వరంగల్
Monday, July 24, 2017 - 11:24

వరంగల్ : నగరంలోని మత్తు మాఫియాపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. టన్ టివి కథనాలతో వరంగల్ సీపీ సుధీర్ బాబు స్పందించారు. సీపీ మాఫియా కార్యకలాపాలపై నేరుగా రంగంలోకి దిగారు. డ్రగ్స్ అడ్డాలపై సమగ్ర ప్రణాళిక తో దాడికి సీపీ ముందుకు వెళ్తున్నారు. పోలీసులు అవేర్ నెస్, ఆపరేషన్, యాక్షన్ పద్ధతులను అమలు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ ను అప్రమత్తం చేశామని సీపీ తెలిపారు....

Monday, July 24, 2017 - 08:47

వరంగల్ : మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి మహిళలు ధర్నా చేపట్టారు. మూడురోజుల క్రితం ఖిలా వరంగల్‌కు చెందిన జంపన్న, సుగుణల కుమార్తెపై అదే కాలనీకి చెందిన అరుణ్‌ అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితునిపై చర్యలు...

Sunday, July 23, 2017 - 07:47

వరంగల్ : టాలీవుడ్‌ హీరోయిన్ సమంత వరంగల్‌లో సందడి చేశారు. హన్మకొండ కిషన్‌పూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బిగ్‌ సి మొబైల్‌ స్టోర్‌ను ప్రారంభించారు. అయితే సమంత వస్తుందని తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. మొబైల్‌ షాప్‌ ప్రారంభం తర్వాత సమంత అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

 

Saturday, July 22, 2017 - 09:05

వరంగల్ : జిల్లాలో పెద్దమొత్తంలో కల్తీనూనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. నగరపరిధిలోని ఇండస్ట్రిరియల్‌ ఏరియాలో కల్తీ నూనే పరిశ్రమలపై పోలీసులు దాడులు చేశారు.. పరిశ్రమల నుంచి కల్తీనూనె ప్యాకెట్లు, డబ్బాలను పట్టుకున్నారు.. కల్తీ నూనె స్థావరాలను వరంగల్ నగర సీపీ సుధీర్‌బాబు పరిశీలించారు.

Thursday, July 20, 2017 - 08:28

వరంగల్ : జిల్లా కేంద్రంలోని లేబర్ కాలనీ గాంధీనగర్ లో దుండగులను ఓ బాలుడిని నరికి చంపారు. దుండగులు మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి ఆటోలో వదిలి వెళ్లారు. హత్యకు గురైన బాలుడిని వినయ్ కుమార్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 3వ తరగతి చదువుతున్న వినయ్ కుమార్ ను అత్యంత పశవికంగా నరికి చంపడం వరంగల్ లో సంచలనం సృష్టిస్తుంది. వినయ్ స్థానికంగా తాపి పని...

Wednesday, July 19, 2017 - 21:06

హైదరాబాద్ : టీఆర్ ఎస్ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళి హత్య... పూర్తిగా వ్యక్తిగత కక్షలతో జరిగిందని వరంగల్‌ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పష్టం చేశారు. కేసు విచారణలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. ప్రధాన నిందితుడు చెప్పిన ప్రకారమే రిపోర్ట్‌లో కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్‌రెడ్డి సహా ఇతర పేర్లు చేర్చామని సుధీర్ బాబు తెలిపారు. 

Wednesday, July 19, 2017 - 19:44

వరంగల్ : అతను శ్రమను నమ్ముకున్న ప్రతిభా వంతుడు.. పేదరికాన్ని జయించిన సరస్వతీ పుత్రుడు. యువత కోసం ఆరాట పడుతున్న తపనపరుడు. అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్న విజేత. ప్రొఫెసర్‌ తాళ్లపల్లి వంశీ సాధించిన అరుదైన ఘనతపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. 
సాధారణ కుటుంబంలో పుట్టిన వంశీ  
అతి సామాన్య వ్యక్తిగా కనిపిస్తోన్న ఈ వ్యక్తి ప్రొఫెసర్ తాళ్లపల్లి వంశీ. సాధారణ...

Wednesday, July 19, 2017 - 15:34

వరంగల్ : గ్రామంలో ఏ సంఘటన జరిగినా ముందుగా గ్రామ పంచాయితీ గుర్తొస్తుంది. గ్రామ పంచాయితీ అధికారులు సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తారు. కానీ అలాంటి గ్రామ పంచాయితీకి ఓ చోట తాళం పడింది. వరంగల్ రూరల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలో గ్రామపంచాయితీకి తాళం పడింది. పంచాయితీ భవన నిర్మాణ నిధులు రాలేదని గ్రామ ఉప సర్పంచ్‌ మరియు వార్డు సభ్యులు కలిసి తాళం వేశారు.

2013 లో ఎన్ఆర్జీఎస్ నిధుల...

Tuesday, July 18, 2017 - 21:44

హైదరాబాద్ : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. వరద ప్రవాహంతో అన్ని జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 
జోరుగా..
జోరువానలతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు చెరువుల్లోకి భారీగా...

Tuesday, July 18, 2017 - 09:35

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ? మంత్రాలకు మంత్రి పదవులు వస్తాయా ? సమాజంలో మంత్ర..తంత్రాలకు విలువనిచ్చే వారు ఎంతో మంది ఉన్నారు. అందులో చదువుకున్న వారు..ప్రజాప్రతినిధులు కూడా ఉండడం గమనార్హం. వరంగల్ రూరల్ పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలాగే వార్తల్లోకి ఎక్కారు. నాన్నకు మంత్రి పదవి రావాలని ఆయన కుమార్తె కోయదొరలతో పూజలు చేయించారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.

ఎమ్మెల్యే...

Monday, July 17, 2017 - 21:29

హైదరాబాద్ : వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రీతిమీనాలు బయ్యారం అడవుల్లో ప్రయాణించారు. అడవిలో ఉన్న బయ్యారం పెద్ద గుట్ట ఇనుప ఖనిజం టూరిజం ప్రాంతాన్ని చూశారు. ఇద్దరు కలెక్టర్లు.. దాదాపు 12 కిలోమీటర్ల పాటు ఉత్సాహంగా నడుచుకుంటూ.. అడవి అంతా పరిశీలించారు.

Pages

Don't Miss