విజయనగరం
Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Friday, November 3, 2017 - 18:38

విజయవాడ : జిల్లాల పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న హామీలు కోటలు దాటుతున్నాయి. అమలు మాత్రం గడప దాటడంలేదు. బడ్జెట్‌లో నిధులు లేకపోయినా... వేల కోట్ల రూపాయల వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. మూడున్నరేళ్లలో జిల్లాల పర్యటనలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎన్ని వేల కోట్ల రూపాయాలకు చేరుకున్నాయో వింటే ఎవరికైనా గుండె గుబేల్‌ మంటుంది. చంద్రబాబు వాగ్దానాలు అమలు చేయాలంటే 49 వేల కోట్ల...

Wednesday, November 1, 2017 - 19:08

విజయనగరం : జిల్లా, చీపురుపల్లి బీసీ సమీకృత గృహంలో దారుణం జరిగింది. సిబ్బంది 2 రోజుల క్రితం శీతల పానియాల్లో మద్యం కలిపి విద్యార్థులకు బలవంతంగా తాపించారు. ఈ విషయంపై బీసీ సంక్షేమశాఖ సహాయ అధికారి పైడిరాజు విచారణ చేశారు. విద్యార్థులతో బలవంతంగా మద్యం తాగించడం నిజమేనని విచారణాధికారి తేల్చారు.

 

Wednesday, November 1, 2017 - 16:20
Wednesday, November 1, 2017 - 12:43

విజయనగరం : జిల్లాలోని చీపురుపల్లి బీసీ సమీకృత గృహంలో దారుణం జరిగింది. సిబ్బంది 2 రోజుల క్రితం శీతల పానియాల్లో మద్యం కలిపి విద్యార్థులకు పట్టించారు. ఈ విషయంపై బీసీ సంక్షేమశాఖ సహాయ అధికారి పైడిరాజు విచారణ చేశారు. విద్యార్థులతో బలవంతంగా మద్యం తాగించడం నిజమేనని విచారణాధికారి తేల్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

Thursday, October 26, 2017 - 19:26

విజయనగరం : జిల్లాలో విషాదం నెలకొంది. మజ్జిగౌరి అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తున్న ఇద్దరు మహిళలు... ప్రమాదవశాత్తు నాగావళి నదిలో మునిగిపోయిన చనిపోయారు. మృతులు విశాఖకు చెందిన జ్యోతి, దేవిలుగా గుర్తించారు. వీరిద్దరు విశాఖపట్నంలోని వైభవ్‌ షోరూంలో పనిచేస్తున్నట్లు సమాచారం.

Thursday, October 26, 2017 - 15:37

విజయనగరం : జిల్లా, కోమటిపల్లి సమీపంలో ఆటోడ్రైవర్‌ ఇద్దరు అక్కాచెల్లెళ్లపై దాడికి దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బొబ్బిలి నుంచి కోమటిపల్లికి వెళ్లేందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆటో ఎక్కారు. కోమటిపల్లి సమీపిస్తున్న సమయంలో డ్రైవర్‌ ఆటోను వెనక్కి తిప్పాడు. అనుమానం వచ్చిన ఇద్దరమ్మాయిలు ఆటో నుంచి కిందకు దూకారు. జరిగిన విషయం ఫోన్‌లో ఇంట్లోవారికి చెప్పే ప్రయత్నం చేయడంతో ఆటోడ్రైవర్...

Pages

Don't Miss