విశాఖ
Sunday, August 27, 2017 - 08:40

విశాఖ : ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రదండు కదిలింది. భారీ నిరసన.. ర్యాలీగా సాగింది. ప్రజా సంక్షేమానికి విరుద్ధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయని సీపీఎం నాయకులు అన్నారు. లక్షలాది మందికి అన్నం పెట్టే.. సంస్థలను బహుళజాతి సంస్థలకు కట్టబెడితే ఊరుకునేది లేదని... కార్మికోద్యమం... ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నం ప్రభుత్వ రంగ సంస్థల వల్లే అభివృద్ధి...

Friday, August 25, 2017 - 12:03

విశాఖ : వినాయక నవరాత్రులకు విశాఖ ముస్తాబయ్యింది. చిన్నా పెద్దా అంతా లంబోదరుడ్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఉండ్రాలయ్యకు దండాలంటూ భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తున్నారు. విశాఖలో ప్రసిద్ది గాంచిన సంపత్‌ వినాయగర్‌ ఆలయానికి తెల్లవారు జామునుంచే భక్తులు పోటెత్తారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, August 25, 2017 - 07:02

విశాఖ : నగరంలో మట్టితో చేసిన గణేశ్‌ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన మట్టి గణేశ్‌ను ఎంవీపీ కాలనీలో పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే పూజించాలని గంటా కోరుతున్నారు.  
 

Thursday, August 24, 2017 - 19:47

విశాఖ : మట్టి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని ఈ విగ్రహాల కొనుగోలుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Thursday, August 24, 2017 - 16:56

విశాఖ : విశాఖను డ్రోన్‌ల తయారీ కేంద్రంగా మారనున్నట్లు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఈ పరిశ్రమ ప్రారంభానికి తాను 60 రోజుల్లో మళ్లీ విశాఖకు వస్తానని స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న లోకేశ్ ఎనిమిది ఐటీ కంపెనీలను ప్రారంభించారు. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న ఈ కంపెనీలు 770 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. 

Sunday, August 20, 2017 - 08:05

విశాఖ : నగరంలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. రైడీ షీటర్ సంపత్ ను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆరివలోలవలో ప్రత్యర్థులు మాటువేసి అంతమొందించారు. పాతకక్షలే సంపత్ హత్యకు కారణమని తెలుస్తోంది. మరంత సమాచారం కోసం వీడియో చూడండి.

 

Saturday, August 19, 2017 - 20:49

విశాఖ : ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత ధనిక నియోజకవర్గంగా పేరొందిన గాజువాకకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సొంత ఇమేజ్ పెంచుకోవడంలో వెనకబడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఆయన హయాంలో కొన్ని పనులు పూర్తయినా, మరికొన్ని ముఖ్యమైన హామీలు నెరవేరలేదు. గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు సాధించిన ప్లస్ పాయింట్స్ ఏమిటి? మైనస్ పాయింట్స్ ఏమిటి? ఇదే ఇవాళ్టి...

Saturday, August 19, 2017 - 17:13

విశాఖ : జిల్లాలోని భీమిలిలో దారుణం జరిగింది. డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోన్న రూప అనే విద్యార్థినిపై ప్రేమోన్మాది హరిసంతోష్‌ దాడికి తెగబడ్డాడు. కాలేజీ నుంచి వస్తున్న రూపపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో రూప అక్కడికక్కడే చనిపోయింది. అడ్డుకోబోయిన రూప తమ్ముడికీ గాయాలు కాగా అతడిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రేమోన్మాది హరిసంతోష్‌ కూడా రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని...

Saturday, August 19, 2017 - 16:48

విశాఖ : ఇదిగో పరిహారం.. అదిగో పునరావాసం అన్నారు. సర్వే పూర్తయ్యింది. భూములకు ఇచ్చే పరిహారం ఖరారయ్యింది. కానీ రైతులకు మాత్రం పరిహారం అందలేదు. అసలు తమకు నష్టపరిహారం అందుతుందో లేదోనని.. ఆ గ్రామాల ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. 
పెట్రో కెమికల్ కారిడార్‌ ఏర్పాటు 
విశాఖ నుంచి చెన్నై వరకూ పెట్రో కెమికల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలి. అప్పటి కాంగ్రెస్‌...

Saturday, August 19, 2017 - 16:15

విశాఖ : జిల్లాలోని భీమిలో దారుణం జరిగింది. డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోన్న రూప అనే విద్యార్థినిపై ప్రేమోన్మాది హరికిషోర్‌ దాడికి తెగబడ్డాడు. కాలేజీ నుంచి వస్తున్న రూపపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో రూప అక్కడికక్కడే చనిపోయింది. అడ్డుకోబోయిన రూప తమ్ముడికీ గాయాలు కాగా అతడిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రేమోన్మాది హరికిషోర్‌ కూడా రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

Pages

Don't Miss