వరంగల్
Sunday, October 22, 2017 - 19:31

వరంగల్ : కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో మొదటి రోజే 14 దేశ, విదేశీయ సంస్థలు రూ. 3వేల 900 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్. తద్వారా 65 వేల మందికి మొదటి రోజే ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. టెక్స్‌టైల్ పార్క్‌ నిర్మాణం కోసం 12 వందల ఎకరాల భూములు కోల్పోయిన రైతన్నలకు కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. భూమి కోల్పోయిన రైతు...

Sunday, October 22, 2017 - 19:29

వరంగల్ : అజంజాహీ మిల్లును తలదన్నేలా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అద్భుతంగా రూపుదిద్దుకోబోతోందన్నారు సీఎం కేసీఆర్. అంతర్జాతీయస్ధాయి రెడీమేడ్ దుస్తులు కూడా ఇక్కడ తయారవుతాయని కేసీఆర్ చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు....

Sunday, October 22, 2017 - 17:25

వరంగల్ : త్వరలోనే వరంగల్ బంగారు వరంగల్ గా మారుతుందని..తరువాతే బంగారు తెలంగాణ మారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పరిశ్రమ శంకుస్థాపన రోజే రూ. 3,900 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 27వేల మందికి ప్రత్యక్ష ఉపాధి.....

Sunday, October 22, 2017 - 16:32

జనగామ : జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులకు తెరలేపారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. అయితే జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాలో ఎక్కడికక్కడ సీపీఎం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అఖిలపక్షం నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో సీపీఎం,...

Sunday, October 22, 2017 - 08:28

వరంగల్ : వస్త్రప్రపంచంలో ఒకప్పుడు దేశానికే తలమానికంగా నిలిచిన ఓరుగల్లుకు పూర్వవైభవం రాబోతోంది. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కాటన్ టు క్లాత్ పేరుతో సంగెం మండ‌లం చింత‌ల‌ప‌ల్లి, గీసుగొండ మండ‌లం శాయంపేట గ్రామాల స‌రిహ‌ద్దులో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను నిర్మించబోతోంది టీ-సర్కారు. ఈనెల 22న సీఎం...

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Saturday, October 21, 2017 - 18:36
Friday, October 20, 2017 - 18:28

వరంగల్‌ : ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సమస్యలు తిష్టవేశాయి. ఈ హాస్పిటల్‌లో కనీస సౌకర్యాలూ లేవు. రోగులను పట్టించుకునే నాధుడూ లేడు. వైద్యుల కొరత ఆస్పత్రిని వేధిస్తోంది. దీంతో వైద్యం కోసం వచ్చిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత ఈఎస్‌ఐ ఆస్పత్రి ఉన్నది వరంగల్‌లోనే. ఇక్కడకి ఆదిలాబాద్‌ ,కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంను జిల్లాల నుంచి వైద్యం కోసం కార్మికులు...

Tuesday, October 17, 2017 - 13:18

వరంగల్‌ : జిల్లాలోని హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు రోగులు మృతి చెందారు. ఆస్పత్రిలో ఉన్న 190 మంది రోగులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

Pages

Don't Miss