విశాఖ
Tuesday, July 31, 2018 - 17:20

విశాఖ : మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సం.రాలు ఉన్న మత్స్యకారులందరికీ పించన్ ఇస్తామని చెప్పారు. అన్ని విధాలుగా అదుకుంటామని చెప్పారు. మత్స్యకారులకు అండగా ఉంటామని చెప్పారు. కారు డ్రైవర్లు ఓనర్లుగా మారాలన్నారు. మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఆనందం, సంతోషం కల్గుతుందన్నారు.

 

Monday, July 30, 2018 - 16:11

విశాఖ : డ్వాక్రా మహిళలు కదం తొక్కారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించొద్దని కోరుతూ మంత్రి గంటా నివాసాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు డ్వాక్రా సభ్యులు మధ్య తోపులాట జరిగింది. డ్వాక్రా సభ్యులు కింద పడిపోయారు. డ్వాక్రా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

Monday, July 30, 2018 - 11:25

ఢిల్లీ : విశాఖకు రైల్వే జోన్ వస్తుందా ? ఇప్పటికే దీనిపై కేంద్రం స్పష్టం చేసినా భిన్నమైన వాదనలను వినిపిస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ తప్పకుండా వస్తుందని బీజేపీ నేతలు ఇప్పటికీ తెలియచేస్తున్నారు. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ దాఖలకు వ్యతిరేకంగా టిడిపి ఎంపీలు నిరసన చేపడుతున్నారు. పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్రం తీరును...

Monday, July 30, 2018 - 06:33

విశాఖపట్టణం : రైల్వేజోన్ పై మరో సారి రగడ మొదలైంది. రైల్వోజోన్ వస్తుందని ప్రజలు అశపడటం.. నేతలు వెంటనే వారి ఆశలపై నీళ్లు చల్లడం పరిపాటిగా మారింది.. రైల్వే జోన్ ప్రకటిస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ణత తెలుపుతామంటూ... స్థానిక బీజేపీ నేతలు ఢిల్లీ బయలు దేరిన.. 24 గంటల్లోపే కేంద్ర బీజేపీ నేతలు రైల్వే జోన్ సాధ్యం కాదంటూ.. సుప్రింకోర్టుకు ఇఛ్చిన అఫిడవిట్‌లో తేల్చేశారు. దీంతో బీజేపీ...

Saturday, July 28, 2018 - 20:32

విశాఖపట్టణం : మావోయిస్టుల అమరల సంస్మరణ వారోత్సవాలు హింసాత్మకంగా మారాయి. ఇన్ఫార్మర్‌ అనే నేపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రజా ప్రతినిధులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు హింసాత్మకంగా ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం జిల్లా గూడెంకొత్తవీధి మండలం...

Saturday, July 28, 2018 - 19:06

విశాఖపట్టణం : జీవితంలో కష్టపడటం, నిజాయితీగా ఉండటం వల్లే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని విఐటీ యూనివర్సిటీ చాన్సలర్‌ డాక్టర్‌ జి. విశ్వనాథ్‌ తెలిపారు. విఐటీ- ఏపీ యూనివర్సిటీ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ ఇంజనీరింగ్‌ కోర్సులు ప్రారంభమైన నేపథ్యంలో డియర్‌ బోర్న్‌ యూనివర్సిటీతో ఒప్పందంలో భాగంగా విద్యార్థులు అమెరికాలో కూడా కోర్సులు చదువుకునే అవకాశం ఉందన్నారు. రెండు...

Saturday, July 28, 2018 - 19:05

విశాఖపట్టణం : దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వేను రైల్వే జోన్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పై ఆనందాన్ని వ్యక్తం చేశారు బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు. ఈ సందర్భంగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో తొమ్మిది మంది బీజేపీనేతల బృందం ఢిల్లీ బయలు దేరింది. వెళ్లిన బృందానికి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు జండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు. తొమ్మిది మందితో కలిసిన బృందం పీయూష్‌...

Thursday, July 26, 2018 - 17:55

విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి గిరిప్రదక్షిణ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొండ చుట్టూ 32 కిలోమీటర్ల పొడవునా భక్తులు ప్రదక్షిణ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు రేపు చంద్రగ్రహణం కారణంగా స్వామివారి దర్శనాన్ని...

Wednesday, July 25, 2018 - 12:33

విశాఖపట్టణం : కేజీహెచ్ సీనియర్ అసిస్టెంట్, జిల్లా ఎన్జీవో అధ్యక్షుడు కొటారి ఈశ్వర్ రావు నివాసం పై ఏసీబీ దాడి చేసింది. ఏక కాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు కోటిన్నరకు పైగా అక్రమస్తులున్నట్లు గుర్తించారు. కోటారి ఈశ్వరరావు ఒకే చోటు కొన్ని ఏళ్లుగా పని చేస్తున్నారు. మందు సరఫరాకు 8 ఏళ్లుగా గుంటూరు జయకృష్ణ ఇండస్ట్రీస్ కు టెండర్లు దక్కడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విశాఖలోని ఇల్లు...

Pages

Don't Miss