విజయనగరం
Wednesday, August 2, 2017 - 17:48

విజయనగరం : వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేచింది. పొలిటికల్‌ నిరుద్యోగులంతా నియోజకవర్గాల పెంపుపైనే ఆశలు పెంచుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  విజయనగరం జిల్లాలోని రాజకీయ నిరుద్యోగులు నియోజకవర్గాల పెంపుపై గంపెడాశలు పెంచుకున్నారు. విజయనగరం జిల్లాలోని పవర్‌ పాలిటిక్స్‌...

Sunday, July 30, 2017 - 19:12

విజయనగరం : విజయనగరం జిల్లా కురుపాం నియోజక వర్గం పరిధిలో ఉన్న గుమ్మడి చెక్‌డ్యాం ఆ ప్రాంత రైతులకు ప్రధాన సాగునీటి వనరు. ఈ చెక్‌ డ్యాం కింద కురుపాం, కొమరాడ, జియ్యమ్మ వలస మండలాల పరిధిలో సుమారు పదివేల ఎకరాల భూమి సాగవుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాగానే ప్రతి ఏడాది గుమ్మడిగెడ్డ కాలువల్లో పూడిక తీత పనులు జరుగుతుండేవి. ఇరిగేషన్‌ శాఖ, సాగునీటి సంఘాలు విడుదల చేసే నిధులతో పూడికను తీసి...

Friday, July 28, 2017 - 13:59

విజయనగరం : కుక్కపిల్లకోసం కొట్టుకొని ఏడుగురు గాయాలపాలయ్యారు.. విజయనగరం జిల్లా బలీజిపేట మండలం వంతారంలో కొందరు వ్యక్తులు రెండుగా విడిపోయి కుక్కపిల్లకోసం ఘర్షణ పడ్డారు.. ఈ గొడవలో ఏడుగురికి గాయాలయ్యాయి.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Thursday, July 27, 2017 - 15:43

విజయనగరం : నిన్న, మొన్నటి వరకు ఆ తహశీల్దార్‌ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌.. కార్యాలయంలో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఏళ్లు గడిచినా... కాళ్లు అరిగేలా తిరిగినా ఆ పని ముందుకు కదలదు. కానీ వాటన్నింటికి అడ్డుకట్ట వేశాడు ఓ అధికారి. చేతివాటానికి అలవాటు సిబ్బందిని దారిలోకి తీసుకొచ్చాడు. మునుపెన్నడూ లేనివిధంగా ఆ కార్యాలయంలో మార్పు రావడంతో తహశీల్దారుకు బ్రహ్మరథం పడుతున్నారు...

Thursday, July 27, 2017 - 12:09

విజయనగరం : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌. కోట, ఆర్టీసీ కాంప్లెక్స్‌ సెంటర్‌ వద్ద టిఫిన్‌ దుకాణంలోకి కారు దూసుకెళ్లింది. దీంతో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో కార్‌ డ్రైవ్‌ చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కార్‌లో మద్యం బాటిల్లు, బిర్యానీ ప్యాకెట్‌లు ఉన్నాయి. నిందితులను నెల్లిమర్ల విద్యుత్ శాఖ ఉద్యోగులుగా గుర్తించారు. 

 

Wednesday, July 26, 2017 - 18:35

విజయవాడ : ముద్రగడ పద్మనాభం గృహనిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఏపీలో నిరసనలు వెల్లువెత్తాయి. సమాచారం తెలిసిన వెంటనే కాపులు ఎక్కడికక్కడ రోడ్ల మీదకు వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కారులను పలు చోట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. కాపు రిజర్వేషన్ల కోసం పాదయాత్ర తలపెట్టిన ముద్రగడ పద్మనాభంను పోలీసులు...

Tuesday, July 25, 2017 - 08:03

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో... విద్యార్థులు కదం తొక్కారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ కర్నూలులో విద్యార్థులు కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు తొపులాట చోటు చేసుకుంది. అలాగే కడపలోని కలెక్టరేట్‌ను విద్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పోలీసులు అడ్డుకుని.....

Monday, July 24, 2017 - 19:43

విజయనగరం : కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు రాజకీయ వారసులెవరు? ఆయన స్థాయిని అందుకునే ఆ సంస్థానాధీశులెవరు? రాజుగారి తర్వాత సంస్థానంలో రాజకీయ వారసత్వం కొనసాగుతుందా? కుమారులు లేని పూసపాటి వంశీయుల రాజకీయ చరిత్ర ఏ మలుపు తిరుగనుంది? రాబోయే ఎన్నికలకు తెరపైకి వచ్చే ఆ కొత్త వారసులెవరు? విజయనగరం మహారాజుల రాజకీయ వారసత్వంపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.
రాజకీయాల్లో పూసపాటి వంశీయులకు...

Sunday, July 23, 2017 - 07:46

విజయనగరం :  జిల్లా పార్వతీపురం కాల్పుల కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒకరిపై కాల్పులు జరిపి మర్డర్‌ చేశారు. సుమిత్ర డిపార్ట్‌మెంటల్‌ స్పోర్ట్‌ యజమాని మురళిని దారుణంగా హత్య చేశారు. గుర్తుతెలియని ఆగంతకులు మురళిపై కాల్పులు జరిపారు. దీంతో మురళి రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Pages

Don't Miss