వరంగల్ : హోరు తగ్గింది. పోరు ముగిసింది. ఓరుగల్లు చల్లబడింది. ప్రచారంతో హోరెత్తించిన మైకులు మూగబోయాయి. ఉపన్యాసాలు దంచికొట్టిన నేతలు ఇక మౌనవ్రతంలోకి దిగిపోయారు. ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో.. వరంగల్‌ను గత పది రోజులుగా దడదడలాడించిన ఎన్నికల హడావుడి ముగిసిపోయింది. ఇక పోలింగ్.. ఆ పై కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది. విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు విసురుకున్నారు. ఇక ఓటరన్న...
హైదరాబాద్ : టిఆర్ఎస్ మంత్రి హరీష్‌రావు ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ చేస్తోందంటూ టిడిపిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని టిటిడిపి నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. అదే నిజమైతే గతంలో నీవు మంత్రిగా ఉన్నప్పుడు ఆ జలదోపిడీని ఎందుకు అడ్డుకోలేకపోయావని రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాళ్లతో కొట్టమంటున్న కెసిఆర్ అలా కొట్టిన కొమురయ్యని ఎందుకు...
హైదరాబాద్ : వరంగల్ పార్లమెంట్ పరిధిలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదని వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్ అన్నారు. ఆయన వరంగల్ లో గురువారం మీడియాతో మాట్లాడుతూ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే... దేశానికే ఆదర్శవంతమైన నగరంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇప్పిస్తానని, స్కిల్ డెవలప్ మెంట్...
వరంగల్ : కాంగ్రెస్ నేతలు అనవసరంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామన్నారు. వరంగల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారని చెప్పుకొచ్చారు.
హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ..వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రచార పర్వం మొదలైన నాటి నుంచి పూర్తయ్యే వరకు ఓ వైపు ప్రచారం చేస్తూనే మరో వైపు ఆపరేషన్ ఆకర్ష్‌ను నిర్వహిస్తోంది. మరోవైపు మంత్రులంతా అక్కడే మకాం వేసి ఇతర పార్టీల నేతలను పెద్ద ఎత్తున కారెక్కిస్తున్నారు.
టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు
వరంగల్ ఎంపీ...
వరంగల్ : 'గీత దాటితే వాత పడుతుంది. కొత్త స్కీమ్‌లు తీసుకొస్తే యాక్షన్ సీరియస్‌గా ఉంటుంది. తిష్ట వేసిన వాళ్లంతా తిరిగి రాకపోతే కొరడా ఝళిపించాల్సి వస్తుంది'. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన వార్నింగ్ ఇది. మరోపక్క రూల్స్ క్రాస్ చేశారన్న ఆరోపణలపై టీఆర్ఎ స్ సర్కార్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
విపక్షాల ఆరోపణలపై...
హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి మరి కొద్ది గంటల్లోనే తెరపడనుండడంతో అటు నేతలు జోరుగా గ్రామాలను, పట్టణాలను చుట్టేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణల డోసును పెంచాయి. మరో వైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున నగదు, మద్యం కూడా పోలీసులు సీజ్ చేశారు. చివరి నిమిషం వరకూ తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ఓటరు మహాశయుడిని కాళ్లవేళ్ల పడి మరీ బతిమాలేందుకు సైతం...
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు కొత్త పథకాలు ప్రకటించొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలంగాణ సర్కార్‌ను ఆదేశించారు. కొత్త స్కీముల ప్రకటన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. క్రిస్మస్ వేడుకలు, బీసీ హాస్టళ్లకు సన్నబియ్యం, కల్యాణ లక్ష్మి పథకాలపై సీఎం కేసీఆర్, మంత్రులు కొన్ని ప్రకటనలు చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్ తెలంగాణ సర్కార్...
వరంగల్ : ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వరంగల్ లోక్ సభ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థి తరపున ఇస్లామిక్ గ్రౌండ్స్ జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్... మంగళవారం వరంగల్ లో తన ప్రసంగంలో దాని...
హైదరాబాద్ : కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా కాళోజీ కళాక్షేత్రంలో బిజెపి సభలో దత్తాత్రేయకు ముక్కు నుండి రక్తం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన నేతలు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
హైదారాబాద్ : వరంగల్ బైపోల్ ప్రచారంలో భాగంగా... వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గీసుకొండలో ప్రచారం నిర్వహించారు. వైఎస్ హయాంలో పేదలకు 20 లక్షల 60వేల ఎకరాల భూములు పంచారని... అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎంత భూమిని పంచారని ఆయన ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ కు.. పత్తికి మద్దతు ధర ఎందుకు పెంచలేదన్నారు. వైఎస్ చేపట్టిన అన్ని పథకాలను తుంగలో...