విశాఖ
Thursday, October 26, 2017 - 19:11

విశాఖపట్నం : ఈ మధ్య కాలంలో రాజకీయాల్లోకి సినీనటులు ఎక్కువగా వస్తున్నారని,  కానీ పాలిటిక్స్‌లో రాణించిన నటులు చాలా తక్కువ మంది ఉన్నారన్నారు సినీనటి గౌతమి. ఈనెల 28న విశాఖ బీచ్‌ రోడ్డులో జరిగే  కేన్సర్‌ అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు గౌతమి విశాఖ వచ్చారు. లైఫ్‌ ఎగైన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విన్నర్స్‌ వాక్‌  జరుగునుంది. టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి...

Wednesday, October 25, 2017 - 17:00

విశాఖ : జిల్లాలో కబ్జారాయుళ్ల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. కబ్జాకు పాల్పడటమే కాకుండా అడ్డొచ్చిన వారిపై దాడులకు దిగుతున్నారు. బుచ్చయ్యపేట మండలం శివార్లలో కబ్జారాయుళ్లు.. మహిళలపై దాడి చేసి ఆపై తాళ్లతో కట్టేశారు. అనకాపల్లి నుంచి వచ్చిన 20 మంది దాడి చేశారని మహిళలు ఆవేదన చెందుతున్నారు. బాధితులు బోరున విలపించారు...

Wednesday, October 25, 2017 - 16:19

విశాఖ : ప్రజా సంఘాలు- పోలీసుల మధ్య పోస్టర్స్‌ వార్‌ జరుగుతోంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళ, గిరిజన సమస్యలపై చైతన్య మహిళా సంఘం ధర్నా చేపట్టింది. సీఎంఎస్‌ ధర్నాకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అమాయక గిరిజనులను ఉద్యమాల వైపు నడిపిస్తున్నారంటూ పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లను చైతన్య మహిళా సంఘం సభ్యులు తగలబెట్టారు. తమకు వ్యతిరేకంగా పోలీసులే పోస్టర్లను.. గిరిజనులతో ర్యాలీలను...

Wednesday, October 25, 2017 - 15:16

విశాఖ : నగరంలో మతిస్థిమితంలేని వ్యక్తి వీరంగ సృష్టించాడు. అరిలోవ పెదగదిలి హైవేపై రాళ్లతో పలువురిపై దాడి చేయడంతో అందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Tuesday, October 24, 2017 - 12:15

విశాఖ : జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది నేషనల్ టాలెంట్ స్కూల్ లో దారుణం జరిగింది. యూకేజీ విద్యార్థిని పూజను హోం వర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో విద్యార్థిని చేయ్యికి ఫ్యాక్చర్ అయింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.  

Tuesday, October 24, 2017 - 12:02

విశాఖ : జిల్లా నక్కపల్లి మండలం పెద తీనార్ల గ్రామంలో ప్రెవేట్ స్కూల్ బస్ ఢీకొని మహిమ అనే మూడేళ్ల పాప మృతిచెందింది. యస్.రాయవరం మండలం అడ్డురోడ్డులో గల ఆదర్శ స్కూలుకు చెందిన బస్... పాపను ఢీకొట్టింది. ఈ ఘటనలో పాప అక్కడక్కడే మృతి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Monday, October 23, 2017 - 18:17

విశాఖపట్టణం : నగరాభివృద్ధి సంస్థలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో అంతస్తులో ఉన్న వాణిజ్య పన్నుల శాఖలో సోమవారం సాయంత్రం మంటలు అంటుకున్నాయి. ఎక్కువగా పేపర్ తో కూడిన మెటిరీయల్ ఉండడంతో మంటలు తొందరగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్ది గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే...

Monday, October 23, 2017 - 15:24
Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Saturday, October 21, 2017 - 10:32

విశాఖ : సంచలనం సృష్టించిన రౌడీషీటర్‌ గేదెల రాజు హత్య కేసులో డీఎస్పీ రవిబాబు చోడవరం పోలీసు స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు...తనకు తాను వచ్చి అక్కడి పోలీసులతో తాను డీఎస్పీ రవిబాబునని...లొంగిపోయేందుకు వచ్చానంటూ చెప్పడంతో వారు లోపలికి తీసుకుపోయారు..అయితే అప్పటికే మీడియాకు సమాచారం ఉండడంతో ముందే చేరింది...డీఎస్పీ లొంగిపోవడంతో ఇప్పటివరకు ఉన్న పోలీసు టెన్షన్‌కు తెరపడింది...పరారీలో ఉన్న...

Pages

Don't Miss