విశాఖ
Wednesday, December 20, 2017 - 21:57

విశాఖ : జిల్లాలో తెలుగు తమ్ముళ్లు దుశ్శాసన పర్వానికి తెగబడ్డారు. భూఆక్రమణలను అడ్డుకున్న దళిత మహిళను వివస్త్రను చేసి, పైశాచికంగా దాడి చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తెలుగుదేశం నాయకులు యథేశ్చగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
దళిత మహిళను వివస్త్రను చేసి, పైశాచిక దాడి 
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో...

Wednesday, December 20, 2017 - 21:52

విశాఖ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుని 2019లోగా పూర్తి చేస్తానని కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరి హామీ ఇచ్చినట్లు ఏపీ బీజేపీ ఎంపీ హరిబాబు తెలిపారు. హరిబాబు నేతృత్వంలో బీజేపీ నేతలు కేంద్రమంత్రులను కలిసి విభజన హామీలు, రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చించారు. పోలవరం కాంట్రాక్టర్‌, ఆర్థిక పరమైన ఇబ్బందులను తొలగిస్తానని గడ్కరీ హామీ ఇచ్చినట్లు...

Wednesday, December 20, 2017 - 20:36

విశాఖ : జిల్లాలోని పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దారుణం జరిగింది. తెలుగు తమ్ముళ్లు దళిత మహిళపై దుశ్శాసన పర్వానికి పాల్పడ్డారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను ఆక్రమించుకునేందుకు టీడీపీ నాయకులు  ప్రయత్నించారు. బుల్‌డోజర్లలో భూములను చదును చేసేందుకు యత్నించిన తెలుగుదేశం నాయకులను అడ్డుకున్న దళిత మహిళపై దాష్టీకానికి పాల్పడ్డారు. భూఆక్రమణలను ప్రతిఘటించిన  మహిళపై  పైశాచికంగా...

Wednesday, December 20, 2017 - 15:49

విశాఖ : డీసీఐను ప్రైవేటీకరిస్తే చూస్తు ఊరుకోం అంటూ మెరుపు సమ్మెకు దిగారు కార్మికులు. సంస్ధ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత నెల 28 నుంచి డీసీఐ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. కార్మికులు చేస్తున్నసమ్మెకు డీసీఐ ఉద్యోగులతో పాటుగా డ్రెడ్జింగ్ షిప్స్‌పై పనిచేస్తున్న ఉద్యోగులు కూడా మద్దతిచ్చారు. డీసీఐ సమ్మెపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Wednesday, December 20, 2017 - 11:45

విశాఖపట్టణం : దళితులపై వివక్ష..దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దళితలను సాంఘీక బహిష్కరణ చేయడం...దాడులు చేయడం తదితర ఘటనలు వెలుగులోకి వసస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ దళిత మహిళపై అధికార పార్టీకి చెందిన నేతలు దాడికి పాల్పడ్డారు. స్థల వివాదంపై ఈ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దళితులకు ప్రభుత్వం స్థలాలిచ్చింది. ఈ భూములపై కొందరి...

Wednesday, December 20, 2017 - 06:32

విశాఖపట్టణం : గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు గిఫ్ట్‌ అన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ద్రోణంరాజు సత్యనారాయణ 85వ జయంతోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా పార్టీ నేతలు,...

Tuesday, December 19, 2017 - 11:07

పాలిటిక్స్ లోకి పరుచూరి

విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రధాన అనుచరుడిగా పరుచూరి భాస్కరరావుకు మంచి పేరుంది. ప్రత్యూష కంపెనీ డైరెక్టర్‌గా పారిశ్రామిక వర్గాలకు, గంటా శ్రీనివాసరావుల ప్రతి విజయం వెనుకా ఉండేది, వ్యూహాలు రచించేది పరుచూరే. 1999 నుండి అనకాపల్లిలో ఎంపీగా గెలిచిన నాటి నుండి 2014 ఎన్నికల్లో భీమిలి గెలుపు వరకు అన్నింటా గంటా విజయాలలో పరుచూరిదే...

Sunday, December 17, 2017 - 21:21

విశాఖపట్టణం : శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 85 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌ 65 పరుగులతో చెలరేగడంతో లంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యం ఏ మూలకూ చాలలేదు. భారత్‌ 32.1 ఓవర్లకే ఆటను ముగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో...

Sunday, December 17, 2017 - 17:11

విశాఖపట్టణం : జిల్లాలో భారత్ - లంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ కొనసాగుతోంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఆరంభం నుండి భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీనితో పరుగులు రాబట్టేందుకు లంక బ్యాట్స్ మెన్స్ శ్రమించాల్సి వచ్చింది. 44.5 ఓవర్లకే 215 పరుగులకే కుప్పకూలింది. యజ్వేంద్ర చాహల్ (3/46), కుల్ దీప్ యాదవ్ (3/42) విజృంభించారు. ఉపుల్ తరంగ (95), సమర...

Pages

Don't Miss