విజయనగరం
Sunday, January 22, 2017 - 06:16

విజయనగరం : ఘోర దుర్ఘటన..గమ్యస్థానాలకు చేరుకోకముందే అనంతలోకాలకి వెళ్లిపోయారు. ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మిన్నంటుంతోంది. హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 33 మంది దుర్మరణం చెందారు. సుమారు వంద మందికిపైగా గాయాలపాలయ్యారు. జగదల్ పూర్ నుండి భువనేశ్వర్ కు ఎక్స్ ప్రెస్ రైలు వెళుతోంది. కొమరాడ మండలం కూనేరు వద్దకు చేరుకున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఏం జరిగిందో తెలిసే లోపే...

Saturday, January 21, 2017 - 16:29

విజయనగరం : జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ అస్తవ్యస్తంగా మారింది. రహదారుల విస్తరణలో ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఎనిమిది రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు

విజయనగరంలో రోడ్ల విస్తరణకు మున్సిపల్‌ అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది కొత్త రోడ్లను మంజూరు చేసింది...

Saturday, January 21, 2017 - 12:39

విజయనగరం : జిల్లాలో తాటిపూడి రిజర్వాయర్‌ గేటు విరిగిపోవడంతో దిగువ ప్రాంతానికి భారీగా నీరు ప్రవహిస్తోంది. నీటి ప్రవాహ ధాటికి ఒక గిరిజన మహిళ నీటిలో కొట్టుకుపోయింది. నీటి ప్రవాహ దాటిని కట్టడి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

Thursday, January 19, 2017 - 09:01

విజయవాడ : ఏపీలో విద్యుత్ వినియోగదారులకు త్వరలో పవర్ షాక్ తగలనుంది. ఏప్రిల్ నుంచి రూ.850 కోట్ల మేర చార్జీలు పెంచేందుకు వీలుగా విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రావడంతో ఆంధ్రప్రదేశ్ నియంత్రణ మండలికి ఈ ప్రతిపాదనలు వెళ్లాయి. ఏపీఈఆర్సీ ఓకే చెబితే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల పిడుగు పడటం ఖాయంగా కనిపిస్తోంది.గృహ విద్యుత్ వినియోగదారులకు...

Tuesday, January 17, 2017 - 16:13

విజయనగరం : జిల్లా జామి మండలంలో తెల్లవారుజామున తాగుబోతు వీరంగం సృష్టించాడు. రామభద్రాపురం గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Friday, January 13, 2017 - 11:44

విజయనగం : భోగభాగ్యాల భోగీ పండగను స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతీ ఏటా మాదిరిగానే జిల్లాలో సంప్రదాయ రీతిలో సంక్రాంతి వేడుకలకు ప్రజలు శ్రీకారం చుట్టారు. చిన్నా, పెద్ద అన్న వయోబేధం లేకుండా భోగీ వేడుకల్లో పాలుపంచుకున్నారు.  కష్టాలు తొలగి, సుఖశాంతులతో అంతా ఉండాలని  ఆకాంక్షిస్తూ పండగను వైభవంగా జరుపుకుంటున్నారు. యువతి, యువకులు ఆటపాటలతో సందడి చేశారు.  

Thursday, January 12, 2017 - 09:29

విజయనగరం : భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా ముగిసింది. ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట ఉద్యమ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఎయిర్‌ పోర్టు ప్రభావిత గ్రామ ప్రజలు సభను బహిష్కరించారు. దీంతో అధికారులు ఉన్న కొద్దిమందితోనే ప్రజాభిప్రాయ సేకరణ తూతూ మంత్రంగా ముగించి చేతులు దులుపుకున్నారు. 
బాధిత గ్రామాల నుంచి...

Thursday, January 12, 2017 - 09:26

విజయవాడ : అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దుకొంటున్న విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు సరికొత్త హంగులతో అందుబాటులోకి వస్తోంది. దేశ విదేశాలకు మరిన్ని సర్వీసులు ఇక్కడి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్ పోర్ట్‌లో నూతనంగా నిర్మించిన టెర్మినల్‌ను సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు ప్రారంభించనున్నారు. 
నూతన టెర్మినల్ ముస్తాబు
విజయవాడ సమీపంలోని గన్నవరం...

Wednesday, January 11, 2017 - 13:35

విజయనగరం : బోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయసేకరణ రసాభాసగా మారింది. వామపక్ష, ప్రజాసంఘాల నేతల ముందస్తు అరెస్ట్‌పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్‌లకు నిరసనగా ప్రజాభిప్రాయ సేకరణను గ్రామస్తులు బహిష్కరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

Tuesday, January 10, 2017 - 19:44

విజయనగరం : పచ్చని పంట పొలాలు బూడిదవుతున్నాయి...బాంబుల మోతతో పల్లె ప్రజలు అల్లాడుతున్నారు... దుమ్ము, ధూళితో బతుకులు బుగ్గిపాలవుతున్నాయి.. ఇది విజయనగరం జిల్లాలో ఓ గ్రామ దీనగాథ.

కొంకిడివరంలో అక్రమ క్వారీ నిర్వహణ
ఎటు చూసినా.. బూడిద.. బాంబుల పేలుళ్లు.. ప్రమాదపు అంచున జీవిస్తున్న ప్రజలు.. విజయనగరం జిల్లా.. గురుగుబిల్లి మండలంలోని...

Monday, January 9, 2017 - 11:40

విజయనగరం : జిల్లాలోని గురుగుబిల్లి మండలం కొంకడివరంలో అక్రమక్వారీపై గ్రామస్తులు తిరగబడ్డారు.. క్వారీ రాయిని పేల్చేందుకు బాంబులు అమర్చడంపై ఆందోళనకు దిగారు.. అక్రమ క్వారీయింగ్‌ చేస్తున్న నిర్వాహకులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు.. తాము ఆందోళనచేస్తున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులనుంచి ఎలాంటి స్పందనా రావడంలేదని ఆరోపించారు.. గ్రామస్తుల సమాచారంతో...

Pages

Don't Miss