విశాఖ
Thursday, October 15, 2015 - 06:46

హైదరాబాద్ :విశాఖలో మావోయిస్టుల చెరలో ఉన్న ముగ్గురు టీడీపీ నేతలకు విముక్తి లభించింది. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ.. మావోయిస్టులు వారం క్రితం ముగ్గురు టీడీపీ నేతలను అపహరించారు. వీరిని జీకేవీధి వద్ద మావోయిస్టులు వదిలిపెట్టి వెళ్లారు. గిరిజన ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు విడిచిపెడుతున్నట్లు మావోయిస్టులు వెల్లడించారు. అంతకుముందు చిత్రకొండ అటవీప్రాంతంలో...

Wednesday, October 14, 2015 - 19:53

విశాఖపట్టణం : బాక్సైట్ తవ్వకాలు ఏజెన్సీ టిడిపి ప్రజాప్రతినిధుల గుండెల్లో గునపాలు గుచ్చుకుంటున్నాయి. మావోయిస్టుల హెచ్చరికలు..ఏపీ ప్రభుత్వం వైఖరితో పార్టీ ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అలజడి రేగుతోంది. ఇటీవలే కొత్తగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు మామిడి బాలయ్య పడాల్ (45) గూడెం గ్రామానికి చెందిన జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్కలి మహేష్ (42), కొత్తూరు గ్రామానికి...

Tuesday, October 13, 2015 - 19:15

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా మొదటి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ చేపట్టిన మన మట్టి, మన నీరుకు టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రత్యేక పూజలమధ్య మట్టి, నీరు సేకరించారు. ఏపీలో మన మట్టి, మన నీరు కార్యక్రమం ఘనంగా మొదలైంది. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఈ కార్యక్రమాన్ని సీఎం...

Tuesday, October 13, 2015 - 12:45

విశాఖ : ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ విశాఖలో మౌనదీక్ష చేపట్టారు. వైజాగ్‌లో వెంటనే జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణం ప్రారంభించాలని మౌనదీక్ష చేపట్టారు. లైబ్రరీ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోని.. లైబ్రరీ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని శర్మ డిమాండ్‌ చేస్తున్నారు. దీక్ష ప్రారంభించే ముందు ఎమ్మెల్సీ శర్మ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. ఇటు శర్మ మౌనదీక్షకు జిల్లా...

Monday, October 12, 2015 - 21:58

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని.. దీని అభివృద్ధిని ఎవరూ అడ్డుకోవద్దని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హితవు పలికారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో సహకరిస్తోందని అన్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా.. విభజన చట్టంలో ఉన్నవే కాకుండా.. లేని అంశాలపైనా కేంద్రం సహకరిస్తోందని చెప్పుకొచ్చారు. విశాఖలో సినీ పరిశ్రమ పరిఢవిల్లాలని ఇద్దరు నేతలూ...

Monday, October 12, 2015 - 12:19

హైదరాబాద్ : విశాఖలో కిడ్నిప్‌ అయిన టీడీపీ నేతలు ఇంకా మావోయిస్టు చెరలోనే ఉన్నారు. మావోయిస్టులు తాజాగా మరోలేఖను కూడా విడుదల చేశారు. రెండు రోజుల్లో బాక్సైట్‌ తవ్వకాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. స్పందించకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత తమది కాదని ప్రకటించారు.

 

Monday, October 12, 2015 - 10:43

విశాఖ : ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలిసారిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తోంది. ఈ వేడుకను ఇవాళ ఏయూ కాన్విగేషన్ హల్‌లో భారీ స్థాయిలో నిర్వహించాలని వర్సిటీ అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటికే వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇటీవలే 89 ఏళ్లు పూర్తి చేసుకొన్న ఏయు.....

ఈ వర్సిటీ ఇటీవలే 89 ఏళ్లు పూర్తి చేసుకొని 90వ ఏట...

Monday, October 12, 2015 - 09:40

హైదరాబాద్ : విశాఖలో నిన్న ఆర్కేబీచ్‌ దగ్గర గల్లంతైన విద్యార్ధుల్లో ముగ్గురి మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. మృతులు గణేష్‌, రోహిత్‌, జబ్బార్‌లుగా గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు.

 

Monday, October 12, 2015 - 06:37

విశాఖ : హుదూద్‌..! ఈ పదం వింటే చాలు.. విశాఖ వాసుల ఒళ్లు జలదరిస్తుంది. సాగరతీర నగరాన్ని కకావికలం చేసిన ఆ ప్రకృతి విలయ తాండవం.. గుర్తుకొస్తే చాలు.. స్థానికులు వణికిపోతారు. గంటల వ్యవధిలోనే విశాఖను ఛిన్నాభిన్నం చేసిన హుదూద్‌ సంభవించి నేటికి ఏడాది పూర్తయింది. 365 రోజులు గడిచినా.. నాటి కాళరాత్రులను విశాఖవాసులు నేటికీ మరచిపోలేక పోతున్నారు.

గంటకు 200...

Monday, October 12, 2015 - 06:33

విశాఖ : విశాఖపట్టణం సముద్రం తీరం మృత్యుబీచ్‌గా మారుతోంది. ఇక్కడికి రావాలంటేనే సందర్శకులు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా సముద్ర తీరానికి చేరుకుంటున్న సందర్శకులు ఇక్కడ జరుగుతున్న గల్లంతులను చూసి గజగజవణికిపోతున్నారు.

బీచ్‌కు వెళ్లిన ఏడుగురు పదో తరగతి విద్యార్థులు.....

ఎప్పుడు ఏ అల...

Sunday, October 11, 2015 - 20:17

విశాఖ : మాజీ మహిళ రంజీ క్రికెటర్ దుర్గాభవాని అనుమానాస్పద మృతి చెందారు. విశాఖ గుణదలలోని ఆమె స్వగృహంలో ఫ్యాన్ కు దుర్గాభవాని మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖ గుణదలలో దుర్గాభవాని నివాసముంటుంది. గురువుగా ఉన్న సత్యప్రసాద్ ను దుర్గాభవాని పెద్దలకు తెలియకుండానే వివాహం చేసుకుంది. అయితే సత్యప్రసాద్ కు...

Pages

Don't Miss