రంగారెడ్డి
Wednesday, July 5, 2017 - 15:55

రంగారెడ్డి : జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు ఓ యువకుడు బలైపోయాడు. యువకుడు సెల్ఫీ సూసైడ్‌ చేసుకున్నాడు. శంకర్‌పల్లి మండలం మహరాజ్‌పేటలో నరేష్‌ అనే యువకుడు వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడి అప్పులపాలు అయ్యాడు. రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపం చెందాడు. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో...

Wednesday, July 5, 2017 - 13:35

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవుల పల్లి ముత్తూట్ దోపిడి కేసులో పోలీసులు వేట కొనసాగుతోంది. దుండగులను పట్టుకోవడానికి ఏకంగా 20 బృందాలు రంగంలోకి దిగాయని రాజేంద్రగర్ ఏసీపీ గంగారెడ్డి పేర్కొన్నారు. ఈ కేసును ఒక ఛాలెంజింగ్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. దోపిడీకి యత్నంలో ఆరుగురు పాల్గొన్నట్లు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా క్లూస్ సేకరించడం జరుగుతోందని వెల్లడించారు.

...

Tuesday, July 4, 2017 - 12:30

రంగారెడ్డి : దొంగలు మళ్లీ ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీని టార్గెట్ చేశారు. మరోసారి చోరీ చేసేందుకు ప్రయత్నించారు. గతంలో పలు ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మైలార్ దేవులపల్లిలో ఉన్న మత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఉంది. ఈ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. కత్తులు..తుపాకులతో అసిస్టెంట్ మేనేజర్ లతీఫ్ ను బెదిరించారు. కొంత ధైర్యం చేసిన లతీఫ్ అక్కడనే ఉన్న అలారాన్ని...

Wednesday, June 28, 2017 - 21:02

రంగారెడ్డి : మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో కల్తీ విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ప్రధాన నిందితుడు చిన్నం జానకిరామ్‌ సహా సంఘి మహేందర్‌, శ్రీను, లక్ష్మిని అదుపులోకి తీసుకున్నామన్నారు. సృష్టి, గోపి కృష్ణ సీడ్స్‌ పేరుతో తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రైతులను మోసం చేసినట్లు పేర్కొన్నారు...

Wednesday, June 28, 2017 - 19:53

రంగారెడ్డి : జిల్లాలోని మంచాల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నాకు దిగింది. రంగాపూర్‌ గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించేలా వ్యవసాయరంగంలో పరిష్కారం జరగాలన్నారు. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలుజరిగేందుకు అవసరమైతే పోరాటాలు...

Sunday, June 25, 2017 - 15:20

రంగారెడ్డి : 60 గంటల పాటు నిర్విరామంగా చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. బోరుబావిలోంచి చిన్నారి బతికొస్తుందనుకున్న ఆ కన్నతల్లికి కన్నీళ్లే మిగిలాయి. కన్నతల్లి పేగు బంధాన్ని శాశ్వతంగా తెంచుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అమ్మా అని నోరారా పిలిచే ఆ చిట్టితల్లి చిట్టిపొట్టి మాటలు ఇప్పుడు వినిపించవు. నవమాసాలు మోసి కనిపెంచిన ఆ కన్నతల్లికి ఇప్పుడు మిగిలింది కడుపుకోతే. 
...

Sunday, June 25, 2017 - 10:14

రంగారెడ్డి : చిట్టి తల్లి మీనా ఇక సెలవంటోంది..గురువారం సాయంత్రం బోరుబావిలో పడిపోయిన చిన్నారి మీనా ఆదివారం ఉదయం కన్నుమూసింది. 400 ఫీట్ల లోతులో పడిపోయిన మీనా శరీర అవయవభాగాలు బయటకు రావడంతో ఆమె కన్నుమూసిందని మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించడంతో విషాదం నెలకొంది. 60గంటలుగా కొనసాగిన రెస్క్యూ విషాదంగా ముగియడంతో మీనా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం...

Sunday, June 25, 2017 - 09:12

రంగారెడ్డి : బోరుబావులపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ పేర్కొన్నారు. చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో బోరు బావిలో పడిపోయిన మీనా మృతి చెందిందని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. సంఘటన జరిగినప్పటి నుండి ఆదివారం ఉదయం వరకు కలెక్టర్ స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టెన్ టివితో కలెక్టర్ రఘునందన్ రావు మాట్లాడారు....

Sunday, June 25, 2017 - 07:44

రంగారెడ్డి : తెరిచి ఉంచి ఉన్న బోరు బావులను మూసేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు వెల్లడించారు. చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో బోరు బావిలో మీనా మృతి చెందింది. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. బోరు బావిలో పడిపోయిన చిన్నారి మీనాను క్షేమంగా తీయడానికి తాము శతవిధాలన ప్రయత్నించామన్నారు. కింద నుండి ఫ్రషర్ పెట్టి బయటకు తీసేందుకు ప్రయత్నించినట్లు, ఆరేడు గంటల...

Sunday, June 25, 2017 - 07:33

రంగారెడ్డి : చిన్నారి మీనా మృతి చెందడం బాధాకరమని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో బోరు బావిలో మీనా పడిపోయిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయిందని మంత్రి ప్రకటించారు. దీనితో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కుళ్లిపోయిన స్థితిలో చిన్నారి శరీర భాగాలు బయటకొచ్చాయని, చిన్నారి రక్షించేందుకు అన్ని...

Pages

Don't Miss