శ్రీకాకుళం
Wednesday, May 16, 2018 - 08:46

శ్రీకాకుళం : గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలకోసం టీడీపీ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా  ఎస్సీ ఎస్సీలకు 75 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇకమీదట విద్యుత్‌ ఛార్జీలను పెంచబోమన్నారు... వీలైతే కరెంటు ఛార్జీలను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు చెప్పారు.   శ్రీకాకుళం జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం...

Tuesday, May 15, 2018 - 07:44

శ్రీకాకుళం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. సావరకోట మండలంలో బొంతు ఎత్తిపోతల పథకానికి ఆయన ఇవాళ శంకుస్థాపన చేస్తారు. ఇదే మండలంలోని పలు గ్రామాల్లో సీఎం పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బొంతు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీకాకుళం...

Monday, May 14, 2018 - 19:47

శ్రీకాకుళం : పెద్దల మీద కక్ష సాధించేందుకు ఏడేళ్ల పసివాడిని అపహరించి దారుణంగా హత్య చేసిన ఘటన మానవత్వానికే మాయని మచ్చలా కనిపిస్తోంది. సావరకోట మండలం గుమ్మపాడులో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన ఘటనతో స్థానికంగా కలకలం రేపింది. టీడీపీ నేత అయిన హర్షవర్థన్ అనే ఏడేళ్ల బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా పాతకక్షలతో బంధువులే...

Monday, May 14, 2018 - 06:39

విజయవాడ : ఉప‌రితల ఆవ‌ర్తనం ప్రభావంతో కురుసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. ఉరుములు పిడుగుల‌తో కూడిన వ‌ర్షానికి పలుప్రాంతాల్లో ప్రజలు హడలిపోయారు. పిడుగు పాటుకు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఏడుగురు మరణించారు. మ‌రో రెండు రోజుల పాటు ఉప‌రిత ఆవ‌ర్తన ప్రభావం ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ అధికారులు ప్రకటించారు. దీంతో ఉత్తరాంధ్రాలోని ప‌లు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ...

Sunday, May 13, 2018 - 16:05

శ్రీకాకుళం : మామిడి చెట్టు కొమ్మలకు పూత పూయడం.. కాయలు కాయడం సహజం. ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం.. కానీ ప్రకృతి సహజత్వానికి భిన్నంగా.. చెట్టు మొదలుకే కాయలు కాయడమంటే అదొక వింతే. అలాంటి వింత శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. మొదలుకే కాయలు కాస్తున్న వింత మామిడి చెట్టును చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. 
మొదలుకే కాయలు కాస్తున్న మామిడిచెట్టు.. 
...

Saturday, May 12, 2018 - 15:53

శ్రీకాకుళం : రామునిపాలెంలో ఆకతాయిలకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. మహిళలు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తున్న నలుగురు యువకులను స్థానికులు పట్టుకొని చెట్టుకట్టేసి చితక్కొట్టారు. లావేరు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Saturday, May 12, 2018 - 09:17

శ్రీకాకుళం : రంగు, రుచితో నోరూరించే మధుర ఫలాల్లో... నేడు రంగు మాత్రమే మిగిలి.. మాధుర్యం మాయమైంది.. కృత్రిమ పద్ధతిలో మగ్గిస్తుండడంతో... మామిడి పళ్ళలో రుచికంటే.. అనారోగ్య కారకాలే ఎక్కువగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నాణ్యత లేక వినియోగదారులు, దిగుబడి లేక రైతులు ఆందోళన చెందుతున్నారు
రసాయనాలతో రుచిలేని మామిడి పళ్ళు
రంగు, రుచిగల.. శ్రీకాకుళం మామిడి...

Wednesday, May 9, 2018 - 10:48

హైదరాబాద్ : బీటెక్‌ చదువుకుంది.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది.. అయితే ఆ పెళ్లి ఇష్టం లేదన్న కోపంతో... స్కెచ్‌ వేసి... సుపారీ ఇచ్చి మరీ భర్తను మట్టుబెట్టించింది. చివరకు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ ఉద్యానవనం దగ్గర్లో సోమవారం జరిగిన నవదంపతులపై దాడి ఘటన ఊహించని మలుపు తిరిగింది....

Wednesday, May 9, 2018 - 10:23

ఢిల్లీ : ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న శ్రీకాకుళం, విశాఖ యాత్రికులు క్షేమంగా ఉన్నారు. వాతావరణం అనుకూలించడంతో చార్ ధామ్ నుండి యాత్రికుల వాహనాలు బయలుదేరాయి. ఎడతెరిపి లేని మంచు వర్షంతో 104 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందులో ఉపాధి హామీ పనులను పరిశీలించడానికి వెళ్లిన శ్రీకాకుళం జడ్పీ ఛైర్మన్ చౌదరి ధనలక్ష్మీ నేతృత్వంలోని 39 మంది సభ్యుల బృందం కూడా చిక్కుకుంది....

Wednesday, May 9, 2018 - 09:15

శ్రీకాకుళం : ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ లో మంచు వర్షంలో చిక్కుకపోయిన తామంతా సేఫ్ గా ఉన్నామని సిక్కోలు జడ్పీ ఛైర్ పర్సన్ ధనలక్ష్మీ పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల నిమిత్తం అక్కడకు వెళ్లిన జడ్పీ బృందం మంచు వర్షంలో చిక్కుపోయిన సంగతి తెలిసిందే. 104 మందిలో 39 మంది సిక్కోలు జడ్పీటీసీలు, అధికారులు సురక్షితంగా ఉన్నారు. మిగతా 65 మంది ఆచూకి తెలియాల్సి ఉన్నట్లు సమాచారం. తామంతా సేఫ్ గా...

Wednesday, May 9, 2018 - 08:15

ఢిల్లీ : ఉత్తరాఖండ్ చార్ ధామ్ లో విపరీతమైన మంచు వర్షం కురుస్తోంది. దీనితో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులు చిక్కుకపోయారు. అందులో ఏపీకి రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన 39 మంది జడ్పీ బృందం చిక్కుకపోయారు. ఉపాధి హామీ పనుల పరిశీలనకు ఈనెల 3న ఉత్తరాఖండ్ కు వీరు వెళ్లారు. జడ్పీ ఛైర్మన్ చౌదరి ధనలక్ష్మీ నేతృత్వంలో బృందం బయలుదేరింది. మంచు వర్షం కారణంగా సీతాపురిలో వీరంతా...

Pages

Don't Miss