వరంగల్
Thursday, July 30, 2015 - 16:50

వరంగల్: భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి... ఇవాళ అమ్మవారు ముద్రాక్రమంలో దర్శనమిచ్చారు.. దుర్గాదేవిని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు... దుర్గమ్మను దర్శించుకొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు..

Wednesday, July 29, 2015 - 12:53

వరంగల్ : తొలి తెలంగాణ సర్కారులో డిప్యూటీ సీఎం ఆయన. ఆయన అధికారాన్ని వివాదాలు దూరం చేశాయి. ఆ తర్వాత ఏకాంత రాజకీయ జీవితాన్ని గడపుతున్న మాజీ మంత్రి.. మళ్లీ తెరపైకి వచ్చారు. ఓరుగల్లు ఉపపోరు బరిలో దిగేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం చక్కర్లు కొడుతున్నాయి.
రంగం సిద్ధం చేసుకుంటున్న అధికార పార్టీ..
వరంగల్ ఉప ఎన్నికల బరిలో దిగేందుకు...

Tuesday, July 28, 2015 - 21:08

వరంగల్: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఏసిరెడ్డి నర్సింహారెడ్డి 24 వర్ధంతి సభను... జనగామ సీపీఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారు. సీపీఎం తెలంగాణ రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీరెడ్డి ప్రత్యేక సంచికను తమ్మినేని, సారంపల్లి వాసుదేవరెడ్డి, ఆముదాల మల్లారెడ్డి...

Monday, July 27, 2015 - 18:57

వరంగల్: మున్సిపల్‌ కార్మికుల ఆందోళ‌న వ‌రంగ‌ల్ న‌గ‌రంలో తీవ్రరూపం దాల్చింది. గ‌త 23 రోజులుగా స‌మ్మె చేస్తున్న ప్రభుత్వం ప‌ట్టించుకొకపోవ‌డంతో కార్మికులు న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యం ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. కార్మికులు చేస్తున్న స‌మ్మెపై ప్రభుత్వం దిగిరాక‌పోవ‌డంతో మన‌స్తాపం చెందిన ఓ కార్మికురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. ఆత్మహత్యాయ‌త్నాన్ని గ‌మ‌...

Sunday, July 26, 2015 - 07:11

హైదరాబాద్ : మున్సిపల్‌ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు మున్సిపల్‌ జేఏసీ సిద్ధమైంది. వినూత్న రీతిలో నిరసన తెలిపేందుకు భవిష్యత్తు కార్యచరణను ప్రకటించింది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరంతర పోరాటం కొనసాగించేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. తెలంగాణ సర్కార్‌తో తాడో పేడో తేల్చుకునేందుకు సఫాయి కార్మికులు రెడీ అయ్యారు. కొత్త పంథాలో నిరసన తెలిపేందుకు సమాయత్తమయ్యారు. హైదరాబాద్‌లో...

Tuesday, July 21, 2015 - 10:37

వరంగల్ : జిల్లాలోని అండర్ బ్రిడ్జి వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మెదక్ జిల్లా సిద్ధిపేట గణేష్ నగర్ కు చెందిన చంద్రశేఖర్, తన సోదరి కమల, భార్య సరోజతో కలిసి సోమవారం వరంగల్ జిల్లాకు వచ్చారు. మంగళవారం ఉదయం అండర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్న వీరు వేగంగా వస్తున్న నవ జీవన్ ఎక్స్ ప్రెస్ రైలు కింద...

Tuesday, July 21, 2015 - 06:37

హైదరాబాద్ : కార్మికుల సమస్యలపై వామపక్షాలు పోరుబాట పట్టాయి. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై సమరశంఖం పూరించాయి. కార్మికుల సమ్మెకు మద్దతుగా బస్సు యాత్రను చేపట్టాయి. యాత్రలో సీపీఎం, సీపీఐ సహా పది వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి. నల్గొండలో బస్సు యాత్ర ప్రారంభ సభ జరిగింది. ఐదు రోజుల పాటు తొమ్మిది జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి బస్సు బయలు దేరింది. నల్గొండలో...

Saturday, July 18, 2015 - 19:08

వరంగల్: జిల్లాలో పుష్కరాల్లో గోదావరి పరివాహక ప్రాంతం యాత్రికులతో కిక్కిరిసిపోతోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఘాట్లకు జనం తాకిడి ఎక్కువైంది. ఏటూరునాగారం, రామన్నగూడెం, మంగపేట ప్రాంతాల్లో యాత్రికులు స్నానం ఆచరిస్తున్నారు. భక్తుల నుద్దేశించి ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి ఇక్కడ వైద్య బృందం ప్రాథమిక...

Friday, July 17, 2015 - 14:55

వరంగల్‌: జిల్లాలో ఆందోళనలు చేస్తున్న మున్సిపల్ కార్మికులు, లెఫ్ట్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి సమీప పోలీస్‌స్టేషన్లకు తరలించారు. దీంతో నగరంలోని పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే...ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని లెఫ్ట్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కార్మికుల...

Wednesday, July 15, 2015 - 21:22

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తుల రద్దీతో పుష్కర ఘాట్లు కిక్కిరిసిపోతున్నాయి. పుష్కర గోదావరిలో పుణ్యస్నానం చేయడానికి భక్తులు లక్షలాదిగా తరలివెళ్తున్నారు. భక్తుల జయజయ ధ్వానాలతో పుష్కర ఘాట్లు మారుమోగుతున్నాయి. కనీవినీ ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలకు భక్తులు లక్షల సంఖ్యలో పొటెత్తుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో ఉన్న పుష్కర ఘాట్లలో...

Monday, July 13, 2015 - 18:57

వరంగల్: ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తేనే.. నిజమైన సామాజిక న్యాయం జరిగినట్లువుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వరంగల్ జిల్లాలో చాకలి ఐలమ్మ విగ్రహాష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడే నేతనే వరంగల్ పార్లమెంట్ నియోజవర్గం నుంచి పంపాలని సూచించారు. మోడీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు,...

Pages

Don't Miss