విశాఖ
Friday, September 8, 2017 - 20:06

విశాఖ : గంజాయి నిర్మూలించేందుకు ప్రజలు, అధికారులు కలిసిరావాలన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు. గంజాయి అక్రమ రవాణాలో పట్టుబడితే ఎలాంటి వారినైనా పీడీ యాక్ట్‌ కింద నమోదు చేయాలని సూచించారు. గంజాయి రవాణా వలన యువత జీవితాలు నాశనమైపోతాయన్నారు. జీవీఎంపీ ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. డిసెంబర్‌లో ఎన్నికలు పెట్టాలని ఇప్పటికే సీఎంను కోరామని త్వరలో దీనిపై ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని...

Friday, September 8, 2017 - 08:13

విశాఖ : పట్ణణంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నెమ్మదిగా పుంజుకుంటోంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, రేరా చట్టాలతో గాడి తప్పిన రియల్‌ ఎస్టేట్‌... వెంచర్‌ పేరెత్తడానికే హడలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు తిరిగి వెంచర్లను ప్రారంభించడంతో తిరిగి విశాఖలో రియల్‌ ఎస్టేట్‌ పుంజుకుంటుందని నగరవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

విశాఖ పట్టణంలో రియల్‌ ఎస్టేట్‌...

Thursday, September 7, 2017 - 20:35

విశాఖ : ఆసియా స్థాయిలో విశాఖ అపోలో ఆస్పత్రి మరో ఘనత సాధించింది... బెస్ట్ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కింద వివిధ కేటగిరీల్లో పలు అవార్డులను సొంతం చేసుకుంది.. కస్టమర్‌ సర్వీస్‌, క్లినికల్‌ సర్వీసుల్లో మెరుగుదల... హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్‌లో ఇన్నోవేషన్‌ ప్రాజెక్టులకు ఈ పురస్కారాలు దక్కాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులను అపోలో సొంతం చేసుకోవడంపట్ల సంస్థ సీఈవో సందీప్...

Thursday, September 7, 2017 - 20:28

విశాఖ : అత్యవసర క్రిటికల్‌  కేర్‌ కలిగిన నగరాల జాబితాలో విశాఖ చేరింది. ప్రపంచస్థాయి ట్రామా సేవల్ని అపోలో ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. విశాఖ హెల్త్ సిటీలోని అపోలో ఆస్పత్రిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు ప్రమాద బాధితుల కోసం ప్రత్యేక అంబులెన్స్ సేవల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.. గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌    లాంటి సమయాల్లో అంబులెన్స్ సేవల్ని వినియోగించుకోవచ్చని...

Thursday, September 7, 2017 - 08:00

విశాఖ: పోర్టులో ఒక నౌక లోడింగ్ సమయంలో పక్కకు ఒరిగిపోవడంతో భారీగా ఆస్తినష్టం సంభవించింది. సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పింది. సోమవారం ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టుకు ఈ నౌక వచ్చింది. ఈక్యూ ఐదో నంబర్ బెర్త్ వద్ద ఉన్న నౌకలో సరుకు లోడింగ్ జరుగుతోంది. లోడింగ్ అనంతరం నౌక హాంకాంగ్‌కు వెళ్లాల్సి ఉంది. ఐతే ఈలోపుగానే ఈ ఘటన చోటు చేసుకుంది. 

Thursday, September 7, 2017 - 07:54

విశాఖ : ఏపీ ప్రభుత్వం జలసిరికి హారతి అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విశాఖ జిల్లాలో చంద్రబాబు జలసిరికి హారతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విశాఖ జిల్లాలోని గొబ్బురుకు చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా నర్సపురంలోని శారదా నదికి చేరుకున్నారు. శారద నదిపై 16.17 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆనకట్టను ప్రారంభించారు. అనంతరం జలసిరికి...

Wednesday, September 6, 2017 - 16:48

విశాఖ : అన్ని పండుగలకంటే గొప్ప పండుగ..పవిత్రమైన పండుగ జలసిరికి హారతి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. విశాఖ జిల్లా కశింకోట మండలం నర్సాపురం గ్రామంలో జలసిరికి హారతి కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శారదా నదికి హారతి ఇచ్చిన చంద్రబాబు నర్సాపూర్ ఆనకట్టను ప్రారంభించారు. మన జీవన ప్రమాణాలు సక్రమంగా ఉండాలంటే ప్రకృతిని ఆరాధించాలని చంద్రబాబు అన్నారు. తిండినిచ్చే...

Monday, September 4, 2017 - 13:51

విశాఖ : జిల్లాలోని విశాలక్ష్మినగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్‌ ప్రహరీగోడ కూలి బాలుడు మృతి చెందాడు. 

Sunday, September 3, 2017 - 09:49

విశాఖ : రోజాపై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు. రోజా ఐరన్ లెగ్‌ అంటూ వ్యాఖ్యానించారు. రోజా వల్లే టీడీపీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందన్నారు.  ఆమె వెళ్లపోయాక అంతా  తమ పార్టీకి విజయమే నని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. 

 

Saturday, September 2, 2017 - 10:52

విశాఖ: వాకపల్లి ఆదివాసీ మహిళలపై జరిగిన అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసులో అపరిమిత జాప్యం జరిగినందుకు సీరియస్‌ అయ్యింది. ఆదివాసీ మహిళలపై అత్యాచారానికి పాల్పడిన 13మంది గ్రేహౌండ్స్‌ పోలీసులపై విచారణ జరిపి తీరాలని ఆదేశించింది.

2007 ఆగస్టు 20...

Pages

Don't Miss