విజయనగరం
Wednesday, September 16, 2015 - 13:21

చిత్తూరు : కేశవరెడ్డి పాఠశాలల్లో బుధవారం ఉదయం సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. బుధవారం చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకున్న కేశవరెడ్డి విద్యా సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా అధికంగా విద్యాలయాలున్న చిత్తూరు, కడప జిల్లాలో ప్రధాన దృష్టి సారించినట్లు సమాచారం. మొత్తంగా 13 జిల్లాలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం....

Tuesday, September 15, 2015 - 18:27

విజయనగరం : జిల్లాలో భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యతిరేక ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వామపక్షాలు హెచ్చరించాయి. భూసేకరణ నోటిఫికేషన్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. భోగాపురం మండలం గూడెపువలసలో పది వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాయి. ఇక్కడ ఎయిర్‌పోర్ట్ కావాలని ఏ ఒక్కరూ కోరుకోవడం లేదని... పోలీసులు అతిగా వ్యవహరిస్తే సహించేది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి...

Tuesday, September 15, 2015 - 10:33

విజయనగరం : ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన గుల్లిపిల్లి మురళి, చోడిపల్లి జ్యోతిలు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వెంటనే వారిని చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు...

Monday, September 14, 2015 - 19:51

విజయనగరం : జిల్లా భోగాపురం మండలంలో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. గ్రామాల్లోకి వెళ్లే అధికారులను ఎయిర్ పోర్టు బాధిత గ్రామాల ప్రజలు అడ్డున్నారు. భూసేకరణ, ప్యాకేజీ వివరాలను రైతులకు తెలియజేసేందుకు మండలంలోని గూడెపువలసకు వెళ్లిన తహశీల్దార్ లక్షారెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. రిలే నిరాహార దీక్షలో ఉన్న మహిళలు ఆయన కారును చుట్టుముట్టి, వెనక్కి వెళ్లిపోవాలని...

Monday, September 14, 2015 - 13:35

విజయనగరం : జిల్లా కొత్తవలసలో ఉన్న స్టెయిన్ లెస్ లిమిటెడ్ ఫెర్రోఅల్లాయీస్ పరిశ్రమ మూతపడింది. పరిశ్రమకు నష్టం వస్తున్నందున పరిశ్రమను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ముందస్తు నోటీసులు ఏవీ లేకుండా ఇలా ఉన్నపళంగా పరిశ్రమ మూసివేయడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తవలస సమీపంలోగల ఫెర్లో ఎల్లాయిస్ కంపెనీని లాకౌట్ చేశారు. దీంతో ఆ కంపెనీపై ఆధారపడ్డ దాదాపు 1300...

Monday, September 14, 2015 - 06:32

విజయనగరం : భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యవహారం.. పరిసర గ్రామాల్లో హైటెన్షన్‌ను రేపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు లాక్కోవాలని ప్రభుత్వం.. చచ్చినా ఇచ్చేది లేదంటూ గ్రామస్థులు.. పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు, ఇప్పుడు నేరుగా రైతులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిసర గ్రామాల్లోని చిన్నా పెద్ద...

Sunday, September 13, 2015 - 18:57

విజయనగరం : భోగాపురం ఎయిర్ పోర్టు బాధిత గ్రామం కొంగవానిపాలెంలో కలెక్టర్ ఎంఎం నాయక్ పోలీసుల భద్రత మధ్య పర్యటించారు. గ్రామస్తులు కలెక్టర్ ను అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టు అబివృద్ధి జరుగుతుందని గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు కలెక్టర్ ప్రయత్నం చేశాడు. ఎయిర్ పోర్టు వద్దంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. మాటలతో మోసం చేయొద్దని గ్రామస్తులు అన్నారు. దీంతో కలెక్టర్ నాయక్ వెనుదిరిగారు.  

Saturday, September 12, 2015 - 09:32

విజయనగరం : జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. నేటి నుంచి అధికారులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. 60 రోజుల్లో అభ్యంతరాలు తెలపాలని సూచించారు. రైతుల దగ్గరికి వెళ్లి నోటీసులను అధికారులు అందచేయనున్నారు. గ్రామాల్లోకి అధికారులను రానివ్వమని రైతులు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా రైతులు ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 2013 భూ సేకరణ చట్టం...

Friday, September 11, 2015 - 06:59

హైదరాబాద్ : ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. సాగు,తాగునీటి కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. విజయనగరం జిల్లా ఉల్లిభద్ర గ్రామంలో ప్రతిష్టాత్మక తోటపల్లి రిజర్వాయర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. ప్రాజెక్ట్ పైలాన్‌ను ఆవిష్కరించి తర్వాత కుడికాలువ ద్వారా 50వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని...

Thursday, September 10, 2015 - 18:53

విజయనగరం : ఉత్తరాంధ్ర వాసుల రైతు కష్టాలను తీర్చే తోటపల్లి రిజర్వాయర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేశారు. ఈ రిజర్వాయర్ పదేళ్ల క్రితమే పూర్తి కావల్సి ఉండగా... కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు పూర్తికి 12 ఏళ్లు పట్టిందని బాబు ఆరోపించారు. 2003లో తానే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని ఇప్పుడు తన చేతులమీదనే ప్రారంభమైందన్నారు. విజయనగరం జిల్లా...

Thursday, September 10, 2015 - 09:33

హైదరాబాద్ : విజయనగరంలో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు. ఆయన రాక ముందే.. పర్యటనను అడ్డుకుంటారనే అనుమానంతో సీపీఎం నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు. భూసేకరణ వివాదాల నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు పాల్పడుతున్నారు. 

Pages

Don't Miss