వరంగల్
Sunday, September 13, 2015 - 17:00

వరంగల్ : రూపాయి ఖర్చు లేకుండా పేదలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్‌ జిల్లాలో మంత్రులు కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్‌ దీపం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదలకు సిలిండర్లు, స్టౌవులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.  

Saturday, September 12, 2015 - 13:18

వరంగల్ : ప్రముఖ పేరొందిన ఎంజిఎంలో శనివారం ఉదయం కరెంటు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు మూడు నుండి నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా కాలేదు. దీనివల్ల ఎమర్జెన్సీ, చిన్న పిల్లలు, ఓపి, ఎక్స్ రే, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష..పలు వైద్య సేవలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న టెన్ టివి ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేసింది. అప్రమత్తమైన విద్యుత్ అధికారులు ఆసుపత్రికి...

Friday, September 11, 2015 - 18:12

వరంగల్ : జల్లాలోని జనగాం పట్టణంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారులు రైతులకు రుణాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. బ్రోకర్లను ఆశ్రయించిన వారికి మాత్రమే రుణాలిస్తూ మిగతా వారికి రుణాలివ్వడంలేదని రైతులు ఆందోళన చేశారు. అయితే రైతుల ఆందోళనపై స్పందించిన బ్యాంకు అధికారులు..తమ దగ్గర బ్రోకర్లు అసలు లేరని రైతులకు...

Friday, September 11, 2015 - 16:26

వరంగల్ : రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు వరంగల్ లో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసీఆర్‌ది అసమర్థపాలన అని తమ్మినేని విమర్శించారు. టిఆర్ ఎస్ సర్కార్ వచ్చి 14 నెలలైనా.. ఏ హామీ అమలు కాలేదన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. రైతుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పారు...

Friday, September 11, 2015 - 07:02

హైదరాబాద్ : అధికార మదమెక్కిన దొరలను ఎదిరించి ధీరవనిత. గడీల పాలనకు గండికొట్టే పోరాటంలో భాగమైన ధీశాలి. సివంగి అవతారమెత్తి దొరతనాన్ని మట్టి కరిపించిన అరుణతార. అందుకే ఆమె స్ఫూర్తిని నింపుకున్న వామపక్షాలు నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించాయి. ఆ కాంస్య విగ్రహం సాక్షికంగా దమననీతిపై దండెత్తాయి.

చిట్యాల ఐలమ్మ 30వ వర్ధంతిని పాలకుర్తిలో.........

Thursday, September 10, 2015 - 22:18

వరంగల్ : చాకలి ఐలమ్మ వీరత్వం మరువ లేనిదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి కొనియాడారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ సాయుధపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఐలమ్మ ఆశయం మనందరికీ ఆదర్శమన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని పోరాడాలని పిలుపునిచ్చారు.

 

Thursday, September 10, 2015 - 22:13

వరంగల్ : సీఎం కేసీఆర్ నైజాం అడుగుజాడలో నడుస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ సాయుధపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. టీసర్కార్ పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో...

Thursday, September 10, 2015 - 21:43

వరంగల్ : ఐలమ్మ పోరాటం స్ఫూర్తిగా మోడీ నయా జమీందారి వ్యవస్థపై ఉద్యమం చేసేందుకు ప్రతిన బూనుదామని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ సాయుధపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బృందాకారత్‌ ఆవేశపూరితంగా ప్రసంగించారు. పేదలు, రైతుల దగ్గర్నుంచి నరేంద్ర మోడీ సర్కారు బలవంతంగా భూములు లాక్కుంటూ...కార్పొరేట్...

Thursday, September 10, 2015 - 09:48

హైదరాబాద్ : కాలం కాటేస్తోంది.. వరుణుడు దోబుచులాడుతున్నాడు. కరువు ఉరుముతోంది. గద్దెనెక్కిన పాలకుల హామీలు.. నీటిరాతలవుతున్నాయి. వెరసి అన్నదాతలు.. ఆకలి కేకలు, అప్పుల బాధతో అలమటిస్తున్నారు. దారిలేక.. దిక్కుతోచక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా అన్నదాతల తలరాతలు మారడం లేదు.

అప్పుల ఊబిలో...

Wednesday, September 9, 2015 - 19:22

వరంగల్‌ : జిల్లాలోని మహబూబాబాద్‌లో డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మానుకోట జిల్లా సాధనసమితి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మానుకోటను జిల్లాగా ప్రకటించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని జిల్లా సాధన సమితి నేతలు...

Tuesday, September 8, 2015 - 19:03

వరంగల్ : జిల్లాలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో తాళ్లపూసల పల్లి, కేసముద్రం మధ్య రైలు నిలిచిపోయింది. సమస్యను చక్కదిద్దేందుకు... అధికారులు డోర్నకల్ నుంచి మరో ఇంజిన్ రప్పిస్తున్నారు. ఈ ఘటనతో కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్ లో కృష్ణా ఎక్స్ ప్రెస్, తాళ్లపూసల పల్లి వద్ద పెద్దపల్లి ప్యాసింజర్ రైలు ఆగిపోయాయి.

 

Pages

Don't Miss