విశాఖ
Friday, April 28, 2017 - 17:44

విశాఖ : రోజూ వందల్లో తిరిగే రైళ్లు. గేటు పడిందంటే గంటలకొద్దీ నిలబడాల్సిన దుస్థితి.  ఒక్కరుకాదు ఇద్దరు కాదు.. ఏకంగా పదివేల మంది జనాభా 20 ఏళ్లుగా ఆ రైల్వేగేట్‌తో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక అత్యవసర పరిస్థితి తలెత్తితే ప్రాణాలపై నమ్మకం వదిలేసుకోవాల్సిందే. అలాంటి రైల్వేగేట్‌ సమస్యకు పరిష్కారం దొరికింది. 20ఏళ్ల సమస్య 4 గంటల్లోనే మాయమైంది. ఇంతకీ ఎక్కడా రైల్వేగేట్‌? ఏమీటా పరిష్కారం...

Friday, April 28, 2017 - 17:38

విశాఖ : ఒక్క రూపాయితో మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేస్తోంది. పేరం గ్రూప్‌. ఉత్తరాంధ్ర ప్రజల కోసం పేరం గ్రూప్‌ ఈ గొప్ప అవకాశాన్ని కల్పించింది. 75 శాతం బ్యాంక్‌ లోన్‌, 25 శాతం పేరం గ్రూప్‌ సహకారంతో ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇలాంటి స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామంటున్నారు  పేరం గ్రూప్‌ అధినేత పేరం హరిబాబు. 

 

Thursday, April 27, 2017 - 06:58

విశాఖ: పార్టి పుట్టినప్పటి నుంచి సేవలు అందించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ కష్టాల్లో ఉన్నపుడు జిల్లాల్లో పెద్దదిక్కుగా నడిపారు. 2014లో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినా.. మంత్రిపదవి దక్కలేదు. మంత్రివర్గ విస్తరణలోనూ మొండిచెయ్యే ఎదురైంది. దీంతో పార్టీ అధినాయకత్వంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి....

Wednesday, April 26, 2017 - 16:17

కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదు..ఒంటిరిగా పోరాటం చేస్తోంది...అత్తింటి ముందు మౌనపోరాటం..న్యాయం జరిగే వరకు కదలంటున్న ఇల్లాలు..విశాఖలో వీధిన పడిన మరో ఇల్లాలు..

పోలీసుతో పెళ్లి అయ్యింది..బాగానే ఉందని అనుకున్నారు..కానీ కొన్నాళ్లకే అత్తింటి వారు విశ్వరూపం చూపించడం మొదలు పెట్టారు..డబ్బు కోసం నిత్యం హింసించారు. భర్త బోర్డర్ లో పనిచేస్తుండగా ఆ ఇంటి కోడలిని పుట్టింటికి పంపారు. భర్త...

Tuesday, April 25, 2017 - 18:50

విశాఖ : జిల్లా కేంద్రంలో జరగనున్న అండర్‌ 19 ఫుట్‌బాల్‌ టాలెంట్‌ హంట్‌ టోర్నమెంట్‌ లోగో ఆవిష్కరణ వేడుకలో వెయిట్‌ లిఫ్టర్‌ కరణం మల్లేశ్వరితో పాటు హీరో నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అండర్‌ 19 ఫుట్‌బాల్‌ టాలెంట్‌ హంట్‌ టోర్నమెంట్‌ లోగోను ఆవిష్కరించారు. హీరో నాని మాట్లాడుతూ దేశంలో ఫుట్‌బాల్‌ ఆటకు ఆదరణ లేదని, ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ ఆటకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. ప్రపంచంలో...

Monday, April 24, 2017 - 21:18

విజయవాడ : టీడీపీ మహానాడుకు వేదిక ఖరారయ్యింది. మే 27, 28, 29 తేదీల్లో మహానాడును విశాఖలో నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రతినిధులతో కూడిన 20 వేల మందికి పైగా పాల్గొంటారని, అందరికీ వసతి, భోజన ఏర్పాట్ల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేసింది.

Thursday, April 20, 2017 - 18:03

విశాఖ : సవాళ్లను ఎదుర్కోడానికి ఇండియన్‌ నేవీ సదా సిద్ధంగా ఉంటుందని .. నావికాదళ ప్రధానాధికారి అడ్మిరల్‌ సునీల్‌లాంబా అన్నారు. విశాఖలో తూర్పునావికాదళ పతకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పొల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి నౌసేనా మెడల్‌తోపాటు విశిష్టసేవా పతకాలను ఆయన ప్రదానం చేశారు. పరిస్థితులను అనుసరించి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నామని సునీల్‌ లాంబా...

Pages

Don't Miss