విశాఖ
Tuesday, November 3, 2015 - 10:23

విశాఖ : ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం మొదలైంది. ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్లు తమను వేధిస్తున్నారని జూనియర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రిజిస్ట్రార్ ఇంజినీరింగ్ విభాగం వసతి గృహాల్లో తనిఖీలు చేపట్టారు. ర్యాగింగ్ ఘటన సమాచారం తీలుసుకున్న మంత్రి గంటా... ర్యాగింగ్ పై అధికారులతో సమీక్షించాలని నిర్ణయించారు.

Monday, November 2, 2015 - 13:43

విశాఖపట్టణం : హుదూద్ తుఫాన్ ఎవరు మరిచిపోరు. విశాఖ జిల్లాను అతలాకుతలం చేసిన తుఫాన్ కు కొంతమంది మృతి చెందగా మరెంతో మంది రోడ్డున పడ్డారు. తాజాగా మరో తుఫాన్ బారి నుండి విశాఖ బయటపడిందని వాతావరణ నిపుణులు రామకృష్ణ టెన్ టివికి తెలిపారు. ఇందుకు పలు కారణాలున్నాయన్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన చపల తుఫాన్ కూడా ఒక కారణమని, తుఫాన్ గా మారకముందే బలహీన పడి దిశ మార్చుకుందని వివరించారు. ఆ...

Monday, November 2, 2015 - 06:32

 

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి అనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గడువును మరింత పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాహనదారులను హెల్మెట్‌ పేరుతో ఇబ్బంది పెట్టొద్దని పోలీసులకు రవాణాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నవంబర్‌ 1నుంచి ద్విచక్ర వాహనదారులందరికీ హెల్మెట్...

Sunday, November 1, 2015 - 16:46

విశాఖ : నగరంలో ఉదయం నుంచే అధికారులు... హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. మరోసారి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే బైక్ సీజ్ చేస్తామని రవాణాశాఖ డిప్యుటీ కమిషనర్ వెంకటేశ్వర్లు చెప్పారు. ఎంవిపి కాలనీ, పిఎం పాలెం, గాజువాక, సీతమ్మధార ప్రాంతాల్లో అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. 

Sunday, November 1, 2015 - 16:39

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడింది. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ అధికారులు ప్రకటించారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది...

Sunday, November 1, 2015 - 10:22

విశాఖపట్టణం : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ద్రోణి బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని విశాలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాలో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో...

Sunday, November 1, 2015 - 10:04

విశాఖపట్టణం : జిల్లాలో సంచలనం సృష్టించిన కృపామణి హత్య కేసులో ప్రధాన నిందితుడు గూడాల సాయి శ్రీనివాస్ విశాఖలో ఉన్నట్లు నిఘా బృందాలకు సమాచారం అందింది. దీనితో అతను ఉన్న ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఇది ముందే తెలుసుకున్న శ్రీనివాస్ పోలీసుల నుండి తప్పించుకున్నాడు. ఆ ప్రాంతంలో కారును పోలీసులు స్వాధశీనం చేసుకున్నారు. సాయి శ్రీనివాస్ పలుమార్లు అత్యాచారం చేశాడని..వ్యభిచారం...

Sunday, November 1, 2015 - 06:39

విజయవాడ : హెల్మెట్ లేకుండా రోడ్డెక్కుతున్నారా..? శిరస్త్రాణం కొనడం మర్చిపోయారా..? అయితే మీ ఆటలిక సాగవు. మీ కోసం కాదు..! మీ వాళ్ల కోసమైనా హెల్మెట్ ధరించండి. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. అందుకే హెల్మెట్‌ లేకుండా రయ్‌ రయ్‌ మంటూ రోడ్లపై దూసుకెళ్లే వాహనదారులకు ఏపీ సర్కార్‌ స్పీడు బ్రేకులు వేస్తోంది. ఇవాళ్టి నుంచి శిరస్త్రాణాన్ని ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం...

Saturday, October 31, 2015 - 16:51

విశాఖ : కాలుష్యంతో మసకబారుతున్న పోర్టును కాపాడేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. గ్రీన్ పోర్టుగా మార్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. 60కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్లలో పోర్టు రూపురేఖలే మార్చేస్తామని చైర్మన్ కృష్ణబాబు ధీమాగా చెబుతున్నారు.

 

Thursday, October 29, 2015 - 11:42

విశాఖ : నగరంలో సంతోష్ అనే రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి 11 గంటల సమయంలో నడిరోడ్డుపై సంతోష్‌ను మారణాయుధాలతో హత్య చేశారు. పలు కేసుల్లో సంతోష్‌ నిందితుడిగా ఉన్నాడు. ఏడుగురితో కూడిన ముఠా నగరంలో పలు హత్యలు, దొంగతనాలు చేస్తూ హల్‌చల్‌ చేస్తోది. ఈ ముఠాలో సంతోష్‌ ఒక సభ్యుడిగా ఉన్నాడు. అయితే మిగిలిన ముఠా సభ్యులకు తెలీకుండా ప్రత్యేకంగా నేరాలకు ప్లాన్‌ చేస్తున్న సంతోష్‌ను ముఠా...

Wednesday, October 28, 2015 - 16:02

విశాఖ : ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ గౌరీ శంకర్ అనే తండ్రిఆత్మహత్యకు పాల్పడ్డాడు ముగ్గురు పిల్లలు సహా తండ్రి గౌరీ శంకర్ మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందువల్లే ఈఘటనకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.

Pages

Don't Miss