వరంగల్
Thursday, May 18, 2017 - 15:33

వరంగల్‌ : నగరంలో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. పసుపు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ పరిపాలన భవనాన్ని ముట్టడించారు. మార్కెట్‌ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో పెద్దెఎత్తున పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కాగా పసుపు కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని చైర్మన్‌ ధర్మరాజు రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు రైతులు ఆందోళన విరమించారు. 

Thursday, May 18, 2017 - 09:20

వరంగల్ : జిల్లాలోని ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున సైదాపూర్ నుంచి, చినపాపయ్యపల్లికి పశుగ్రాసం తీసుకురావడానికి కొందరు ట్రాక్టర్ లో వెళుతున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తున్న లారీ వారు ప్రయాణీస్తున్న ట్రాక్టర్ ను ఢీకొంది. దీనితో ఇద్దరు మృతి చెందారు. గాయపడిన ఐదుగురిని వరంగల్ ఏంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులు రాజయ్య,...

Sunday, May 14, 2017 - 21:21

వరంగల్ : కాసేపట్లో పెళ్లి.. కల్యాణ మండపమంతా వచ్చిపోయే వారితో కళకళలాడుతోంది.. మహూర్తం దగ్గరకు వచ్చేసింది.. ఇక వధూవరులు రావడమే ఆలస్యం.. ఇంతలో పెళ్లికూతురుకు వచ్చిన ఓ మెసేజ్‌ అందరినీ షాక్‌కు గురిచేసింది.. పీటలదాకావచ్చిన పెళ్లి ఆగిపోయేలా చేసింది. ఒక అమ్మాయితో ప్రేమాయణం నడిపి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడో వరుడు.. చివరినిమిషంలో ఈ విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు వివాహాన్ని...

Sunday, May 14, 2017 - 16:25

వరంగల్ : జిల్లా హన్మకొండలో పీటలపై పెళ్లి ఆగిపోయింది. ఇవాళ వివాహ మహూర్తం ఉండగా... వధువుకు వరుడి లవర్‌ మెసేజ్‌ పంపింది.. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని అందులో పేర్కొంది. ఈ మెసేజ్‌ చూసిన పెళ్లికూతురు వివాహానికి నిరాకరించింది. వధువు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వరుడితో పాటు... అతని బంధువులను అదుపులోకి తీసుకున్నారు.

Friday, May 12, 2017 - 15:42

వరంగల్ : జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ న‌గ‌ర్‌లో రెండు రోజుల క్రితం పేదల ఇండ్లు కూల్చి వేయాడాన్ని సీపీఎం, సీపీఐ తీవ్రంగా తప్పుబట్టాయి. ఇండ్ల కూల్చివేతను నిర‌సిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కాశిబుగ్గ సెంట‌ర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ ద‌గ్దం చేస్తుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం పేదలకు ఇండ్లు...

Wednesday, May 10, 2017 - 13:45

వరంగల్ :నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ఇళ్ల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా నిర్మాణాలు కూల్చివేయడానికి రావడంతో స్థానికులు నిలదీశారు. కూల్చివేతలను నిలిపివేయాలని ఆందోళన చేపట్టారు. అధికారులు తీసుకొచ్చిన జేసీబీపై రాళ్లు విసిరావు. స్థానికుల ఆందోళనకు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌ మద్దతు తెలిపారు. కూల్చివేతలను నిలిపివేయాలంటూ యాసిన్‌...

Sunday, May 7, 2017 - 17:21

వరంగల్ : నేడు నీట్ పరీక్షలో భాగంగా వరంగల్ సెంటర్ లో 2000 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. సేయింట్ పీటర్స్ పరీక్షా కేంద్రంలో తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ ఇవ్వడంతో విద్యార్థులు కంగుతీన్నారు. ఇన్వీజిలేటర్ దృష్టికి తీసుకెళ్లిన వారు సమాధానం ఇవ్వకపోవడంతో పరీక్ష అనంతరం తమ భవిష్యత్ ఏంటో తేల్చేవరకు వెళ్లేది లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను...

Thursday, May 4, 2017 - 12:45

వరంగల్‌ : జిల్లాలోని ఏనుమాముల మార్కెట్‌ యార్డులో రైతులు అవస్థలు పడుతున్నారు. కేంద్రం ప్రకటించిన గిట్టుబాటు ధరకు సంబంధించిన తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారులంటున్నారు. దీంతో మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయి. గిట్టుబాటు ధర కోసం రైతులు మార్కెట్‌లో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు మార్కెట్‌కు భారీ ఎత్తున మిర్చి తరలివస్తోంది. దీంతో మార్కెట్‌ యార్డు వద్ద...

Pages

Don't Miss