శ్రీకాకుళం
Sunday, February 28, 2016 - 13:45

శ్రీకాకుళం : జిల్లాలో వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. పాడలి, దుగ్గుపురం నుంచి సిపిఎం ఆధ్వర్యంలో నిర్వాసితులు భారీ ర్యాలీ నిర్వహించారు. రిజర్వాయర్‌ వద్ద నిర్వాసితుల ర్యాలీని పోలీసులు అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రాజెక్ట్‌ వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వాసిత ప్రాంతాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్‌ అమల్లో ఉంది.

Friday, February 26, 2016 - 18:34

శ్రీకాకుళం: విద్యార్థులు, యువతీ యువకులకోసం మరో విలువైన యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఏయే కాలేజీలో ఎలాంటి కోర్సులున్నాయి? వాటి ఫీజులు, స్కాలర్‌షిప్‌ వివరాలేంటి? ఉపాది అవకాశాలు ఎలా ఉన్నాయి? ఉద్యోగావకాశాలు, ఇందుకోసం అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌లాంటి అంశాలు ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. గురజాడ ఎడ్యుకేషన్‌ సొసైటీ పూర్వ విద్యార్థిని లిజి కళాధర్ ఈ యాప్‌ను తయారుచేశారు.

Sunday, February 21, 2016 - 13:38

శ్రీకాకుళం : ఆడదానికి ఆడదే శత్రువు అని మరోసారి రుజువైంది. అనారోగ్యంతో ఉన్న అత్తను అక్కున చేర్చుకొని సపర్యలు చేయాల్సిన కోడళ్లు..రాక్షసత్వం ప్రదర్శించారు. ఆస్పత్రిలో ఉన్నన్నీ రోజులు ఎలాగు పట్టించుకోని వాళ్లు..ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వచ్చిన ఆమెను లోపలికి రానీయరాకుండా ఇంటికి తాళాలు వేశారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన కోడలిద్దరికి స్థానికులు తగిన బుద్ది...

Friday, February 19, 2016 - 06:20

హైదరాబాద్ : హోరాహోరీగా సాగిన ఎపీఎస్ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ స్వల్ప ఆధిక్యత సాధించింది. ఎంప్లాయీస్‌ యూనియన్‌పై ఎన్ఎంయూ కేవలం 173 ఓట్లతో ఆధిక్యంలో నిలిచింది. ఎన్ఎంయూకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పోస్టల్‌ బ్యాలెట్లు కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓట్లు వెయ్యికిపైగా ఉన్నాయి. విధి నిర్వహణలో భాగంగా పోలింగ్‌ రోజు దూరప్రాంతాలకు...

Monday, February 15, 2016 - 21:24

హైదరాబాద్ : సీపీఎం ప్రధాన కార్యాలయంపై సంఘ్‌పరివార్‌ శ్రేణుల దాడిని నిరసిస్తూ వామపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీపీఎం కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సీపీఎం కార్యాలయంపై దాడిని నిరసిస్తూ విజయవాడలో...

Sunday, February 14, 2016 - 21:31

హైదరాబాద్ : సీపీఎం కేంద్ర కార్యాలయంపై సంఘ్‌పరివార్‌ దాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీపీఎం కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగులపెట్టారు. సంఘ్‌ పరివార్‌ చర్యలను తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ అనుబంధ సంఘ్‌పరివార్‌ శ్రేణులు మరోసారి తమ అసహనాన్ని బయటపెట్టాయి. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడికి తెగబడ్డాయి. సంఘ్‌పరివార్‌ దాడికి నిరసనగా దేశ...

Sunday, February 14, 2016 - 15:44

శ్రీకాకుళం : జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో.. రథసప్తమి సందర్భంగా.. అధికారులు విఐపీల సేవలో తరించారు. అర్ధరాత్రి నుంచి క్యూలలో వేచివున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సామాన్యులను ఇబ్బంది పాల్జేస్తున్న ఆలయ సిబ్బంది తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో ఆదివారం రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యనారాయణ స్వామి మహాభిషేకానికి...

Sunday, February 14, 2016 - 11:46

శ్రీకాకుళం : అన్ని పాఠశాలలో సూర్య నమస్కారాలు అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీనరసింహం తెలిపారు. అరసవెల్లిలో రథసప్తమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సంరద్భంగా టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.  రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. గవర్నర్, రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు వస్తారని తెలిపారు. దేశంలో నిత్య పూజలందుకుంటున్న ఏకైక ఆలయం అరసవెల్లి...

Sunday, February 14, 2016 - 09:41

శ్రీకాకుళం : అరసవెల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్‌ లక్ష్మీ నరసింహం అరసవెల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో 5 కిలోమీటర్ల మేర క్యూలైన్‌లో భక్తులు నిలుచున్నారు. మరో...

Wednesday, February 10, 2016 - 16:48

శ్రీకాకుళం : జిల్లాలోని ట్రైమెక్స్ కర్మాగారం అడ్డగోలుగా చేస్తున్న మైనింగ్ వ్యవహారంపై 10 టీవీ కథనానికి ప్రజల్లో అధికారుల్లో స్పందన వస్తోంది. అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ హెచ్చరికలు పట్టించుకోకుండా యధేచ్చగా మైనింగ్ పాల్పడుతు న్న కంపెనీపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా అరుదైన ఆలీవ్ తాబేళ్లు అంతరించిపోతున్నాయని పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం...

Tuesday, February 9, 2016 - 15:57

హైదరాబాద్ : ట్రైమెక్స్‌..! ఈ సంస్థ కార్యకలాపాలు.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారాయి. పాలక పెద్దల దన్నుతో ఖనిజాలను యధేచ్ఛగా దోచేస్తోందని ఈ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు శాసనసభ ప్రజాపద్దుల కమిటీయే.. ట్రైమెక్స్‌ అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు చేసింది. నిగ్గు తేలేవరకూ తవ్వకాలు ఆపేయాలంటూ ఈ కమిటీ ఆదేశాలు...

Pages

Don't Miss