విశాఖ
Monday, November 6, 2017 - 16:05

విశాఖపట్టణం : అనకాపల్లి (మం) కొత్తూరు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్ తో లాకర్ ను తెరిచి ఈ చోరీకి పాల్పడ్డారు. భారీగా నగదు..బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన అధికారులు లాకర్ ను తెరిచి ఉండడం గమనించారు. వెంటనే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం..నగదు ఎంత మొత్తంలో అపహరణకు గురైందనేది తెలియ రావడం లేదు. ఈ చోరీని...

Monday, November 6, 2017 - 14:24

విశాఖపట్టణం : విద్యాభోదనలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తమను వేధిస్తున్నాడని విశాఖలో ఏయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సంస్కృతం విభాగాధిపతి ఏడుకొండలు రూమ్‌ వద్దకు వెళ్లి దేహశుద్ధి చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఏడుకొండలిని సస్పెండ్ చేస్తేనే వర్సిటీకి వస్తామని విద్యార్థులు అంటున్నారు. అయితే విద్యార్థులకు హాజరు శాతం లేదని, పరీక్షలు రాసేందుకు అర్హత లేదన్నందుకే తనపై కక్షతో ఇలా...

Monday, November 6, 2017 - 14:14

విశాఖ : ఏయూ సంస్కృతం విభాగాధిపతి ఏడు కొండలుకు విద్యార్థులు దేహశుద్ధి చేశారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఏడు కొండలను సస్పెండ్ చేస్తేనే కళాశాలకు వస్తామని విద్యార్థినులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Sunday, November 5, 2017 - 16:35

విశాఖపట్టణం : నగర వాసులకు క్రికెట్ ప్రాక్టీస్ చేసుకొనేందుకు మరో గ్రౌండ్ అందుబాటులోకి వచ్చింది. గ్రౌండ్ కు కోరమండల్ ఫెర్టిలైజర్స్ భూమిని కేటాయించింది. ఎంపీ లాండ్స్ నుండి రూ. 10 లక్షలను ఎంపీ హరిబాబు ఇచ్చారు. ఈ గ్రౌండ్ లో అండర్ 12, అండర్ -14, అండర్ 16 కేటగిరీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కోరమండల్ ఎండీ సమీర్ గోయల్ టెన్ టివితో మాట్లాడారు. క్రీడల అభివృద్ధికి తాము సహకరించడం...

Sunday, November 5, 2017 - 14:07

విశాఖ : ఆంధ్రా ఊటీ అరకులో పర్యాటకం ఊపందుకుంది. అరకు అందాలను చూడటానికి పర్యాటకులు క్యూలు కడుతున్నారు. ఓ వైపు అద్దాల ట్రైన్‌ జర్నీని మిస్‌ అవుతున్నామంటూనే.. వలసపూల సోయగం మనసును మైమరపింపజేసిందంటున్నారు. పర్యాటకులు, వలసపూల సోయగాలతో పాటు కొండల్ని తాకే మబ్బులపై మనమూ ఓ లుక్కేద్దాం.
ఊపందుకున్న టూరిజం 
అరకు.. ఈ పేరు వినగానే చుట్టూ కొండలు, మనస్సుకు...

Sunday, November 5, 2017 - 13:15

విశాఖ : శ్రీలంక, తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి అల్పపీడనద్రోణిగా మారింది. శనివారం నాటికి ఇది దక్షిణ కోస్తా, తమిళనాడుకు ఆనుకుని పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తమిళనాడుతో పాటు రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో పలుచోట్ల ఉరుములతో కూడిన...

Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Friday, November 3, 2017 - 18:38

విజయవాడ : జిల్లాల పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న హామీలు కోటలు దాటుతున్నాయి. అమలు మాత్రం గడప దాటడంలేదు. బడ్జెట్‌లో నిధులు లేకపోయినా... వేల కోట్ల రూపాయల వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. మూడున్నరేళ్లలో జిల్లాల పర్యటనలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎన్ని వేల కోట్ల రూపాయాలకు చేరుకున్నాయో వింటే ఎవరికైనా గుండె గుబేల్‌ మంటుంది. చంద్రబాబు వాగ్దానాలు అమలు చేయాలంటే 49 వేల కోట్ల...

Friday, November 3, 2017 - 18:33

విశాఖపట్టణం : జిల్లా పాడేరులో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రైవేట్ బస్ లోయలోకి దూసుకుపోయిన ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరంతా శనివారం జరిగే కార్తీక పౌర్ణమి కోసం.. పాడేరు నుంచి శ్రీశైలం వెళ్తుండగా అదుపుతప్పి పాడేరు-వంట్లమామిడి మధ్య లోయలోకి దూసుకుపోయింది. గాయపడ్డ ప్రయాణికులను పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Pages

Don't Miss