వరంగల్
Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Sunday, April 8, 2018 - 16:20

వరంగల్‌ : జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రంలో గందరగోళం చోటు చేసుకుంది. జిల్లాలో ఒకే పేరుతో రెండు రాయపర్తిలు ఉండటంతో హాల్ టికెట్ల ముద్రణలో తప్పుజరిగింది. పరకాల మండలం రాయపర్తిగ్రామ ప్రభుత్వ పాఠశాలకి బదులుగా వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి హై స్కూల్‌ అని ఉండటంతో 200 మంది విద్యార్థులు, వారి తల్లి దండ్రులు రాయపర్తి హై స్కూల్‌ ఉదయమే చేరుకున్నారు. కాగా...

Thursday, April 5, 2018 - 17:44

వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపించి అప్పులు తెచ్చిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదాయం ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపించి అప్పులు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుందని చెప్పారు. కాంట్రాక్టర్ల కక్కుర్తి కోసం అప్పులు చేసిందని మండిపడ్డారు. 5392 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని కాగ్ నివేదిక తెలిపిందన్నారు....

Sunday, April 1, 2018 - 13:13

వరంగల్ : సీపీఎం అఖిల భారత మహాసభల విజయవంతం కోసం సీపీఎం చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. వివిధ జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్ర ఆదివారం వరంగల్ రూరల్ జిల్లాల్లోకి ప్రవేశించింది. బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోందని సీపీఎం నేతలు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం.....

Monday, March 26, 2018 - 18:49

వరంగల్ : భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని దళిత శక్తి ప్రోగ్రామ్‌ ద్వారా అణిచివేయబడ్డ దళితుల్లో జ్ఞానం ద్వారా వారిలో ఉన్న ఆత్మనూన్యత భావాన్ని పోగొట్టడానికి చేపట్టిన 5 వేల కిలోమీటర్ల పాదయాత్ర వరంగల్‌ జిల్లాకు చేరుకుంది. ఇప్పటికే 4500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకుంది. దళిత సమాజం మొత్తం ఆత్మగౌరవంతో బ్రతికే జ్ఞానం వచ్చేంతవరకు దళితులకు రాజ్యాధికారం...

Friday, March 16, 2018 - 19:25

వరంగల్ : దమ్మన్నపేటలో ఎమ్మెల్యే అరురి రమేష్ కు చుక్కెదురైంది. నాలుగేళ్లలో తట్టెడు మట్టిగా కూడా పోయలేదంటూ ప్రజలు ఆగ్రహించారు. ఓ దాత సాయంతోనే అభివృద్ధి పనులు జరిగాయని గ్రామస్తులు అంటున్నారు. ఎమ్మెల్యే వల్ల ఒరింగేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో చేసిన పనులను మీరెలా ప్రారంభిస్తారంటూ నిలదీశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని...

Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Monday, March 12, 2018 - 17:35

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 స్థానాల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ పోటీ చేస్తుందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రైతులకు రుణమాఫీతో పాటు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో బీఎల్‌ఎఫ్‌ సామాజిక న్యాయంతో ముందుకెళ్తుందన్నారు. 

Monday, March 12, 2018 - 11:55

వరంగల్ : నిట్ లో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. వసంతోత్సవం వేడుకల్లో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ విద్యార్థికి కత్తిపోట్లు పడ్డాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. నిట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Friday, March 9, 2018 - 09:11

ఖమ్మం : పారాణి ఆరకముందే వరుడు విగతజీవిగా మారగా...వధువు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోరమైన దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పచ్చటి పందిళ్ల మధ్య బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దుర్గతో వరంగల్ జిల్లా వర్దన్నపేటకు చెందిన రామకృష్ణతో వివాహం నిశ్చయమైంది. గురువారం రాత్రి తణుకులో వివాహం చేసుకున్న అనంతరం ఇన్నోవా వాహనంలో వధువు.....

Pages

Don't Miss