వరంగల్
Sunday, February 12, 2017 - 15:19

వరంగల్ : అమెరికాలో గన్ కల్చర్ కు మరోకరు బలి అయ్యారు. తెలుగు విద్యార్థి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందడం కలకలం రేగింది. గడిచిన రెండు సంవత్సరాల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం గమనార్హం. వరంగల్‌ అర్బన్‌ జిల్లా వంగపాడుకు చెందిన వంశీ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. గత మూడు రోజుల నుండి వంశీ కనిపించడం లేదని స్నేహితులు...

Sunday, February 12, 2017 - 12:54

వాషింగ్టన్ : అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలుగు విద్యార్థి వంశీని దుండగలు కాల్చిచంపారు. ఆఫీస్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా వంశీని దుండగులు కాల్చివేశారు. జాతి వివక్ష చర్యల్లో భాగంగానే హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వంశీరెడ్డి స్వస్థలం వరంగల్‌ అర్బన్‌ జిల్లా వంగపాడు. వంశీరెడ్డి మృతి విషయం తెలియగానే కుటుంబ సభ్యులు షాక్‌లోకి వెళ్లారు. వారంతా ఇప్పుడు కన్నీరుమున్నీరుగా...

Wednesday, February 8, 2017 - 16:17

వరంగల్‌ : నిరుద్యోగుల సమస్యలపై 22న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ చేపడుతామని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్ తెలిపారు. ఈ మేరకు కోదండరామ్‌ 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. గురుకుల పోస్టులకు సంబంధించి 60 శాతం మార్కుల నిబంధనపై టీఎస్పీఎస్‌కి వినతిపత్రం ఇస్తామన్నారు. ఉద్యమంలో పోరాడిన వారిపై కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. 

Tuesday, February 7, 2017 - 20:20

వరంగల్ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన గురుకుల నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ...వరంగల్‌లో వామపక్ష విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి.  హన్మకొండ పెట్రోల్‌ బంక్‌ నుంచి అశోక జంక్షన్‌ వరకు బీ.ఎడ్‌ విద్యార్ధులతో భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం విద్యార్ధి సంఘ నేతలు, విద్యార్ధులు  మానవహారం నిర్మించి నిరసన తెలిపారు. గురుకుల పరీక్షను ఇంగ్లీష్‌తోపాటు ప్రాంతీయ భాషలోనూ...

Tuesday, February 7, 2017 - 09:19

హైదరాబాద్: డాక్టర్ల నిర్లక్ష్యానికి విలవిల్లాడిన ఓ పసిప్రాణం మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. వరంగల్‌జిల్లాకు చెందిన భిక్షపతి.. జ్వరంతో బాధపడుతున్న తన కూతురు సాయీప్రవల్లికను రెండు నెలల కిందట హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. పాపకు ట్రీట్‌ మెంట్‌ ఇచ్చే సమయంలో ఆస్పత్రి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పురుగులతో కల్తీఅయిన సెలైన్‌ బాటిల్‌ను పాప...

Saturday, January 28, 2017 - 16:02

వరంగల్ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు...ఆకలి బాధలను సైతం తీర్చుతామంటున్నారు ఇక్కడి అధ్యాపకులు. తాము పనిచేస్తున్న కళాశాలలో ఏ ఒక్క విద్యార్థి ఆకలితో ఉండకూడదని సంకల్పించారు. వారు పనిచేస్తున్న ప్రభుత్వ కళాశాలలో సొంతఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి శ్రీకారం చుట్టారు.

విద్యనభ్యసిస్తున్న 250 మంది...

Saturday, January 28, 2017 - 13:12

వరంగల్ : యువతలో స్కిల్ డెవలప్ మెంట్ కోసం కృషి చేస్తున్న చంద్రశేఖర్ సబ్బవరపు పౌండేషన్‌కు చాలా మంది సహాయసహకారాలు అందించడం మంచి పరిణామామని నిట్ డైరెక్టర్ జిఆర్సీ రెడ్డి అన్నారు. వరంగల్ లో చంద్రశేఖర్ సబ్బవరపు పౌండేషన్ మైల్ స్టోన్ ఆఫ్ దౌంసడ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. పౌండేషన్ స్థాపించిన రెండేళ్లలో 1000 మందికి ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్, కార్పొరేట్...

Sunday, January 22, 2017 - 22:01

హైదరాబాద్ : తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా హైదరాబాద్, గద్వాల్ ల మధ్య జరిగిన కబడ్డీ పోటీల్లో హైదరాబాద్ జట్టు గెలుపొందింది. హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. 

 

Pages

Don't Miss