వరంగల్
Thursday, February 1, 2018 - 07:10

మహబూబాబాద్ : రెండేండ్ల ఎదురు చూపుల తర్వాత మేడారంలో వన దేవతల సంబురాలు మిన్నంటాయి. జంపన్నవాగు జన సందోహంతో పరవళ్లు తొక్కింది. కన్నెపల్లి నుంచి సారక్క మేడారం గద్దెకు చేరుకోవడంతో మహాజాతరలో తొలిఘట్టం పూర్తయ్యింది. ఇక పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి దగ్గర సారక్కకు స్వాగతం పలికారు. ఈ ముగ్గురు దేవతల రాకతో మేడారం సంబూరంలో మునిగిపోయింది. ఇక...

Wednesday, January 31, 2018 - 14:52

వరంగల్ : మేడారం జాతరకు భక్త జనం పోటెత్తుతోంది. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు ఎగురుకోళ్ల తో సిద్ధమయ్యారు భక్తులు. సంప్రదాయంగా వస్తోన్న ఈ మొక్కుల చెల్లింపుతో సమీప గ్రామస్థులు ఉపాధిని పొందుతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Wednesday, January 31, 2018 - 14:50

వరంగల్ : నాలుగురోజుల పాటు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పెద్ద ఎత్తున భక్తులు హాజరవనున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు భక్తులు. మేడారం ఏర్పాట్లపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Wednesday, January 31, 2018 - 09:15

వరంగల్ : మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మేడారానికి వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సుమారు కొన్ని కిలోమేటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూస్తామన్న అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని తెలుస్తోంది.

బుధవారం సారలమ్మ..పగిడిద్దరాజు..గోవిందరాజు..గద్దెలపైకి తీసుకొని రానున్నారు. గురువారం...

Tuesday, January 30, 2018 - 21:51

వరంగల్ : ప్రతి పల్లె... అక్కడకు భాగమయ్యేందుకు .. తహతహలాడుతున్నాయి..! పట్టణాలు ఆ వైపుగా పయనిస్తున్నాయి..! నగరాలకు నగరాలు అడవి బాట పట్టాయి. ఇదంతా.. కన్నుల పండువగా.. సాగే సమ్మక్క సారలమ్మ జాతర కోసం. రేపటి నుంచి ప్రారంభమయ్యే... మేడారం జాతర... ఇప్పటికే జనసంద్రమైంది.
భారీ ఏర్పాట్లు 
రెండేళ్లకోసారి .. అత్యంత వైభవంగా జరిగే ... మేడారం జాతర బుధవారం నుంచి...

Tuesday, January 30, 2018 - 18:31

వరంగల్ : జనజాతర సంబురం మొదలైంది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే గిరిజన వేడుకకు మేడారం ముస్తాబైంది. జాతర రేపటి నుంచే అయినా.. మేడారం ఇప్పటికే జన సంద్రమైంది. ఇప్పటికే లక్షల మంది మేడారం చేరుకొని... మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు పగిడిద్దరాజు పెళ్లికొడుకై కదిలాడు. సమ్మక్కగద్దెకు సపరివార సమేతంగా పయనమయ్యాడు. పగిడిద్దరాజును పెళ్లికొడును చేసి.. భాజా భజంత్రీలతో ' ఆరెం '...

Tuesday, January 30, 2018 - 15:59

వరంగల్ : గిరిజన దైవం మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు అమ్మల చెంత పెట్టిన దృష్టిని ఇతర ఆలయాలపై ఉంచడంలేదు. దీంతో మేడారం జాతరకు వచ్చి తిరుగుముఖం పడుతోన్న భక్తులు నిరాశకు గురవుతున్నారు. 
ఈ నెల 31న మేడారం జాతర ప్రారంభం 
ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోన్న మేడారం జాతర ఈ నెల 31న...

Sunday, January 28, 2018 - 17:19

వరంగల్ : చదువు పూర్తయితే వారు డాక్టర్లతో సమానం..చదువుతున్న చదువుకు ఫలితం లేకుండా పోతోందని ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...జిల్లాలో ఫార్మా - డీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఫార్మా - డీ ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టెన్ టివి వారితో మాట్లాడింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన...

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Pages

Don't Miss