వరంగల్
Sunday, February 19, 2017 - 11:31

వరంగల్ : తెలంగాణలోని ఓ మారుమూల గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామం అమలు చేస్తున్న పనులను దేశంలోని అన్ని గ్రామాల్లో అమలుచేయాలని నిపుణులు భావిస్తున్నారు. అంతగా ఈ గ్రామంలో ఏం ఉంది అనుకుంటున్నారా..?గంగదేవిపల్లి తెలంగాణలో వరంగల్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం.. ఈ గ్రామం ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామంలో 17 సంవత్సరాల క్రితం చేపట్టిన శానిటేషన్ విధానాన్ని...

Sunday, February 19, 2017 - 07:04

వరంగల్ : తెలంగాణ ఏర్పాటు తర్వాత పుంజుకుంటామనుకున్న తెలుగు తమ్ముళ్లు ఉత్తర తెలంగాణలో ఉనికిని కొల్పోతున్నారు. నాడు పోరుగల్లులో వెలుగు వెలిగిన పచ్చ పార్టీ రంగు వెలుస్తోంది. ఒక్కరొక్కరుగా పార్టీ వీడటంతో తమ్ముళ్లు గూడు చెదిరిన పక్షులవుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బలపడుదామనుకున్న టీడీపీని తదనంతర పరిణామాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. ఉత్తర తెలంగాణ గుండెకాయ లాంటి వరంగల్ జిల్లాలో...

Friday, February 17, 2017 - 20:13

వరంగల్‌ : కాంట్రాక్ట్‌ లెక్చరర్ల నిరవధిక సమ్మె నాలుగోరోజుకు చేరింది.. ఇవాళ వంటావార్పు చేసి లెక్చరర్లు నిరసన వ్యక్తం చేశారు.. ప్రభుత్వంనుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకూ సమ్మె విరమించబోమని స్పష్టం చేస్తున్నారు.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Sunday, February 12, 2017 - 21:24

వరంగల్ : ఉన్నత విద్య కోసం వెళ్లి యువకుడు విగత జీవిగా మారిపోయాడు. తెల్లజాతీయుల కర్కశత్వానికి బలైపోయాడు. దేశం కాని దేశంలో దుండగుడి చేతిలో ప్రాణాలు వదిలాడు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జాతి వివక్ష చర్యల్లో భాగంగానే ఈ హత్య జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో జరిగిన దాడి తెలుగు ఓ తెలుగు కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింది...

Sunday, February 12, 2017 - 15:19

వరంగల్ : అమెరికాలో గన్ కల్చర్ కు మరోకరు బలి అయ్యారు. తెలుగు విద్యార్థి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందడం కలకలం రేగింది. గడిచిన రెండు సంవత్సరాల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం గమనార్హం. వరంగల్‌ అర్బన్‌ జిల్లా వంగపాడుకు చెందిన వంశీ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. గత మూడు రోజుల నుండి వంశీ కనిపించడం లేదని స్నేహితులు...

Sunday, February 12, 2017 - 12:54

వాషింగ్టన్ : అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలుగు విద్యార్థి వంశీని దుండగలు కాల్చిచంపారు. ఆఫీస్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా వంశీని దుండగులు కాల్చివేశారు. జాతి వివక్ష చర్యల్లో భాగంగానే హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వంశీరెడ్డి స్వస్థలం వరంగల్‌ అర్బన్‌ జిల్లా వంగపాడు. వంశీరెడ్డి మృతి విషయం తెలియగానే కుటుంబ సభ్యులు షాక్‌లోకి వెళ్లారు. వారంతా ఇప్పుడు కన్నీరుమున్నీరుగా...

Wednesday, February 8, 2017 - 16:17

వరంగల్‌ : నిరుద్యోగుల సమస్యలపై 22న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ చేపడుతామని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్ తెలిపారు. ఈ మేరకు కోదండరామ్‌ 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. గురుకుల పోస్టులకు సంబంధించి 60 శాతం మార్కుల నిబంధనపై టీఎస్పీఎస్‌కి వినతిపత్రం ఇస్తామన్నారు. ఉద్యమంలో పోరాడిన వారిపై కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. 

Tuesday, February 7, 2017 - 20:20

వరంగల్ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన గురుకుల నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ...వరంగల్‌లో వామపక్ష విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి.  హన్మకొండ పెట్రోల్‌ బంక్‌ నుంచి అశోక జంక్షన్‌ వరకు బీ.ఎడ్‌ విద్యార్ధులతో భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం విద్యార్ధి సంఘ నేతలు, విద్యార్ధులు  మానవహారం నిర్మించి నిరసన తెలిపారు. గురుకుల పరీక్షను ఇంగ్లీష్‌తోపాటు ప్రాంతీయ భాషలోనూ...

Pages

Don't Miss