విజయనగరం
Friday, May 11, 2018 - 06:32

విజయనగరం : జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, టీడీపీ నాయకులురాలు శోభా స్వాతిరాణి రాజకీయ భవిష్యత్‌ డోలాయమానంలో పడింది. జెడ్‌పీ చైర్‌పర్సన్‌ పదవీకాలం మరో ఏడాదితో ముగియనుంది. దీంతో రాజకీయంగా ఎటువైపు అడుగులు వేయాలా.. అన్న విషయంలో స్వాతిరాణి ఊగిసలాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా... చేస్తే ఏ సీటును ఎంచుకోవాలి... అరకు లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగాలా.. అన్న విషయాల్లో...

Wednesday, May 9, 2018 - 10:48

హైదరాబాద్ : బీటెక్‌ చదువుకుంది.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది.. అయితే ఆ పెళ్లి ఇష్టం లేదన్న కోపంతో... స్కెచ్‌ వేసి... సుపారీ ఇచ్చి మరీ భర్తను మట్టుబెట్టించింది. చివరకు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ ఉద్యానవనం దగ్గర్లో సోమవారం జరిగిన నవదంపతులపై దాడి ఘటన ఊహించని మలుపు తిరిగింది....

Tuesday, May 8, 2018 - 08:17

విజయనగరం : భర్తల హత్యకు భార్యలు పథకాలు రచిస్తున్నారు. ఇష్టం లేని కారణంగా..అక్రమ సంబంధం బయటపడిందని..పడుతుందనే..ఇతరత్రా కారణాలతో హత్యలు చేసేస్తున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో బయటపడగా తాజాగా ఏపీలో మరో ఇలాంటి హత్య బయటపడడం కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లాలో జరిగిన నవదంపతుల దాడిలో భార్య కీలక పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు. పెళ్లైన పది రోజులకే భర్తను నవ వధువు...

Monday, May 7, 2018 - 21:19

విజయవాడ : ఆడబిడ్డలకు రక్షణ కావాలని ఏపీ ప్రజలు నినదించారు. మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడినే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. విజయవాడలో సేవ్‌గాల్‌చైల్డ్‌ ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దాచేపల్లి లాంటి దారుణాలకు పాల్పడే వారిని కఠినంగా అణచివేస్తామన్నారు. మరోవైపు.. సీఎం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు చైతన్య ర్యాలీలు నిర్వహించారు....

Monday, May 7, 2018 - 12:43

విజయనగరం : జిల్లాలో 'ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం' పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ పాల్ రాజు ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. 

Thursday, May 3, 2018 - 11:17

విశాఖ : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుండే కుండపోతగా వర్షం కురవడంతో పలు చోట్లు చెట్లు నేలకొరిగాయి. విశాఖలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుండే కుండపోత వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. విజయనగరం జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పిడుగులు పడి ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. ఇటు పశ్చిమగోదావరి...

Wednesday, May 2, 2018 - 16:44

విజయనగరం : మంగళవారం కురిసిన అకాల వర్షంతో విజయనగరం జిల్లాలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది. పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందగా.. భారీ స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి.. ఏడాది పాటు కష్టపడి పండించిన పంట.. మూడు గంటల పాటు కురిసిన వర్షానికి.. కళ్లముందే నీటిపాలైంది. కోలుకోలేని నష్టం జరగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అరటి, మామిడి, జీడి మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి. పిడుగుపాటుకు...

Tuesday, May 1, 2018 - 13:49

విశాఖ : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పిడుగులు పడే అవకాశముందని రాష్ర్ట విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరోవైపు వేడుగాలులతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వానలు కాస్త ఊరటనిచ్చాయి.
శ్రీకాకుళం 
శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు...

Saturday, April 28, 2018 - 18:28

విజయనగరం : ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరాయి. గుర్ల మండలం కోటగండ్రేడులోని చంపావతి నదిలో ఇష్టానుసారంగా ఇసుకు తవ్వకాలు జరుపుతున్నారు. ఉచిత ఇసుక విధానానికి స్థానికనేతలే తూట్లు పొడుస్తున్నారు. మంత్రి జిల్లాలోనే అడ్డూ అదుపు లేకుండా ఇసుక దందా సాగుతోంది.

చంపావతి నదిలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు
విజయనగరం జిల్లాలోని గుర్లపాడు మండలం...

Pages

Don't Miss