రంగారెడ్డి
Wednesday, November 1, 2017 - 16:20
Tuesday, October 24, 2017 - 21:43

రంగారెడ్డి : జిల్లా రాజేంద్రనగర్‌లో ఓ వ్యక్తి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన వెలుగుచూసింది. ఉప్పరపల్లి ఎఎస్ఆర్ అపార్ట్‌మెంట్‌లో... డబ్బు కోసం సలీమ్‌ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని తబస్సుం ట్యాబ్లెట్స్‌ మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇదే విషయాన్ని గతంలో ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే... సలీం రాజకీయ నేత కావడంతో ఆయనపై ఎలాంటి చర్యలు...

Tuesday, October 24, 2017 - 12:01

రంగారెడ్డి : జిల్లా, శంషాబాద్‌ మండలంలో దొంగ హల్‌చల్‌ చేశాడు. తొండుపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆటోలో వస్తున్న భార్యాభర్తల వద్ద నుంచి.. బైక్‌పై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బ్యాగ్‌ ఎత్తుకెళ్లాడు. దీంతో బ్యాగులో ఉన్న రెండు లక్షల నగదు, నాలుగు తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. శంషాబాద్ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు అబ్దుల్‌ జలీల్, అతని భార్య పర్వానా ఫిర్యాదు చేశారు. వీరు మహబూబ్‌...

Tuesday, October 24, 2017 - 09:44

రంగారెడ్డి : శంషాబాద్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సుమారు వంద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. ఇందులో నిబంధనలు పాటించని 5 బస్సుల సీజ్ చేయడంతో పాటు... 6 బస్సులపై కేసులు నమోదు చేశారు. సీజ్‌ చేసిన బస్సుల్లోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి తరువాత సమీపంలోని ఆర్టీసీ డిపోలకు తరలించారు.

Monday, October 23, 2017 - 11:26

రంగారెడ్డి : జిల్లా హయత్‌నగర్‌ మండలం తొర్రూరులో కుక్కలు స్వైర విహారం చేశాయి. గొర్రెలమందపై దాడిచేయడంతో 24 గొర్రెలు చనిపోయాయి. దీంతో గొర్రెల కాపారులు ఆందోళన చెందుతున్నారు. 

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Saturday, October 21, 2017 - 13:14

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో జడ్డా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 612గ్రాముల బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి అండర్ వేర్ కు ప్రత్యేక జేబు ఏర్పాటు చేసుకుని బంగారం తీసుకొచ్చాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో గత పదిరోజుల్లో 3కిలోల 40గ్రాముల బంగారం పట్టుబడింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Wednesday, October 18, 2017 - 16:18

రంగారెడ్డి : జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఐదుగురి మృతి ఘటనలో విచారణ ప్రారంభమైంది. నార్సింగ్ పోలీసులు రామచంద్రాపురంలో ఉన్న ప్రభాకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో ల్యాప్ టాప్, సెల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్ పత్రాలు డీమార్ట్ షేర్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చినిపోయిన ప్రభాకర్ రెడ్డి, లక్ష్మి ఫోన్లు ఇంతవరకు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ...

Pages

Don't Miss