విజయనగరం
Wednesday, November 14, 2018 - 10:47

విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని తామరఖండి నుంచి ప్రారంభమైంది.  297 వరోజు యాత్ర నియోజక వర్గంలోని తామరఖండి నుంచి మొదలై చినభోగిలి, సీతానగరం, అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి మీదుగా చినరాయుడు పేట వరకు కొనసాగుతుంది.తమ ప్రాంతానికి...

Monday, November 12, 2018 - 11:52

విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 17 రోజుల విరామం తర్వాత  విజయనగరం జిల్లా సాలూరు మండలం పాయకపాడు నుంచి సోమవారం  పునఃప్రారంభం అయ్యింది. అక్టోబరు25న  విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంలో కలిగిన గాయం కారణంగా ఆయన తన పాదయాత్రను నిలిపివేశారు. వైద్యుల సూచన మేరకు జగన్ మోహన్...

Sunday, November 11, 2018 - 09:02

హైదరాబాద్: గతనెల 25న విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంలో గాయపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రజాసంకల్పయాత్రను సోమవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్న ఆయన ఆదివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుని, అక్కడినుంచి విజయనగరంజిల్లా...

Wednesday, October 24, 2018 - 21:06

విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర బుధవారం 3,200 కిలోమీటర్ల  మైలు రాయిని దాటింది. ఈసందర్బంగా విజయనగరంజిల్లా సాలూరు మండలం బాగువలస వద్ద  జగన్ కానుగ మొక్కను నాటారు. 293వ రోజు ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాసాలూరు మండలంలో జరుగుతున్న సమయంలో రాష్ట్రప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న పలు...

Monday, October 22, 2018 - 08:26

విజయనగరం : పట్టణం ఉత్సవాల సందడితో..  కళకళలాడుతోంది. 2 రోజుల పాటు జరిగే విజయనగర్ ఉత్సవ్‌తో పాటు.. సిరిమాను సంబరాలతో పట్టణమంతా పండగ శోభ సంతరించుకుంది. వివిధ ప్రదర్శనలు, సాంస్క్రతిక వేడుకలతో ఎటు చూసినా సందర్శకులతో కిటకిటలాడుతోంది పట్టణం.ఫ్లవర్ షో, ఫోటో ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్టు వంటి ప్రదర్శనలు చూసేందుకు జనం భారీగా...

Sunday, October 14, 2018 - 11:57

గజపతినగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపుల పాయనుంచి ఇచ్చాపురం దాకా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం నాడు 285వ రోజు విజయనగరంజిల్లా గజపతి నియోజక వర్గం కొమటిపల్లి నుంచి ప్ర్రారంభమైంది. చంద్రబాబు నాయుడు అబ్దదపు హామీలతో మోస పోయామని దత్తరాజేరు మండలం లో పర్యటిస్తున్న సందర్బంలో పలువురు నిరుద్యోగులు ఉపాధిలేక...

Saturday, October 13, 2018 - 13:53

విజయనగరం: ఉత్తరాంధ్రను వణికించిన తిత్లీ తుపాను కారణంగా విరామం ఇచ్చిన ప్రజా సంకల్పయాత్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శనివారం  ఉదయం తిరిగి గజపతి నగరం  నియోజక వర్గంలోని మదుపాడు నుంచి మొదలు పెట్టారు.  284 వ రోజు  ప్రారంభమైన  పాదయాత్రలో  ప్రతి చోట  ప్రజలు ఆయనకు బ్రహ్మరధం పడుతూ తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు...

Monday, September 24, 2018 - 17:35

విజయనగరం : ఏపీ రాష్ట్రంలో మరలా చంద్రబాబు పాలన వస్తే కష్టాలు ఎదురవుతాయని, వివిధ పథకాలకు తిలోదకాలిస్తాయని, ధర్మం..న్యాయం ఉండదని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో చారిత్రక ఘట్టం ఏర్పడింది. మూడు వేల కిలో మీటర్ల పాదయాత్రను జగన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా కొత్తవలసలోని దేశపాత్రునిపాలెం వద్ద పైలాన్ ఆవిష్కరించి రావి మొక్కను నాటారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడారు....

Monday, August 27, 2018 - 14:02

 విజయనగరం : జిల్లాలోని పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం  దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యాలయం ముట్టడికి వచ్చిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. జీ ప్లస్‌ త్రీ హౌసింగ్‌ స్కీంలో అవకతవకలు జరిగాయంటూ సీపీఎం ఆందోళనకు దిగింది.

 

Sunday, August 26, 2018 - 21:21

హైదరాబాద్ : అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల.. మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండగను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రముఖులకు కూడా వారి అక్క చెల్లెలు రాఖీలు కట్టి తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంపీ కవిత తన సోదరుడైన మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి... తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని...

Wednesday, August 22, 2018 - 17:05

విజయనగరం : ఇటీవల కురిసిన వర్షాలతో విజయనగరం జిల్లాలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వర్షాలు లేక వరినాట్లు పడకపోవడంతో బెంగపెట్టుకున్న రైతన్న...తాజాగా కురిసిన వర్షాలతో ఊరట చెందుతున్నాడు. ఈపాటికే వరినాట్లు పూర్తికావాల్సి ఉండగా వర్షాలు లేకపోవడంతో ఆలస్యమైంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వరదలతో ఇబ్బంది పడుతుంటే...విజయనగరం జిల్లాలో మాత్రం...

Pages

Don't Miss