శ్రీకాకుళం
Saturday, May 13, 2017 - 16:22

శ్రీకాకుళం : మెట్ట శంకర్‌రావు.. ఈ పేరు చెబితే చాలు శ్రీకాకుళం జిల్లా ఉలిక్కిపడుతుంది. భయంతో వణికిపోతుంది. జలుమూరు మండలం, మెట్టపేట గ్రామానికి చెందిన ఈ మాజీ జవాను.. ఏడుగురిని పొట్టన పెట్టుకున్న హంతకుడు. శంకర్‌రావు 2005లో తన భార్య హత్య కేసులో.. ఏడేళ్ల జైలు శిక్షను అనుభవించాడు. అప్పట్లో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని గ్రామస్తులను వేడుకున్నాడు. కానీ వారు శంకర్‌రావుకు...

Saturday, May 13, 2017 - 12:44

శ్రీకాకుళం : పలాస కాశీబుగ్గ పారిశ్రామిక వాడలో.. 170 జీడి పరిశ్రమలు కార్మికుల సమ్మెతో మూత పడ్డాయి. వేతనం పెంపుపై కార్మికులు, యాజమాన్యాల వాదన వేరుగా ఉంది. 50 శాతం కూలీ ధర పెంచాలని కార్మిక సంఘాలు పట్టు బడుతున్నాయి. అయితే 9 శాతమే పెంచేందుకు ఇండస్ట్రీ యాజమాన్యాలు అంగీకరిస్తున్నాయి.

జీడి ఇండస్ట్రీస్ ...

Saturday, May 13, 2017 - 11:48

శ్రీకాకుళం : జిల్లాలో సైకో శంకర్‌రావు హత్యకు గురయ్యాడు. ఎల్‌ఎన్‌ పేట మండలంలో శంకర్‌రావు శవమై తేలాడు. 2010 నవంబర్‌ 30న ఏడుగురిని శంకర్‌రావు హత్యచేశాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న శంకర్‌రావును ప్రత్యర్థులు చంపేశారు. ఈ కేసులో పోలీసులకు ఇద్దరు సరైండర్‌ అయినట్లు తెలుస్తోంది

Friday, May 12, 2017 - 14:53

రంగారెడ్డి : తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తమోడాయి. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. మరికొంతమంది చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. నలుగురు స్పాట్ లో చనిపోయారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు...

Friday, May 12, 2017 - 11:53

శ్రీకాకుళం : ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద చెట్టును ఢీకొట్టి డబుల్‌డెక్కర్‌ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న లోయలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు చెట్లు అడ్డుపడటంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనలో డ్రైవర్‌తో పాటు 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి...

Thursday, May 11, 2017 - 19:44

శ్రీకాకుళం : జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. మరొకరు రాష్ట్ర విద్యుత్‌ శాఖా మంత్రి కిమిడి కళా వెంకటరావు . అయితే ఈ ఇద్దరు జిల్లాలోనే ఉంటే ఆనందించాల్సిన ప్రజలు... హడలిపోతున్నారు. జిల్లాకు వచ్చిన వీరు సుదూర ప్రాంతాల్లో బస చేస్తారు. దీంతో వీరిని దర్శించుకోవడమే ప్రజలకు ,అధికారులకు గగనంగా మారుతుంది.

...

Tuesday, May 9, 2017 - 10:58

శ్రీకాకుళం : నంబర్ వన్ జీడిపప్పుకు ఆ జిల్లా పెట్టింది పేరు.. కానీ ఆ పప్పును అందించే కార్మికుల కష్టాలు మాత్రం మాటల్లో చెప్పేవి కావు. జీడిపిక్క తొక్కలో ఉండే ప్రమాదకర రసాయనం వారి చేతుల్ని అనారోగ్యానికి గురిచేస్తున్నా.. బతుకుదెరువు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. జీడి పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటోన్న సమస్యలపై 10 స్పెషల్ స్టోరీ.

జీడిపప్పుకు ప్రపంచ...

Monday, May 8, 2017 - 18:59

శ్రీకాకుళం : జిల్లాకు ఏనుగుల భయం పట్టుకుంది. పదేళ్లుగా సీతంపేట ఏజెన్సీ పరిధిలో నాలుగు ఏనుగులు కలవరపెడుతుంటే... ఇప్పుడు మందస ఏజెన్సీ ప్రాంతంలో ఒడిశా నుంచి ప్రవేశించిన ఏడు ఏనుగులు స్థానికులను భయపెడుతున్నాయి. ఇప్పటికే కౌసల్య కొండ పరిసర ప్రాంతాల్లోకి చేరి జీడి, మామిడి, అరటి తోటలను, చోడి పంటలను ధ్వంసం చేశాయి. దీంతో స్థానికులు భీతిల్లిపోతున్నారు. ఏనుగుల అలజడితో అప్రమత్తమైన స్థానిక...

Saturday, May 6, 2017 - 14:46

విజయవాడ : అసలే మే నెల..ఓవైపు భానుడి ఉగ్రరూపం..మరోవైపు ఉక్కపోత..వెరసి జనం ఉడికిపోతున్నారు. ఏపీలో సూర్యుడు విజృంభిస్తుండటంతో..జనం సతమతమవుతున్నారు. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు, తాటిముంజలు లాగించేస్తున్నారు. భానుడి దెబ్బకుశ్రీకాకుళం జిల్లాలో తాటిముంజలకు గిరాకి పెరిగింది. పల్లెల్లో విరివిగా లభించే తాటిముంజలు పట్టణాల్లో హాట్...

Thursday, April 27, 2017 - 08:36

శ్రీకాకుళం : పలాస కాశీబుగ్గ మున్సిపల్‌ కమిషనర్‌ జగన్మోహన్‌ రావుపై దాడి జరిగింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను పురపాలక సంఘం చైర్మన్‌ పూర్ణ చంద్ర మరో ఇద్దరు కౌన్సిలర్లు కలిసి కొట్టారని జగన్మోహన్ రావు ఆరోపించారు. వాళ్ల అవినీతికి తాను సహకరించకపోవడం వల్లే దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Pages

Don't Miss