విశాఖ
Friday, March 17, 2017 - 13:40

విశాఖ : నగరంలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. విశాఖ అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ముమ్మన రాజేశ్వరరావు ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించారు. ఏకకాలంలో ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. 20 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. 1990లో 1450 రూపాయల జీతంతో రాజేశ్వరరావు ఉద్యోగంలో చేరారు. 2012 నుంచి 2016 వరకు నాలుగేళ్ల కాలంలో అత్యధికంగా ఆస్తులు...

Sunday, March 12, 2017 - 13:37

విశాఖ : కొండకోనల్లో నివసించే ఆదివాసీలకు కష్టమొచ్చింది. ఆకులు, అలముల మధ్య బతికే గిరిపుత్రులు నీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మండుటెండలకు తమ గొంతులు ఎండిపోతున్నాయని గిరిపుత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తూర్పు ఏజెన్సీ ప్రాంత ఆదివాసీల తాగునీటి కష్టాలపై 10టివి స్పెషల్‌ ఫోకస్‌....!  
నీటి కోసం ఆదివాసీల చెలమల బాట
గుక్కెడు నీటి...

Friday, March 10, 2017 - 09:14

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 9 జిల్లాల పరిధిలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69.70 శాతం పోలింగ్‌ నమోదైంది. విశాఖ నగరంలో 71.1 శాతం, ఏజెన్సీలో 70 శాతం పోలింగ్‌ నమోదైంది. శ్రీకాకుళంలో 68 శాతం, విజయనగరంలో 70 శాతం పోలింగ్‌...

Thursday, March 9, 2017 - 13:32

విశాఖ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుఖాయమని పీడీఎఫ్ అభ్యర్థి అజశర్మ ధీమా వ్యక్తంచేశారు. విశాఖలో తన ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Thursday, March 9, 2017 - 08:35

విశాఖ : ఆనందపురం మండలం గుడిలోవ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్‌ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీలో ఉన్న మొత్తం 306 సిలిండర్లు పేలిపోయాయి. భారీ శబ్ధాలతో పేలుళ్లు జరగడంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. సంఘటనాస్థలానికి ఫైర్‌ సిబ్బంది చేరుకుని మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. 

Wednesday, March 8, 2017 - 13:30

విశాఖపట్టణం : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. స్త్రీ పురుషులు సమానావకాశాలు పొందాలన్న లక్ష్య సాధనకు కృషి చేస్తామని.. మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న బ్యాంకింగ్ రంగంలో ఇప్పటికే సమానావకాశాలు లభిస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. మహిళలకు గౌరవం ఇవ్వాలని, సమాజంలో వారు సగభాగమని గుర్తు చేస్తూ ప్లకార్డులు...

Wednesday, March 8, 2017 - 12:44

విశాఖపట్టణం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో మహిళలు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఏయూ క్యాంపస్‌లో మహిళలే సొంతంగా స్టాల్స్‌ ఏర్పాటు తాము తయారుచేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. భవిష్యత్‌లో సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది ఆదర్శంగా నిలుస్తుందని నిర్వాహకులంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో దుర్గాభాయ్...

Tuesday, March 7, 2017 - 06:43

విజయవాడ : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఓ వైపు గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతుంటే.. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు 8 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ తరఫున నారా లోకేష్‌ సహా మొత్తం ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అటు వైసీపీ తరపున 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏపీలో ఏడు...

Monday, March 6, 2017 - 18:42

విశాఖ : ఉత్తరాంధ్ర పీడీఎఫ్ అభ్యర్థి అజా శర్మకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ స్పష్టం చేశారు.... ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి కి ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు.. అందువల్లే ఇద్దరు కేంద్రమంత్రులు, ఆరుగురు రాష్ట్ర మంత్రులు తమ పార్టీ అభ్యర్థి కోసంప్రచారం చేస్తున్నారని చెప్పారు.. వెంకయ్య నాయుడు వాలకం చూస్తుంటే ఆయన కేంద్రానికి మంత్రో... జిల్లాకు...

Monday, March 6, 2017 - 06:41

విశాఖపట్టణం : ఇద్దరు కేంద్ర మంత్రులు.. ఐదుగురు రాష్ట్ర మంత్రులు.. ముగ్గురు ఎంపీలు.. వీరేకాక పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు. ఏంటా ఈ లెక్కంతా అనుకుంటున్నారా ? పీడీఎఫ్ కంచుకోట అయిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో పాగా వేసేందుకు అధికార బీజేపీ, టీడీపీ కూటమి మోహరింపు. తమ పాలనను ప్రశ్నించేవారు చట్టసభలలో ఉండకూడదని అధికార పక్షం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు...

Pages

Don't Miss