శ్రీకాకుళం
Monday, October 9, 2017 - 19:28

శ్రీకాకుళం : అరసవెల్లి సూర్యదేవుడి ఆభరణాలు సురక్షితమేనా..? భక్తుల కానుకలు అన్నీ కలిపినా దేవుడి బంగారం 13 కిలోలేనా..? దేవుడి ఆభరణాలు ఎవరి దగ్గరుండాలి..? సంరక్షణ బాధ్యత ఎవరిది..? ఆంధ్రప్రదేశ్‌లోని అరసవెల్లిలోని సూర్యదేవుడి ఆలయం.. మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ దేవుడి ఆభరణాల లెక్కలే ఈ వార్తలకు మూలమయ్యాయి. దాతలు ఇచ్చిన విరాళాల ఆధారంగా స్వామివారికి 13 కిలోల బంగారం, 425 కేజీల వెండి...

Saturday, October 7, 2017 - 07:42

శ్రీకాకుళం : జిల్లాలోని వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించకపోవడం సిగ్గుచేటని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు మండిపడ్డారు. 90శాతం మంది వంశధార నిర్వాసితులకు ఇళ్లులేవన్నారు.  నిర్వాసితులను కలవడానికి వెళ్లిన వారిని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తక్షణమే వంశధార నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కోరారు.  ...

Tuesday, October 3, 2017 - 13:34

శ్రీకాకుళం : ఆ గ్రామంలో యాబై గడపలు, నూటా యాబైకి పైగా జనాభా. కానీ ఇదంతా గతం. ఇప్పుడు గ్రామం అంతా ఖాళీ అయ్యింది. ఒకే కుటుంబం మిగిలిపోయింది. సిక్కోలు జిల్లాలో కనుమరుగవుతున్న కరణాలపేటపై 10టీవీ కథనం. చుట్టూ పచ్చని పోలాలు, కొబ్బరి చెట్లు, ప్రకృతి రమణీయత కల్గి ఆహ్లాదకరమైన వాతవరణం ఉన్న ఈ గ్రామం పేరు కరణాల పేట. ఇది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఉంది.ఈ గ్రామంలో ఒకప్పుడు 50 కుటుంబాలు...

Monday, October 2, 2017 - 14:54

శ్రీకాకుళం: చుట్టూ పచ్చని పోలాలు, కొబ్బరి చెట్లు, ప్రకృతి రమణీయత కల్గి ఆహ్లాదకరమైన వాతవరణం ఉన్న ఈ గ్రామం పేరు కరణాల పేట. ఇది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఉంది.ఈ గ్రామంలో ఒకప్పుడు 50 కుటుంబాలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఒకే ఒక కుటుంబం నివాసముంటోంది. కుటుంబమంటే నలుగురో ఐదుగురో అనుకునేరు. కేవలం ఇద్దరే. ఆ ఇద్దరే ఈ గ్రామంలో నివాసముంటున్నది.

కొన్ని దశాబ్దాల కిందట...

Thursday, September 28, 2017 - 15:55

శ్రీకాకుళం : పట్టణ జనాభా పెరిగిపోతోంది. ఇరుకురోడ్లు, వాహనాల రద్దీతో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్‌ నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారింది. దీన్ని అదిగమించేందుకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.  ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు పరికరాలు పెద్ద  ఎత్తున కొనుగోలు చేస్తోంది. 

ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం...

Wednesday, September 27, 2017 - 20:04

శ్రీకాకుళం : పురపాలక ఉన్నతపాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వడంతో కొంతమంది ఆకతాయిలు రాత్రి సమయాల్లో ఇక్కడ మద్యం సేవించి వరండాలలో బాటిళ్లు, తినుబండారాలు వదిలివెళ్తున్నారు. దీంతో పాఠశాల పరిసరాలన్నీ బార్‌లను తలపిస్తున్నాయి. రాత్రి సమయాల్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నా... పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు యువత తప్పుదారి...

Wednesday, September 27, 2017 - 08:42

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన లీడర్లు ఎందరో ఉన్నారు.. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా.. ఆయాపార్టీల్లో కీలక వ్యక్తులుగా పనిచేసిన అనుభం వీరి సొంతం. అయినా.. ప్రస్తుత పాలిటిక్స్‌లో తమ రాజకీయ భవిష్యత్తుపై చాలా మంది సీనియర్‌నేతలు సందిగ్ధంలో పడిపోయారు. కొండ్రు మురళి... కాంగ్రెస్ పార్టిలో ఎచ్చెర్ల, రాజాం ఎస్సి రిజర్వు స్థానం నుండి రెండు సార్లు గెలిచిన...

Saturday, September 23, 2017 - 12:39

శ్రీకాకుళం : జిల్లాలో సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వంశధార నిర్వాసితులను కలిసేందుకు వెళ్తుండగా సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణతోపాటు 30 మందిని అరెస్టు చేశారు. కొత్తూరు మండలం నవతల జంక్షన్ లో నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కార్యర్తలను నడిరోడ్డుపై విచక్షణారహితంగా ఈడ్చుకెళ్తూ తీసుకెళ్లి వ్యాన్ లో పడేశారు...

Saturday, September 23, 2017 - 10:00

శ్రీకాకుళం : చంద్రబాబు ప్రభుత్వానికి పోలీసులు ప్రైవేట్‌ సైన్యంలా వ్యవహరిస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వేస్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వంశధార నిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టు చేపట్టడం తగదన్నారు. వంశధార నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు సీపీఎం...

Wednesday, September 20, 2017 - 19:39

శ్రీకాకుళం : పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీకి ఉత్తరాంధ్ర కంచుకోట. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆదుకుంది సిక్కోలు జిల్లాలే. అయితే ఈ జిల్లాలో ఐదుగురు మంత్రులున్నప్పటికీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం కొరవడింది. ఇప్పుడిదే తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది. ఈ సందర్భంలోనే మంత్రి నారాలోకేష్‌ ఉత్తరాంధ్ర పర్యటన ఆసక్తిగా మారింది. ఈ నెల 18, 19 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో లోకేష్...

Pages

Don't Miss