శ్రీకాకుళం
Thursday, April 27, 2017 - 08:36

శ్రీకాకుళం : పలాస కాశీబుగ్గ మున్సిపల్‌ కమిషనర్‌ జగన్మోహన్‌ రావుపై దాడి జరిగింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను పురపాలక సంఘం చైర్మన్‌ పూర్ణ చంద్ర మరో ఇద్దరు కౌన్సిలర్లు కలిసి కొట్టారని జగన్మోహన్ రావు ఆరోపించారు. వాళ్ల అవినీతికి తాను సహకరించకపోవడం వల్లే దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Wednesday, April 26, 2017 - 16:17

కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదు..ఒంటిరిగా పోరాటం చేస్తోంది...అత్తింటి ముందు మౌనపోరాటం..న్యాయం జరిగే వరకు కదలంటున్న ఇల్లాలు..విశాఖలో వీధిన పడిన మరో ఇల్లాలు..

పోలీసుతో పెళ్లి అయ్యింది..బాగానే ఉందని అనుకున్నారు..కానీ కొన్నాళ్లకే అత్తింటి వారు విశ్వరూపం చూపించడం మొదలు పెట్టారు..డబ్బు కోసం నిత్యం హింసించారు. భర్త బోర్డర్ లో పనిచేస్తుండగా ఆ ఇంటి కోడలిని పుట్టింటికి పంపారు. భర్త...

Saturday, April 15, 2017 - 06:47

శ్రీకాకుళం : చేపలవేట నిషేధంతో మత్స్యకార కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు వేటకు వెళ్లలేక... ఇటు ప్రభుత్వం పరిహారం ఇవ్వక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.. ఈ ఏడాది నిషేధం మరో 15రోజులు పెంచడంతో గంగపుత్రుల జీవితాలు దయనీయంగా మారాయి. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఏప్రిల్‌ 15 నుంచి ప్రభుత్వం చేపలవేట నిషేధించడంతో ఏంచేసి బతకాలో తెలియక ఆవేదన...

Thursday, April 13, 2017 - 13:36

శ్రీకాకుళం : జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండలతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వాతవరణ కాలుష్యం కారుణంగా ఎండలు పెరిగాయని స్థానికులు పేర్కొంటున్నారు. అన్నారు.చిన్న పిల్లలు ఎండల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి స్కూల్ టైమింగ్ మధ్యాహ్నం 12 గంటలకు కాకుండా ఉదయం 11 గంటల వరకే ఉండాలని అన్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30వరకు బయటకు ఎవరు వెళ్లడం లేదని తెలిపారు. మరిన్ని...

Saturday, April 1, 2017 - 18:05

శ్రీకాకుళం : జిల్లాలో ఎలుగుబంట్లు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలోని జీడితోటల్లో తిష్టవేసి ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఎలుగుబంట్ల దెబ్బకు తోటల్లోకి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు.  
బెంబేలెత్తిపోతున్న స్థానికులు 
శ్రీకాకుళం జిల్లా ఎలుగుబంట్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. పంట పొలాల్లో సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి....

Friday, March 31, 2017 - 12:38

శ్రీకాకుళం : కొడుకుల ఆదరణ కరువై... శ్రీకాకుళం జిల్లా.. పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామంలో ఓ తండ్రి ఆందోళన చేపట్టాడు. కాస్తంతా నీడనివ్వాలని కోరుతూ ధర్మారావు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాడు. ఫోర్జరీ సంతకాలతో తన యావత్ ఆస్తిని లాక్కున్న బిడ్డల నుంచి తనకు న్యాయం చేయాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగాడు.

ధర్మారావుకు ఇద్దరు కొడుకులు...

Thursday, March 30, 2017 - 06:56

శ్రీకాకుళం :జిల్లాలో ఎలుగుబంట్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. పంట పొలాల్లో సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పలాస, వజ్రపుకొత్తూరు, మందస తదితర గ్రామాల్లో ఎలుగుబంట్ల తాకిడి ఎక్కువైంది.

ఉద్దాన ప్రాంతంలోని జీడితోటల్లో ...

ఉద్దాన ప్రాంతంలోని జీడితోటల్లో పగటిపూట ఎలుగుబంట్లు తిష్టవేసి జీడిపిక్కలను తిని...

Tuesday, March 28, 2017 - 12:27

శ్రీకాకుళం : చింతపండు గిరిపుత్రులకు చింతలే మిగిలుస్తోంది. అమ్మేందుకు గిట్టుబాటు ధర ఉండక.. గిరిజన సహకార సంస్థ చేయూత లేక.. శ్రీకాకుళం జిల్లాలో చింతపండు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
చింతపండు రైతుల ఇబ్బందులు 
శ్రీకాకుళం జిల్లాలో చింతపండు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింతపండు సీజన్ ముగియడంతో అమ్మకాలకు రైతులు సిద్ధమయ్యారు. జిల్లాలోని...

Saturday, March 18, 2017 - 06:54

శ్రీకాకుళం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినందకు మంత్రి అచ్చెంనాయుడు తనను వేధిస్తున్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళ్యాణి అనే మహిళ ఆరోపిస్తోంది. ఆమదాలవలస మండలం కోర్లకోటకు చెందిన కళ్యాణి ఆర్.అండ్.బిలో క్లాస్ ఫోర్ ఎంప్లాయిగా పనిచేస్తోంది. పైఅధికారులు తనను వేధిస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులపైనే కంప్లైంట్ చేస్తావా అంటూ మంత్రి...

Pages

Don't Miss