రంగారెడ్డి
Wednesday, September 16, 2015 - 06:34

రంగారెడ్డి : జిల్లా యాలాల ఎస్ఐ రమేష్‌ అనుమానస్పదస్ధితిలో మృతి చెందాడు. పెద్దముల్‌ మండలం కందనెల్లి గ్రామంలో రమేష్‌ మృతదేహం ఓ చెట్టుకు వేలాడుతోంది. ఉరి వేసుకున్నట్లు ఎస్ఐ రమేష్‌ మృతదేహాం వేలాడుతున్నా, డెడ్‌బాడీ తీరు తెన్నులు చూస్తోంటే ఇది ఆత్మహత్య కాదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎస్ఐ రమేష్‌ తన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కాకుండా మరొక పీఎస్‌ పరిధిలో చనిపోవటం కూడా...

Sunday, September 13, 2015 - 09:26

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చింతల్‌మెట్‌లో నిర్వహించిన కార్డన్‌ సెర్చ్ పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4గంటల నుండి తనిఖీలు నిర్వహించారు. ఉదయం 8.30గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. ఎస్పీ పర్యవేక్షణలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 350 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాలనీ వాసులను ప్రశ్నించారు. చింతల్ మెట్ లో...

Sunday, September 13, 2015 - 06:26

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చింతల్‌మెట్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు బృందాలుగా ఏర్పడిన 300 మంది పోలీసులు.. ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. 

Thursday, September 10, 2015 - 09:48

హైదరాబాద్ : కాలం కాటేస్తోంది.. వరుణుడు దోబుచులాడుతున్నాడు. కరువు ఉరుముతోంది. గద్దెనెక్కిన పాలకుల హామీలు.. నీటిరాతలవుతున్నాయి. వెరసి అన్నదాతలు.. ఆకలి కేకలు, అప్పుల బాధతో అలమటిస్తున్నారు. దారిలేక.. దిక్కుతోచక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా అన్నదాతల తలరాతలు మారడం లేదు.

అప్పుల ఊబిలో...

Wednesday, September 9, 2015 - 10:01

రంగారెడ్డి : శామీర్‌ పేట్‌ ఎస్‌బీహెచ్‌లో దుండగులు దోపిడీకి యత్నించారు. బ్యాంక్‌ కిటికీ గ్రిల్స్‌ తొలగించిన దుండగులు పెట్రోలింగ్‌ పోలీసులు రావడంతో పరారయ్యారు. గ్యాస్‌ కట్టర్లతో బ్యాంకు కిటికీ తెరిచేందుకు దుండగుల విఫలయత్నం చేశారు.

Monday, September 7, 2015 - 13:40

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట టీ.కాంగ్రెస్‌ ఆందోళనకు దిగింది. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, సబిత ఇంద్రారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు మండిపడ్డారు.

Sunday, September 6, 2015 - 12:16

రంగారెడ్డి : జిల్లాలోని మన్నెగూడలో విషాదం చోటు చేసుకుంది. ఓ కార్పొరేట్ స్కూలో లో 9వ తరగతి విద్యార్థి ఛాతి నొప్పితో మృతి చెందాడు. దీనికి స్కూల్ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. దీనితో ఆ ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ ఘటన పూడురు మండలం మన్నెగూడలో చోటు చేసుకుంది. నవీన్ గౌడ్ అనే విద్యార్థి కేశవరెడ్డి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు....

Saturday, September 5, 2015 - 21:14

హైదరాబాద్: ప్రాణ‌హిత చేవెళ్ళపై రంగారెడ్డి జిల్లా ఒక్కటైంది. జెండాలు .. ఎజెండాలు ప‌క్కన‌పెట్టి సింగిల్ ఎజెండాతో ఒక్కటయ్యారు. డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ ఊరువాడ ఉద్యమాన్ని రాజేయాల‌ని పార్టీలు నిర్ణయించుకున్నాయి. కేసీఆర్‌ స‌ర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు రాజ్ భ‌వ‌న్ గ‌డ‌ప‌దొక్కాయి .

ప్రాణహిత - చేవెళ్ల డిజైన్‌ మార్పుతో రాజకీయాల్లో అలజడి

ప్రాణ‌...

Saturday, September 5, 2015 - 18:58

సంగారెడ్డి : గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం అంటే చాలు ఎవ్వరైనా ఎగిరి గంతేస్తారు.. బోలెడు సెలవులు, మంచి జీతం... లైఫ్ హాయిగా ఎంజాయ్ చేయొచ్చనుకుంటారు.. కానీ ఆ టీచర్ మాత్రం అలా భావించలేదు... క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. చిన్నారులకు సులువైన పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారు.. తల్లిదండ్రులతోనేకాదు.. తోటి ఉపాధ్యాయులతోనూ శభాష్ అనిపించుకుంటున్నారు..

...

Saturday, September 5, 2015 - 12:32

హైదరాబాద్ : గోదావరి నది జలాలు రంగారెడ్డి జిల్లాకు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను రంగారెడ్డి జిల్లా అఖిలపక్ష నేతలు కలిశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు రీ డిజైన్ వ్యతిరేకించాలని, దానివల్ల తాగు, సాగునీరు అందక ఇబ్బందులు పడుతారని గవర్నర్ కు తెలిపారు. అనంతరం గవర్నర్ కు వినతిపత్రం అందించారు. ఈ...

Friday, September 4, 2015 - 12:53

రంగారెడ్డి : హయత్ నగర్ బాలిక హాస్టల్ లో గురువారం అర్ధరాత్రి ఓ దుండగుడు ప్రవేశించాడు. దీనితో హాస్టల్ లో ఉన్న బాలికలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా అరుపులు..కేకలు వేయడంతో దుండగుడు పలాయనం చిత్తగించాడు. వార్డెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ బాలికల వసతి గృహంలో పలువురు బాలికలు విద్యనభ్యసిస్తుంటారు. వార్డెన లేకపోవడం చూసిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు...

Pages

Don't Miss