వరంగల్
Thursday, April 13, 2017 - 21:56

హైదరాబాద్ : తెలంగాణలో మిర్చి రైతులు  నిండా మునుగుతున్నారు. అప్పుచేసి సాగుచేసిన పంటకు మద్దతు ధర లభించకపోవడంతో దిగాలు చెందుతున్నారు. అప్పులు తీర్చే దారి తెలియక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మిర్చి రైతుకు మద్దతు ధర కల్పించి వారిని ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు, సీపీఎం నాయకులు  ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
...

Thursday, April 13, 2017 - 14:31

వరంగల్ : జిల్లాలోని ఎనుమాముల మిర్చి మార్కెట్ యార్డును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించారు. మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాల్లో క్వింటాల్‌ మిర్చి రూ. 12 వేల నుంచి రూ. 14 వేలు పలుకుతుంటుంటే తెలంగాణలో ఎందుకు తక్కువగా ఉందన్నారు. మార్కెట్ లో ఆన్ లైన్ లో...

Tuesday, April 11, 2017 - 18:18

వరంగల్ : నిత్యం బాంబుల మోత... పగులుతున్న ఇంటి గోడలు.. బెదురుతున్న గుండెలు... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం గుప్పిట్లో జీవిస్తున్న ప్రజలు...ఎగసిపడే దుమ్ము..దూళి... నాశనమవుతున్న పంటలు... ఇది వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పలు మండలాల ప్రజల పరిస్థితి.
ఇల్లీగల్‌ దందా
జిల్లాలోని ఆత్మకూర్‌, శ్యాంపేట, దామెర మండలాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని...

Tuesday, April 11, 2017 - 07:08

వరంగల్: రాష్ట్రంలో మిర్చి సెగలను తమకు అనుకూలంగా మలుచుకుంటోంది కాంగ్రెస్‌. దీనికోసం ఆ హస్తం నేతలు మార్కెట్‌ యార్డ్‌లనే అడ్డాగా చేసుకుని.. రైతులతో కలసి పోరాటబాట పడుతున్నారు. దీంతో గులాబీ సర్కార్‌కు కాంగ్రెస్‌కు మధ్య మిర్చి ఫైట్‌ సాగుతుంది. 

రైతుల ఆందోళనతో అట్టుడుకుతున్న మార్కెట్లు

తెలంగాణాలో మార్కెట్లన్నీ మిర్చి రైతుల ఆందోళనతో...

Monday, April 10, 2017 - 15:29

వరంగల్ : రాష్ట్రంలో టీఆర్ ఎస్ అసమర్థ పరిపాలన కొనసాగుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని వరంగల్‌ ఎనుమాముల మార్కెట్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ టెన్ టివితో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు, రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రభుత్వంలో కేసీఆర్ మాటే నడుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ టీఆర్...

Monday, April 10, 2017 - 11:30

వరంగల్: మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని వరంగల్‌ ఎనుమాముల మార్కెట్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మార్కెట్‌యార్డులోకి కాంగ్రెస్ నేతలు, రైతులు చొచ్చుకెళ్లారు. ఈ ధర్నాలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు, గండ్ర పాల్గొన్నారు. గత కొద్ది రోజులు సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్చికి మద్దతు ధర కల్పించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినా ఎలాంటి ప్రభుత్వం నుండి...

Sunday, April 9, 2017 - 06:30

వరంగల్ : ఈనెల 27న వరంగల్‌ జరిగే టీఆర్‌ఎస్‌ సభ... మరో చరిత్రను తిరగరాస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం పెంచేలా ఈ సభను నిర్వహిస్తామన్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌తో కలిసి సభా ఏర్పాట్లను హరీశ్‌రావు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చా అతిపెద్ద బహిరంగ సభను నిర్వహిస్తున్నామని హరీశ్‌...

Friday, April 7, 2017 - 13:33

వరంగల్ : సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుండి వరంగల్ కు చేరుకున్నారు. హన్మకొండలో టిడిపి మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. కానీ ఓ కార్యకర్త హల్ చల్ చేయడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామి అనే కార్యకర్త బాబును కలవాలని ప్రయత్నించాడు. అక్కడున్న సెక్యూర్టీ గార్డు నివారించారు. తన బాధను తెలియ చేయాలని కోరాడు. కానీ పలువురు అడ్డుకోవడంతో...

Pages

Don't Miss