విజయనగరం
Thursday, October 12, 2017 - 07:34

విజయనగరం : ఫైనాన్స్‌ కార్యాలయంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం విజయనగరం పోలీసులకు కాసుల వర్షం కురిపించింది...వెంటనే రైడ్ చేసి రాఘవరెడ్డితో పాటు ఇతరులను పట్టుకున్నారు...ఆ సమయంలో దండు కోవాల్సింది దండుకున్నారు. విజయనగరం టూటౌన్‌ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ నరసింహమూర్తి తాను అనుకున్నట్లుగానే ఫైనాన్స్‌ ఆఫీస్‌పై దాడులు చేసి కేసులు పెట్టారు...ఇక ఆ కేసులో భాగంగా రాఘవరరెడ్డి వాహనాలు సీజ్ చేయడం...

Monday, October 9, 2017 - 09:31

విజయనగరం : జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రూట్‌ మార్చుతున్నారు. గంజాయి స్మగ్లింగ్‌కు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో పోలీసుల నిఘా తక్కువగా ఉంటుందో తెలుసుకుంటున్నారు. పక్కాగా ప్లాన్‌ చేసుకుని గంజాయిని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు.   

విజయనగరం జిల్లాలో గంజాయి స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పక్కా...

Friday, October 6, 2017 - 13:43

విజయనగరం : పెళ్లి సమయానికి వరుడు పరారైన ఘటన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం దళాయివలసలో చోటు చేసుకుంది. మూడేళ్లుగా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన యువకుడు... ఎట్టకేలకు పెద్దల సమక్షంలో పెళ్లికి అంగీకరించాడు. అయితే...కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా... శంకర్‌రావు కనిపించకుండాపోయాడు. దీంతో వధువు బంధువులు లబోదిబోమంటున్నారు. 

Friday, October 6, 2017 - 11:56

విజయనగరం : జిల్లాలో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా జిల్లాలో ఆర్మీ రిక్రూట్ మెంట్ నిలిచిపోయింది. గ్రౌండ్ బురదమయంగా మారడంతో రిక్రూట్ మెంట్ నిలిపివేశారు. రెండు నెలల తర్వాత మళ్లీ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు భారీ వర్షంతో ఎస్,కోటలో కాలనీలు జలమయం అయ్యాయి. పలు ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

 

Thursday, October 5, 2017 - 15:22

విజయనగరం : రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. స్థానిక రాజీవ్‌ స్టేడియంలో రేపటి నుంచి ఈ నెల 17 వరకు.. ఆర్మీ నియామక ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి, కృష్ణా, యానాం ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరుకానున్నారు. మొత్తం ఐదు కేటగిరీల్లో జరిగే నియామక ప్రక్రియకు.. సుమారు 50 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు....

Wednesday, October 4, 2017 - 18:47

విజయనగరం : పైడితల్లి అమ్మవారి ఆలయ ఈవోపై కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి సిరిమాను ఉత్సవంలో సిరిమాను రథం వైసిపి నేత బొత్స సత్యనారాయణ కుటుంబసభ్యులు, వైసీపీ నేతలు కూర్చున్న డీసీసీబీ వద్ద ఆగడంపై మండిపడ్డారు. ఉత్సవ రథం ఎవరి ప్రోద్భలంతో ఆగిందో ఆరా తీసి నివేదిక ఇవ్వాలని ఈవోను ఆదేశించారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. 

...
Tuesday, October 3, 2017 - 17:41

 

విజయనగరం : పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు దంపతులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, వైసీపీ నాయకులు, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్‌ వివేక్‌...

Tuesday, October 3, 2017 - 10:40
Tuesday, October 3, 2017 - 09:23

విజయనగరం : ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం..విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడి తల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పైడి తల్లి జాతరలో తొలి ఘట్టమైన తొలేళ్ల సంబరం ముగిసింది. నేడు ప్రధాన ఘట్టానికి తెరలేచింది. పైడి తల్లి సిరిమాను ఉత్సవం జరుగుబోతోంది. మధ్యాహ్నం మూడు గంటలకు సిరిమానోత్సవం జరుగనుంది. అమ్మవారిని దర్శించుకొనేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. సిరిమానోత్సవం...

Pages

Don't Miss