విజయనగరం
Tuesday, February 28, 2017 - 06:45

విజయవాడ : ఏపీలో కరెంటు చార్జీలు పెంచాలన్న విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రతిపాదనలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని రెండు డిస్కంలు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో దాదాపు 2వేల కోట్ల రూపాయల లోటు చూపించాయి. దీనిని భర్తీ చేసుకునేందుకు చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలపై ఈఆర్సీ ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టింది....

Sunday, February 26, 2017 - 19:20

విజయనగరం: అక్కడి దేవుడికి నాన్‌వెజ్‌ అంటే మహాఇష్టం. అందులోనూ చేపల కూరంటే మహా ప్రీతి. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు ఆయనకు నైవేద్యంగా చేపల కూరను సమర్పిస్తారు. భక్తులు అమితంగా కొలిచే ఆ దేవుడెవరు? పండుగ రోజున దేవుడికి చేపల కూరను నైవేద్యంగా పెట్టే వింత ఎక్కడ జరుగుతుంది. తెలుసుకోవాలంటే వాచ్‌ దిస్‌ స్టోరీ...

నాన్‌వెజ్‌ భోజనం భలే...

Sunday, February 12, 2017 - 11:54

విజయనగరం : జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వద్ద ఓ బైక్‌ చెట్టున ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Sunday, February 5, 2017 - 16:09

విజయనగరం : జిల్లాలోని పార్వతీపురం మండలం తాళ్లబురిడిలో ఉద్రిక్తత నెలకొంది. బోడికొండ గ్రానైట్‌ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. కోకర్ణ కంపెనీకి చెందిన మైనింగ్‌ యంత్రాలను ధ్వంసం చేశారు. 

 

Thursday, February 2, 2017 - 09:05

విజయనగరం : గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో మళ్లీ అలజడి మొదలయ్యింది.. సాలూరు- కొరాపుట్‌ రహదారిలోని సుంకి ఘాటీ ముంగరు భూమి గ్రామం వద్ద ఒడిశా రాష్ట్ర సాయుధ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరతో పేల్చిన ఘటనలో 7గురు జవాన్లు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ వ్యాన్ కు సంబంధించిన శకలాలు 25 అడుగుల ఎత్తులో చెట్టుపై చిక్కుకోవడం చూస్తే పేలుడు...

Friday, January 27, 2017 - 18:13

విజయనగరం : మంచు కొండలు విరిగిపడి జవాను నాగరాజు మృతితో అతని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.. నిరుపేద కుటుంబానికిచెందిన నాగరాజు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం గ్రామానికి చెందినవాడు.. ఏడేళ్లక్రితం ఆర్మీలో చేరాడు.. ఉద్యోగంవచ్చినప్పటినుంచి తమ్ముడు, చెల్లెళ్ల చదువుకు డబ్బు పంపుతూ ఉండేవాడు.. ఎనిమిదినెలల క్రితం నాగరాజు అనూషను వివాహం చేసుకున్నాడు.....

Tuesday, January 24, 2017 - 09:33

విజయనగరం : కూనేరు దగ్గర జరిగిన హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. ఎన్ ఐఏతోపాటు, ఏపీ సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్‌ నిపుణులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం వెనుక మావోయిస్టులు, ఉగ్రవాదుల ధ్వంస రచన ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. 
రైల్వే అధికారుల నుంచి...

Tuesday, January 24, 2017 - 09:30

విజయవాడ : చంద్రబాబు నోట క్షమాపణ వెలువడింది. వంశధార భూ నిర్వాసితులపై సర్కారీ దాష్టీకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో.. చంద్రబాబు.. సదరు ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు క్షమాపణ చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగానే పరిహారం అందజేయలేకపోయామని సీఎం అంగీకరించారు. పరిహారం చెల్లించడంలో జిల్లా అధికారుల తప్పిదం కారణంగా వంశధార నిర్వాసితులు ఆందోళనకు దిగారన్నారు. 
...

Monday, January 23, 2017 - 15:41

విజయనగరం : జిల్లాలోని మెరకముడిదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఒక వృద్ధుడు సజీవ దహనమయ్యాడు.

Monday, January 23, 2017 - 13:15

విజయనగరం : హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు దుర్ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కుట్ర కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదమా ? లేక విద్రోహ చర్య ? అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. శనివారం అర్ధరాత్రి హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 39 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం సీఐడీ, ఎన్ఐఏ...

Pages

Don't Miss