వరంగల్
Thursday, April 6, 2017 - 17:34

వరంగల్‌ : జిల్లాలోని భట్టుపల్లి శివారు ప్రాంతంలోని ఇందిరమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని దుండగులు సజీవ దహనం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Saturday, April 1, 2017 - 11:50

వరంగల్ : కొండకోనల్లో రంజిల్లే ఈలపాటలు కాకతీయుల పట్టణంలో గొంతెత్తాయి. పకృతిని పలకరింపజేసే గడ్డిపూల సుగంధాలను నగరానికి మోసుకొచ్చింది గిరిజనం. లోక్‌జన్‌ప్రథా పండుగలో భాగంగా దేశం నలుమూలనుంచి తరలివచ్చిన జానపదకళలు వరంగల్‌లో పలకరించుకున్నాయి. హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాలలో ఘల్లుమన్న జానపదంపై టెన్‌టీవీ ఫోకస్‌..

ఘల్లుమన్న జానపదం.......

Friday, March 31, 2017 - 17:00

వరంగల్ : ఏనుమాముల మార్కెట్‌లో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మిర్చి ధరలు భారీగా పడిపోవడంతో ఆగ్రహించిన రైతులు..మార్కెట్ పరిసరాల్లో నాలుగుచోట్ల నిన్న మిర్చిని దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రైతులకు సంఘీభావంగా టీడీపీ నేతలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, సీతక్క, గండ్ర సత్యనారాయణ, వామపక్షాల బృందం ఇవాళ మార్కెట్‌ను పరిశీలించింది. పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో...

Thursday, March 30, 2017 - 17:10

వరంగల్‌ : జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధర లేదంటూ మిర్చిని తగులబెట్టారు. ఐదు రోజుల క్రితం 9 వేల రూపాయలకు క్వింటాలు మిర్చి ధర ఉండగా.. నేడు 4 వేలే పలకడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా మార్కెట్‌కు సెలవు ప్రకటించి ధర తగ్గించారని ఆరోపించారు. 

Saturday, March 18, 2017 - 18:36

వరంగల్ : సామాజిక తెలంగాణ, సమగ్ర అభివృద్ధి నినాదంతో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆధ్వర్యంలో చేపట్టిన సుదీర్ఘ మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగనున్న 'సర్వసమ్మేళన సభ'ను జయప్రదం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. 
ముగింపు దశకు సీపీఎం మహాజన పాదయాత్ర  
తెలంగాణ...

Saturday, March 11, 2017 - 18:38

హైదరాబాద్: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా లెక్కకు మించి వెంచర్లను పూర్తి చేసుకుని ఎందరో కష్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న సంస్థ సుఖీభవ ప్రాపర్టీస్‌. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హైదరాబాద్-వరంగల్‌లో కొత్త వెంచర్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 7వ వెంచర్‌ రాయల్‌ నివాస్‌. ఈ వెంచర్‌కు సంబంధించిన మరిన్ని...

Saturday, March 11, 2017 - 07:33

వరంగల్‌ : శివారు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వంచనగిరిలో ఉన్న గోడౌన్‌లో మంటలు చెలరేగి పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Sunday, March 5, 2017 - 15:52

వరంగల్ : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ఉత్సహంగా సాగుతున్నాయి. క‌రీమాబాద్ రంగ స‌ముద్రంలో నిర్వహించిన ప‌డ‌వ‌ల పోటీల‌ను సీపీ సుధీర్ బాబు ప్రారంభించారు.  డ‌బుల్, సింగిల్స్ విభాగాల్లో పోటీల‌ను నిర్వహించారు. ఈ పోటీల‌ను తిల‌కించేందుకు నగ‌ర వాసులు పెద్దసంఖ్యలో తరలిచ్చారు. జిల్లా కలెక్టర్ అమ్రపాలితో పాటు సీపీ సుధీర్‌బాబు ప‌డ‌వపై కాసేపు విహ‌రించారు. 

Sunday, March 5, 2017 - 11:46

ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగి..ఆ తరువాత ఏదో సాధించాలనే తపనతో బయటకు వచ్చి ఒక చిన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా తన కెరీర్ ను ప్రారంభించి నేడు స్టెర్లింగ్ పంప్స్ సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ గా ఎదగడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈయన ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేగాకుండా సమాజానికి తనవంతు కృషి చేయాలన్న ఆలోచనతో తన తండ్రి పేరిట ఒక మెమోరీయల్ ట్రస్టును స్థాపించి ఎంతో మందికి...

Saturday, March 4, 2017 - 19:36

వరంగల్ : వరంగల్‌ మహానగరపాలక సంస్థ బడ్జెట్‌ను కౌన్సిల్‌ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. మొదటిసారి వెయ్యి 43కోట్ల రూపాయలతో బడ్జెట్‌ రూపకల్పన చేశామని మేయర్‌ నరేందర్‌ తెలిపారు. నగరవాసులపై పన్నుభారం లేకుండా బడ్జెట్‌ తయారుచేశామని స్పష్టం చేశారు. బల్దియా కౌన్సిల్‌ హాల్‌లో ఏర్పాటైన బడ్జెట్‌ సమావేశానికి ఎంపీ దయాకర్‌... ఎమ్మెల్యే వినయ భాస్కర్‌ హాజరయ్యారు.

Pages

Don't Miss