శ్రీకాకుళం
Saturday, October 21, 2017 - 18:11

శ్రీకాకుళం : ఒడిషా అధికారుల అకస్మిక చర్యతో జిల్లాకు భారీగా నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో వంశాధర ప్రాజెక్టుకు భారీగా నీరు పోటెత్తింది. దీనితో నీటిని విడుదల చేయడంతో శ్రీకాకుళం జిల్లాకు వరద పోటెత్తింది. జిల్లాలోని వేలాది ఎకరాల పంట నీట మునిగాయి. ఏపీ అధికారులకు ఒడిశా అధికారులు ఆలస్యంగా సమాచారం ఇచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పలు గ్రామాలు జలదిగ్భందంలో...

Saturday, October 21, 2017 - 11:06

శ్రీకాకుళం : జిల్లా హిరామండలంలోని గొట్టా బ్యారేజ్‌కు వరద పోటెత్తింది. దీంతో 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గొట్టా బ్యారేజీ వద్ద 62 వేల క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో ఉంది. మరోవైపు..గేట్లు ఎత్తివేయడంతో కొత్తూరు మండలంలోని మాతలనివగం, మాధనాపురం, ఆకుల తంపర, అంగూరు గ్రామాల్లో...

Thursday, October 19, 2017 - 12:29

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. పూరీకి దక్షిణ ఆగ్నేయంగా 370 కి.మీ, చంద్బలికి 470 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 18 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పూరి- చంద్ బలీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాకు భారీ వర్షం సూచన వుందని తెలిపింది.

Sunday, October 15, 2017 - 06:53

కృష్ణా : ఎన్నో కలలతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి అడుగుపెట్టారు. భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలనే లక్ష్యంతో చదువుకుంటున్నారు. అంతలోనే వారికి ఏమైంది? జీవితం అంటేనే ఎందుకు అంత విరక్తి కలిగింది? ఒత్తిడా? ప్రేమ వ్యవహారాలా? కుటంబసమస్యలా? కారణాలు ఏవైనా కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో రెండు విద్యా కుసుమాలురాలిపోయాయి. మూడురోజుల తేడాలో ఇద్దరు విద్యార్ధులు బలవంతంగా ప్రాణాలు...

Saturday, October 14, 2017 - 12:54

శ్రీకాకుళం : జిల్లాలోని సోంపేట మండలం బారువలో ఉన్న బాలజీ గోశాలలో మూగజీవాలకు ఎదురవుతున్న పరిస్థితి ఇది. ఆరేళ్ల క్రితం కబేళాకు తరలిపోతున్న ఆవులను సంరక్షించి.. వాటి ఆలనపాలన కోసం ఈ గోశాలను ఏర్పాటు చేశారు. సౌరబ్‌ గౌర్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఈ గోశాలకు భారీగానే నిధులు ఇచ్చారు. అంతేకాదు.. బయట నుంచీ విరాళాలు విరివిగా అందాయి. అయితే ప్రస్తుతం ఈ గోశాల పరిస్థితి...

Friday, October 13, 2017 - 21:01

శ్రీకాకుళం : కొన్ని మాయమవుతున్నాయి..! కొన్ని ప్రాణాలు విడుస్తున్నాయి...! మరికొన్ని... బక్కచిక్కి... చావుకు దగ్గరగా ఉన్నాయి.! బాధ చెప్పుకోవడానికి నోరులేక... ఆకలి తీర్చే నాథుడు లేక అలమటిస్తున్నాయి.! అడిగే వారు.. ఆదుకునేవారు లేక...రోధిస్తున్నాయి.. ఇదీ.. శ్రీకాకుళం జిల్లాలోని గోశాలలోని మూగజీవాల వ్యథ. 
బాలాజీ గోశాలలో దీనావస్థలో గోవులు
ఈ దృశ్యాలు.....

Thursday, October 12, 2017 - 20:09

శ్రీకాకుళం : వంశధార నిర్వాసితుల పునరావాసానికి సంబంధించిన ప్యాకేజీలపై ప్రభుత్వం వెంటనే సంప్రదింపులు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. అంతకంటే ముందు గ్రామాలు ఖాళీ చేయించేందుకు కలెక్టర్ ప్రకటించిన షెడ్యూల్‌ను కూడా ఉపసంహరించుకోవాలని కోరారు. నిర్వాసితులను పరామర్శించడానికి వచ్చిన తమను ప్రభుత్వం పోలీసుల ద్వారా అణగదొక్కించే ప్రయత్నం చేస్తోందన్నారు సీపీఐ రాష్ట్ర...

Wednesday, October 11, 2017 - 19:39

శ్రీకాకుళం : వంశధార నిర్వాసితులకు మద్దతుగా వారిని కలిసేందుకు వెళ్తున్న వామపక్ష నేతలను వరుసగా రెండోరోజూ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను అరెస్ట్ చేసి ఆముదాలవలస పీఎస్‌కు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Tuesday, October 10, 2017 - 22:03

శ్రీకాకుళం : ఛలో వంశధార ఉద్రిక్తంగా మారింది. వంశధార నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న అఖిలపక్ష నేతలను శ్రీకాకుళం నగర పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పలువురు వైసీపీ నేతలను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వంశ‌ధార నిర్వాసితుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తాము చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం...

Tuesday, October 10, 2017 - 15:38

శ్రీకాకుళం : సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి పి.మధును పోలీసులు అరెస్టు చేశారు. వంశధార నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న అఖిలపక్ష నేతలను శ్రీకాకుళం నగరంలో పోలీసులు అడ్డుకున్నారు. మధుతోపాటు , నిర్వాసిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాబురావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు మరో ఇరవై మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వంశ‌ధార గ్రామాల్లోని...

Pages

Don't Miss