విజయనగరం
Tuesday, January 30, 2018 - 19:37

విజయనగరం : కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా విజయనగరంలో జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టారు. సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయాన్ని ముట్టడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్నాయని కార్మిక నేతలు విమర్శించారు. కాగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Sunday, January 14, 2018 - 11:14

విజయనగరం : జిల్లాలో భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా భోగి మంటలు వేశారు. తమ కష్టాలు తొలగిపోయి.. సుఖ సంతోషాలు రావాలని ఆకాంక్షించారు. భోగి సంబరాలపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం.. 

Friday, January 5, 2018 - 16:37

విజయనగరం : స్కూల్స్ లో ఆధార్ కు బయోమెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. పిల్లలు స్కూల్ వెళ్లారో లేదో తల్లిదండ్రులు ఇంటి నుంచే తెలుసుకోవచ్చాన్నారు. విశాఖలో జరిగిన జన్మభూమి...మా ఊరు కార్యక్రమంలో సీఎం పాల్గొని, మాట్లాడారు. పిల్లలను మంచిగా తయారు చేసే బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు. ఎంతమంది అవసరమైతే అంతమంది టీచర్స్ ను అపాయింట్ మెంట్ చేస్తామని చెప్పారు...

Tuesday, January 2, 2018 - 18:05

విజయనగరం : సురేష్ పబ్లిక్ స్కూల్ లో నూతన్ సంవత్సర వేడుకల్లో డీజే లైటింగ్ వల్ల 200 మంది విద్యార్థులకు కంటి సమస్యలు తలెత్తాయి. ఈ ఘటన పై విచారణ కు వచ్చిన డీప్యూటీ డీఈవో సత్యనారాయణ మీడియాతో దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధులను బయటకు గెట్టెశారు. దీంతో మీడియా ప్రతినిధులు రస్తారోకో నిర్వహించాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

Tuesday, January 2, 2018 - 06:47

విజయనగరం : జిల్లా పార్వతీపురంలో న్యూ ఇయర్ వేడుకలు కలకలం రేపాయి. స్థానిక సురేష్ పబ్లిక్‌ స్కూల్‌లో రాత్రి న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. ఉదయం నుంచి సుమారు 200మంది విద్యార్థులకు కంటి సమస్య ఏర్పడింది. డీజే లైటింగ్‌ వల్లే కంటిసమస్యకు కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో... యాజమాన్యం స్కూలుకు సెలవు ప్రకటించింది. స్కూల్ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Pages

Don't Miss