విజయనగరం
Monday, April 25, 2016 - 12:53

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తలపై వైసీపీ నేత బోత్స సత్యనారాయణ స్పందించారు. ఆయనతో టెన్ టివి నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పలు విషయాలపై మాట్లాడారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇటీవలే పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది..పార్టీ పెట్టే హక్కు కూడా ఉందని బోత్స తెలిపారు. ఆ హక్కు..స్వేచ్ఛతో ఆయన...

Sunday, April 24, 2016 - 09:57

మరికొద్ది రోజుల్లో ఇంటర్ మీడియట్ విద్యార్థులు 'ఎంసెట్' పరీక్ష రాయబోతున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్ష జరగనుంది. ఈ సమయంలో విద్యార్థులు ప్రిపరేషన్ లో తలమునకలై ఉన్నారు. ఈ సమయంలో ఎలాంటి సబ్జెక్టులపై దృష్టి కేంద్రీకరించాలి ? ఎక్కువ మార్కులు సాధించడం ఎలా ? ఈ అంశంపై టెన్ టివిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన నిపుణులు కార్యక్రమంలో...

Sunday, April 24, 2016 - 08:07

విశాఖపట్టణం : తలపాక ట్రాన్స్ కో విద్యుత్ ఉప కేంద్రంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీనితో నాలుగు జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం తలపాకలోని 440 కెవీ సబ్ స్టేషన్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీనితో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉదయం 4గంటల నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దువ్వాడ - పలాస రైలు మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం...

Monday, April 18, 2016 - 20:07

విజయనగరం : సింహాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ధర్మకర్తగా కేంద్రమంత్రి విజయనగరం రాజవంశీయులు అయిన అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం చేశారు. గతంలో ధర్మకర్తగా ఉన్న ఆనంద గజపతిరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో బాధ్యతలు స్వీకరించారు. ఆయన మరణం తీరని లోటని కంటతడి పెట్టారు.  ఆలయ ఆభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 

 

Monday, April 18, 2016 - 20:04

విజయనగరం : కేంద్రమంత్రి అశోక గజపతిరాజును... బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగరావు, ఆయన సోదరుడు దేబీ నాయిన కలిశారు. వీరిద్దరు త్వరలో టీడీపీలో చేరనున్నారన్న సమాచారం మధ్య ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈనెల 20న టీడీపీలో చేరే అవకాశం ఉంది. 

 

Saturday, April 16, 2016 - 14:26

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు .. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తును ముమ్మరం చేశారా..? అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఈసారి క్యాబినెట్‌ రూపకల్పనలో తనదైన మార్కును వేయనున్నారని.. 2019 ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చే రీతిలో మంత్రివర్గం ఉంటుందని అంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ వార్తలతో.. కొందరు సచివుల్లో ఇప్పటికే గుబులు మొదలైంది. ఎవరికి పదవీ గండం పొంచి...

Friday, April 15, 2016 - 07:21

విజయవాడ : నేటి నుంచి ఏపీలో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. రెండు నెలల పాటు.. నిషేధం మూలంగా లక్షలాది మత్య్సకారుల కుటుంబాలు కనీసం తినడానికి తిండిలేక అల్లాడనున్నాయి. ఆర్థిక సహకారం ఇవ్వకుండా రకరకాల ఆంక్షలు, కొర్రీలతో ప్రభుత్వం హామీలను దాటవేస్తున్నాయి. ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందా...సర్కార్ కొత్తగా ఆలోచించి మత్స్యకారులను ఆదుకుంటుందా.. పాతపాటే పాడుతుందా.. అన్నది తేలాల్సి ఉంది ....

Friday, April 15, 2016 - 06:44

విజయనగరం : వైసీపీకి మరో షాక్‌ తగలనుంది. ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు త్వరలో సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. రెండు మూడు రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. మరోపక్క రంగారావు సోదరులను బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ్యుడు సుజయకృష్ణ రంగారావు సోదరులు సైకిల్ ఎక్కేందుకు...

Thursday, March 31, 2016 - 15:08

హైదరాబాద్ : రూ.216 కోట్ల రూపాయల విద్యుత్‌ ఛార్జీలను ఏపీ ఈఆర్‌సీ పెంచింది. తొలుత 783 కోట్ల రూపాయల విద్యుత్‌ ఛార్జీల పెంపును ప్రతిపాదించిన ఈఆర్‌సీ రూ. 216కు పరిమితం చేసింది. ముఖ్యంగా గృహ వినియోగదారుల విద్యుత్ ఛార్జీలను యాథాతథంగా ఉంచింది. ఏ కేటగిరిలోను ఛార్జీలను పెంచలేదు. గృహేతర వినియోగదారులకు మాత్రం 2 శాతం విద్యుత్‌ ఛార్జీలను పెంచింది. గృహ వినియోగం, 100 యూనిట్లలోపు గృహేతర...

Wednesday, March 23, 2016 - 17:06

విజయనగరం : జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి గ్రామాల్లో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పది గంటల తర్వాత కూడా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. బెల్ట్ షాపుల్లో ఎమ్మార్పీ రేట్లకు అదనంగా 10 నుంచి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో జరుగుతున్న జాతరలు వారికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని గజపతినగరం...

Friday, March 18, 2016 - 19:48

విజయనగరం : జిల్లాలో ఆశా వర్కర్ల చలో కలెక్టరేట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. దీక్షలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ధర్నా చేపట్టారు. ఆందోళన ఉధృతం కావడంతో...పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మద్య తోపులాట జరగడంతో సీఐటీయూ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశావర్కర్లు పోలీసువాహనాలను అడ్డుకోవడంతో కాసేపు...

Pages

Don't Miss