విశాఖ
Friday, November 10, 2017 - 19:31

విశాఖ : ఉత్తరాంధ్రలో సాంస్కృతిక వారసత్వాన్ని, విశిష్టతను ప్రతిభింబించేలా విశాఖ ఫెస్ట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ తెలిపారు. గతంలో నిర్వహించిన విశాఖ ఫెస్ట్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహించాలని విశాఖ ప్రజలు కోరారని తెలిపారు. అందుకే ఈసారి  వైజాగ్‌ ఫెస్ట్‌ 2017ని డిసెంబర్ 1 నుంచి 10 వరకూ నిర్వహిస్తున్నట్లు...

Friday, November 10, 2017 - 19:28

విశాఖ : సింహాచల దేవస్థానం, పంచగ్రామాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వైసీసీ తన ఆందోళనను తీవ్రతరం చేసింది. పెందుర్తి నియోజక వర్గ సమన్వయ కర్త అన్నంపురెడ్డి అదీప్‌ రాజ్  పెందుర్తిలో పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మూడు రోజుల పాదయాత్రకు పూనుకున్నారు. పంచగ్రామాలను కలుపుతూ 35 కిలోమీటర్ల ఈ పాదయాత్రలో దేవస్థానం వల్ల ఇబ్బంది పడే ప్రతీ గడపకు.. ప్రభుత్వం...

Thursday, November 9, 2017 - 10:32

విశాఖ: సింహాచలం దేవస్థానంలో అపచారం జరిగింది. స్వామివారి ప్రసాదంలో పురుగులు వచ్చాయి. దీంతో భక్తులు ఆందోళన చెందారు. అయితే ఈ విషయంపై దేవస్థానం అధికారులు పట్టించుకోలేదు. రాయవాని పాలానికి చెందిన అయ్యప్ప భక్తులు సింహాచలం స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లి అక్కడ ప్రసాదం తీసుకున్నారు. ఆ ప్రసాదంలో బొద్దింకలు ఉండడం గమనించిన భక్తులు దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా...

Thursday, November 9, 2017 - 06:26

కడప : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టిన మూడో రోజుకే అనారోగ్యానికి గురయ్యారు. రెండవ రోజు వేంపల్లిలో పాదయాత్ర ముగించుకుని రాత్రి బస చేసిన సమయంలో... ఆయన తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డారు. వైసీపీ నేతలు వెంటనే ఫిజియో థెరపీ వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించారు. నడుముకు బెల్ట్‌ వేసుకుంటే సరిపోతుందని వైద్యుడు సలహా ఇచ్చారు. దీంతో మూడవ రోజు జగన్‌ నడుముకు బెల్ట్‌...

Wednesday, November 8, 2017 - 20:34

విశాఖ : విద్యాకుసుమాలను పట్టభద్రులుగా తీర్చిదిద్దుతోన్న గీతం యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. భారతప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్‌ అశుతోష్‌ శర్మ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్నాతకోత్సవం సందర్భంగా 1500 మంది విద్యార్థులకు స్నాతకోత్తర డిగ్రీలను, బంగారు పతకాలను, 27 మంది రీసెర్చి స్కాలర్లకు పిహెచ్‌డీ పట్టాలను ప్రముఖుల చేతుల మీదుగా...

Wednesday, November 8, 2017 - 09:23

విశాఖపట్టణం : నాడ్‌ జంక్షన్‌లో గంజాయి పట్టుబడింది. తమిళనాడుకు చెందిన నైజీరియన్‌ గిబ్సన్ నాడ్‌ కొత్త రోడ్‌ బస్టాప్‌ వద్ద అనుమానాస్పదంగా కనబడటంతో పోలీసులు అతన్ని సోదా చేయగా గంజాయిని గుర్తించారు. నైజీరియన్‌ వద్ద ఉన్న రెండు సూట్‌కేస్‌ల నుండి 30 కిలోల గంజాయి, సెల్‌ఫోన్‌లను ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Tuesday, November 7, 2017 - 15:56

విశాఖ : ఏయూలోని సంస్కృతం విభాగధిపతి ఏడుకొండలు వేధింపుల నుండి తామను కాపాడాలంటూ విద్యార్ధినిలు మంత్రి గంటా శ్రీనివాసురావు వాహనం ముందు ఆందోళనకు దిగారు. విచారణ జరిపి తప్పు ఉంటే ఏడుకొండలుపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామిఇచ్చారు.

 

Monday, November 6, 2017 - 18:10

విశాఖపట్టణం : మరో ప్రేమోన్మాది ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ప్రేమించ లేదని..వివాహానికి నిరాకరించిందని..అనుమానం..ఇలా కొన్ని కారణాలతో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. మహిళల ప్రాణాలు తీస్తూ..బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

తాజాగా వుడా పార్కులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. కృష్ణా జిల్లా నందివాడకు చెందిన నాగలక్ష్మణ్..శ్రీకాకుళం జిల్లాకు రమ్యలు గత మూడు సంవత్సరాలుగా...

Pages

Don't Miss