శ్రీకాకుళం
Wednesday, December 9, 2015 - 11:23

శ్రీకాకుళం : జిల్లాలోని రాజాంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస్‌ జూట్‌ మిల్‌ లాకౌట్‌ ప్రకటించింది. కార్మికులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కంపెనీ లాకౌట్‌ ప్రకటించింది. ఈ చర్యతో సుమారు 300 మంది కార్మికుల జీవితాలను యాజమాన్యం అగమ్య గోచరంగా మార్చింది. కంపెనీ లాకౌట్‌ పట్ల కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యక్షంగా 300 మంది,...

Monday, December 7, 2015 - 18:50

శ్రీకాకుళం : పేదరిక నిర్మూలనే టిడిపి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో జరిగిన జనచైతన్య యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నీ ఆ దిశగానే ఉంటున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. రైతు రుణాలను మాఫీ చేస్తున్న ఘనత తమకే దక్కుతుందని పేర్కొన్నారు.

 

Sunday, December 6, 2015 - 15:30

శ్రీకాకుళం : నామినేటెడ్ పోస్టుల భర్తీ నిరంతర ప్రక్రియ అని ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావ్ పేర్కొన్నారు. ఆయన జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా టెన్ టివితో మాట్లాడారు. త్వరలో మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు. బీజేపీతో సమన్వయం లోపం లేదని, ఏవైనా విబేధాలు వస్తే పరిష్కరించుకుందామని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీలోకి రావాలని అనుకున్న వారి విషయంలో ఆలోచిస్తున్నామని...

Sunday, December 6, 2015 - 14:47

శ్రీకాకుళం : రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందని వారు చేస్తున్న విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏపీ టీడీపీ పార్టీ అధ్యక్షులు కళావెంకటరావు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్యకార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. 7న వజ్రపుకొత్తూరు, విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని తెలిపారు.

Sunday, December 6, 2015 - 11:46

శ్రీకాకుళం : పాఠాలు చెప్పాల్సిన గురువు... విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. జిల్లాలోని రాజాం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో స్థానికులు సదరు ఉపాధ్యాయుడిని నిలదీయడంతో గొడవ చెలరేగింది. స్థానికులు ఉపాధ్యాయుడిని చితకబాదారు. ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

Friday, December 4, 2015 - 19:41

శ్రీకాకుళం : జిల్లా వజ్రపుకొత్తూరులో ఈనెల 7వ తేదీన చంద్రబాబు పర్యటనకు భావనపాడు పోర్టు నిరసన గుబులు పట్టుకుంది. జిల్లాకు వచ్చే సీఎంకు తమ సమస్యలు చెప్పుకోవాలని భావనపాడు బాధితులున్నారు. మరోవైపు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే అడ్డుకుంటామని ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు పోలీసులు భారీ...

Wednesday, December 2, 2015 - 13:24

శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్థవ్యస్తం అయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. స్వర్ణముఖీ నది ఉగ్రరూపం దాల్చుతోంది. తొట్టంబేడు మండలం కొత్తకండ్రిక వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో..కేవీపురం మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా...

Monday, November 23, 2015 - 20:57

శ్రీకాకుళం : రాముడు దేవుడు.. రావణుడు రాక్షసుడు..! ఇదీ జనాంతికం. కానీ.. సిక్కోలులోని ఓ గ్రామం దీనికి భిన్నం. వారికి రాముడే కాదు.. రావణుడూ పూజనీయుడే. అందుకే.. రావణుడి ప్రతిమను ఏర్పాటు చేసి.. నిత్య పూజలు చేస్తున్నారు. ఎందుకిలా..? వారు రావణుణ్ణి ఆరాధించడానికి కారణం ఏమిటి..? వాచ్‌ దిస్ స్టోరీ.
రావణుడు.. మహనీయుడు..
రాముడు హీరో.. రావణుడు విలన్‌..! ఏ...

Sunday, November 22, 2015 - 16:40

శ్రీకాకుళం : గాంధీ, అంబేద్కర్‌, నెహ్రూ లాంటి ఎంతో మంది మహాత్ములు తమ జీవితాలను దేశానికి అంకితం చేశారు. జైళ్లలో గడిపారు... లాఠీ దెబ్బలు తిన్నారు... పోరాటాలు చేశారు. ప్రతిమదిలో నిలిచిపోయారు. జాతికి మార్గదర్శకులయ్యారు. అందుకే వారి స్ఫూర్తి పదికాలాల పాటు అందరికీ గుర్తుండే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేశారు. చేస్తున్నారు. కానీ ఆ ఏర్పాటులో నిబంధనలకు నీళ్లు వదులుతుండడంతో మెచ్చుకోదగినవారు...

Saturday, November 21, 2015 - 17:55

శ్రీకాకుళం : జిల్లాలోని పలాస మండలం మొగిలిపాడులోని ఓ జీడి పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వందలాది బస్తాల జీడీ నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు మూడు కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు.మందుగా స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలానికి...

Saturday, November 14, 2015 - 20:19

శ్రీకాకుళం : జిల్లాలో గన్ కల్చర్ భయాందోళనలకు గురిచేస్తోంది. ఆధార్ కార్డు అనుసంధానం చేస్తామంటూ ఒక ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు యువకులు వృద్ధదంపతులకు తుపాకీ చూపించి బెదిరించి కత్తులతో దాడి చేశారు . శ్రీకాకుళం పట్టణం లో సాయిబుల తోటలో నివాసం ఉంటున్న రిటైర్డ్ విద్యుత్ శాఖా ఉద్యోగి అందవరపు భూషణ్ రాజు దంపతులను ముగ్గురు యువకులు గన్ చూపించి బెదిరించారు. భూషణ్‌ రాజును తీవ్రంగా...

Pages

Don't Miss