వరంగల్
Thursday, September 10, 2015 - 21:43

వరంగల్ : ఐలమ్మ పోరాటం స్ఫూర్తిగా మోడీ నయా జమీందారి వ్యవస్థపై ఉద్యమం చేసేందుకు ప్రతిన బూనుదామని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ సాయుధపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బృందాకారత్‌ ఆవేశపూరితంగా ప్రసంగించారు. పేదలు, రైతుల దగ్గర్నుంచి నరేంద్ర మోడీ సర్కారు బలవంతంగా భూములు లాక్కుంటూ...కార్పొరేట్...

Thursday, September 10, 2015 - 09:48

హైదరాబాద్ : కాలం కాటేస్తోంది.. వరుణుడు దోబుచులాడుతున్నాడు. కరువు ఉరుముతోంది. గద్దెనెక్కిన పాలకుల హామీలు.. నీటిరాతలవుతున్నాయి. వెరసి అన్నదాతలు.. ఆకలి కేకలు, అప్పుల బాధతో అలమటిస్తున్నారు. దారిలేక.. దిక్కుతోచక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా అన్నదాతల తలరాతలు మారడం లేదు.

అప్పుల ఊబిలో...

Wednesday, September 9, 2015 - 19:22

వరంగల్‌ : జిల్లాలోని మహబూబాబాద్‌లో డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మానుకోట జిల్లా సాధనసమితి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మానుకోటను జిల్లాగా ప్రకటించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని జిల్లా సాధన సమితి నేతలు...

Tuesday, September 8, 2015 - 19:03

వరంగల్ : జిల్లాలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో తాళ్లపూసల పల్లి, కేసముద్రం మధ్య రైలు నిలిచిపోయింది. సమస్యను చక్కదిద్దేందుకు... అధికారులు డోర్నకల్ నుంచి మరో ఇంజిన్ రప్పిస్తున్నారు. ఈ ఘటనతో కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్ లో కృష్ణా ఎక్స్ ప్రెస్, తాళ్లపూసల పల్లి వద్ద పెద్దపల్లి ప్యాసింజర్ రైలు ఆగిపోయాయి.

 

Tuesday, September 8, 2015 - 13:47

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ, నారాయణ్‌ఖేడ్‌ అసెంబ్లీ స్థానాల్లో వామపక్ష అభ్యర్థిని పోటీలో నిలబెడుతున్నామని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థిగా గద్దర్‌ పేరును ఖరారు చేశామని, ఆ దిశగా గద్ధర్‌తో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈనెల 10న పాలకుర్తిలో చాకలి...

Tuesday, September 8, 2015 - 11:41

హైదరాబాద్ : అక్కడి అధ్యాపకులు పాఠశాల అభివృద్ధికి నడుం బిగించారు. సకల సదుపాయాలున్నప్పుడే మెరికల్లాంటి విద్యార్థులను తయారుచేయగలమని భావించారు. అందుకే దాతల సాయంతో సర్కారీ బడిని డిజిటల్ స్కూల్‌గా మార్చారు. ప్రయోగాల ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తూ విద్యార్థులను కరదీపికలుగా తయారుచేస్తున్నారు.

దాతాల విరాళాలతో స్కూల్‌ అభివృద్ధికి టీచర్ల కృషి ....

సమస్యల...

Tuesday, September 8, 2015 - 06:56

హైదరాబాద్ : తెలంగాణలోని పార్టీలన్నీ వరంగల్‌పైనే దృష్టిసారించాయి. కడియం రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని కాపాడుకోవడం ద్వారా.. ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపించుకోవాలని టీఆర్‌ఎస్‌ ఆరాటపడుతుంటే.. ఉప ఎన్నికలో విజయం ద్వారా.. తమ పట్టు పెంచుకోవడంతోపాటు ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను చాటిచెప్పాలని ప్రయత్నిస్తున్నాయి విపక్షాలు.

ఆశతో ఉన్న అధికార పార్టీ........

Sunday, September 6, 2015 - 17:33

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వాళ్లు ఆకర్శితలవుతున్నారని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. వరంగల్‌ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా..వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచిపనుల్ని చూసి ఓర్వలేక తమపై...

Sunday, September 6, 2015 - 15:22

వరంగల్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ నల్లా నర్సయ్య మృతి చెందారు. వరంగల్ జిల్లా జనగామ మండలం అడవికేసీపురానికి చెందిన నర్సయ్య ఏసీరెడ్డి దళంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. ఎన్నో పోరాటాల్లో పోరాట జెండా ఎగురవేసిన ఆయన తుది శ్వాస వరకు సీపీఎం అభివృద్ధి వరకు కృషి చేశారు. ఏసీ రెడ్డితోనే కాకుండా మిగతా నాయకులతో కలిసి పీడితుల కోసం పోరాటం చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఆయన మరణం తీరని...

Thursday, September 3, 2015 - 11:58

వరంగల్ : పెండింగ్‌లోఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలంటూ బీజేపీ చేపట్టిన పాదయాత్ర వరంగల్ జిల్లా చేరింది. జిల్లాలో కంతనపల్లి నుంచి దేవాదులవరకూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. 30కిలోమీటర్లపాటు ఈ యాత్ర సాగనుంది. ఇందులోభాగంగా మూతబడ్డ బ్రిడ్జి కంపెనీని తెరిపించాలంటూ దీక్ష చేస్తున్న కార్మికులకు మద్దతు ప్రకటించారు.. ఈ కంపెనీ ప్రారంభానికి...

Wednesday, September 2, 2015 - 21:28

వరంగల్ : జిల్లాలో గిరిజనులు వినూత్నంగా సమ్మె చేపట్టారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా.. కార్మికులకు మద్దతుగా గిరిజన కళాకారులు వారి సంప్రదాయ నృత్యాలతో నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ట్రైబల్ మ్యూజియం ఎదురుగా థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.

Pages

Don't Miss