రంగారెడ్డి
Sunday, August 13, 2017 - 18:39

రంగారెడ్డి : మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డి కూతురు వివాహం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కెఎల్ సీసీ కన్వెన్షన్‌లో జరిగింది. వివాహానికి ఎపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

Sunday, August 13, 2017 - 09:52

రంగారెడ్డి : జిల్లా హిమాయత్‌ సాగర్‌ అవుటర్‌ రింగ్‌రోడ్‌పై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఎస్ఐ జలీల్‌ మృతిచెందాడు.. కారులోఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. ట్రైనింగ్‌లోఉన్న జలీల్‌ తన ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

Saturday, August 12, 2017 - 14:43

రంగారెడ్డి : జిల్లాలో స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందింది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని హనుమాన్‌ నగర్‌లో డ్రైవర్‌ బస్సును రివర్స్ తీసుకుని ముందుకు వెళ్లే సమయంలో పక్కనే ఉన్న చిన్నారి మానసను బస్సు ఢీ కొట్టిడంతో మానస అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ సెలవు...

Thursday, August 10, 2017 - 06:28

రంగారెడ్డి : దొరల పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందుకు ప్రజా సంఘాలు ఐక్యం కావాలని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల వేదిక పిలుపు ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనకు బొందపెట్టేందుకు ఐద్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన టీ-మాస్‌ ఆవిర్భావ సభలో ప్రసంగించిన నేతలు చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దొరల పాలనతో బడుగు,...

Wednesday, August 9, 2017 - 21:51

రంగారెడ్డి : పోరాడి సాధించుకున్న తెలంగాణలో బడుగు, బలహీనవర్గాలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కొడుకు బండారం బయటపెట్టినందుకే ప్రజాసంఘాలపై సీఎం కేసీఆర్‌ నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీమాస్‌ సభకు తమ్మినేని హాజరయ్యారు.. ప్రజాగాయకుడు గద్దర్‌, టఫ్‌ అధ్యక్షురాలు విమలక్క కూడా ఈ...

Tuesday, August 8, 2017 - 14:45

రంగారెడ్డి : జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్‌లో 314 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్‌ను తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. రిజర్వాయర్ నిర్మాణం పనుల్లో సహకరించిన అధికారులను స్వామిగౌడ్ అభినందించారు. స్వామిగౌడ్ వెంట ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, వాటర్ వర్క్స్ అధికారులు, టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. 

Tuesday, August 8, 2017 - 11:53

రంగారెడ్డి : జిల్లాలోని హయత్ నగర్ మండలంలో విషాదం నెలకొంది. క్షణికావేశం ఓ విద్యార్థి నిండు ప్రాణం తీసింది. తండ్రి వీడియో గేమ్ సెటప్ కొనివ్వలేదని ఇంజనీర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుంట్లూరులో నివాసముంటున్న శ్రీనివాస్ కుమారుడు అభినవ్, నాదర్ గూల్ లోని ఎంవిఎస్ ఆర్ కాలేజీలో బీ.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో వీడియో గేమ్‌ సెటప్‌ పెట్టించమని అభినవ్... తండ్రి...

Monday, August 7, 2017 - 15:15

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇవాళ్టీ నుంచి ఈనెల 20 వరకు హైఅలర్ట్‌ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. దీంతో ఎయిర్‌పోర్టులో బాంబ్‌స్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌తో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఎయిర్‌పోర్టు లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు అన్ని రకాల పాసులు రద్దు చేసి సందర్శకులకు అనుమతి నిరాకరించారు. 

...
Saturday, August 5, 2017 - 18:14

రంగారెడ్డి : బంగారు ఆభరణాలతో ఉడాయించిన...ఓ నగల వ్యాపారి షాపు ముందు బాధితులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని పాలమాకుల గ్రామంలో ఓ జ్యూవెలరీ షాపు యజమాని... తన కస్టమర్ల వద్ద తీసుకున్న బంగారం..నగదుతో ఉడాయించాడు. దీంతో మోసపోయిన ఐదు వందల మంది బాధితులు షాపు ముందు ధర్నా చేపట్టారు. అనంతరం  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Thursday, August 3, 2017 - 12:33

రంగారెడ్డి : నందమూరి బాలకృష్ణ హీరోగా.. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా.. రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. బాలకృష్ణ 102వ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్‌నిచ్చారు. క్రిష్‌ కెమెరా స్విచ్‌ను ఆన్‌ చేశారు. 

Pages

Don't Miss