ్లు మాయమై పోతున్నారు. వీరంతా ఏమై పోతున్నారు. వీరి బతుకులను నాశనం చేస్తున్నది ఎవరు ? రాజధాని శివారులోని శంషాబాద్ మండలంలో ఇద్దరు మహిళలు...

Monday, June 13, 2016 - 11:48

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు పాఠశాల బస్సులపై నిఘా పెట్టారు. రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రాంతాల్లోనూ పాఠశాల బస్సులను విస్త్రతంగా తనిఖీ చేస్తున్నారు. బస్సు ఫిట్‌నెస్‌, అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నారు. సరైన పత్రాలు లేని, ఫిట్‌నెస్‌ లేకుండా నడుపుతున్న బస్సులను సీజ్‌ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 5,...

Sunday, June 12, 2016 - 19:38

రంగారెడ్డి : తెలంగాణ పోలీసులపై మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి ప్రశంసలు కురిపించారు. సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను పెంచుతున్నారని అభినందించారు. అడిగిన వెంటనే భారీగా నిధులు ఇచ్చారంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పేట్‌బషీర్‌బాగ్‌లో అత్యాధునిక పోలీస్‌ స్టేషన్‌ కొత్త భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్‌ కమిషనర్‌ ఆనంద్‌కూడా...

Saturday, June 11, 2016 - 18:39

రంగారెడ్డి : మూడు సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కల పెంపకం చేపట్టి రాష్ట్రాన్ని హరిత తెలంగాణాగా మారుస్తామని అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో ...రంగాపూర్, తిమ్మాయిపల్లిలోని నర్సరీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఈయన వెంట రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో...

Sunday, June 5, 2016 - 09:06

రంగారెడ్డి : శంషాబాద్‌లో కేంద్ర జలవనరుల పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. కృష్ణా, గోదావరి బోర్డుల పనితీరును పార్లమెంటు సభ్యుల బృందం సమీక్షించింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలను పార్లమెంటరీ కమిటీ ప్రశంసించింది. కృష్ణాబోర్డు ఏకపక్ష వైఖరిని పార్లమెంటరీ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ వివరించింది. సత్వర సాగునీటి ప్రయోజనా పథకం కింద రూ.2155కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నాబార్డు...

Pages

Don't Miss