విండోస్ 10 వాడుతున్నారా? : ఆపిల్ iCloud యాప్ వచ్చేసింది

Submitted on 12 June 2019
Apple iCloud app for Windows 10 launched in Microsoft Store

ప్రపంచ టెక్ దిగ్గజాలు ఆపిల్, మైక్రోసాఫ్ట్ .. విండోస్ సిస్టమ్ కోసం కొత్త యాప్ ను ప్రవేశపెట్టాయి. అదే.. iCloud యాప్. ఈ లేటెస్ట్ యాప్ ను మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విండోస్ 10 డివైజ్ ల్లో అన్నింటిలో ఈ యాప్ సపోర్ట్ చేస్తుందని విండోస్ బ్లాగ్ పై పోస్టు తెలిపింది.

ఈ కొత్త iCloudయాప్ ద్వారా యూజర్లు ఐక్లౌడ్ ఫీచర్లను యాక్సస్ చేసుకోవచ్చు. iCloud డ్రైవ్, ఫోటోలు, మెయిల్, కాంటాక్ట్స్, క్యాలెండర్, రిమైండర్స్, సఫారీ బుక్ మార్క్స్ ఫీచర్లను ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐక్లౌడ్ యాప్ విండోస్ ప్లాట్ ఫాంపై కూడా అందుబాటులో ఉంది. 

కొత్త iCloud యాప్ లో కూడా వన్ డ్రైవ్స్ ఫైల్స్ ఆన్ డిమాండ్ ఫీచర్ లో వాడే టెక్నాలజీనే వాడినట్టు మైక్రోసాఫ్ట్ బ్లాగ్ పోస్టులో తెలిపింది. పోటీదారులుగా ఉండే.. రెండు టెక్నాలజీ దిగ్గజాలు కలిసి సంయుక్తంగా ఈ కొత్త యాప్ ను ప్రవేశపెట్టాయి.

మైక్రోసాఫ్ట్ స్టోర్ లో విండోస్ యాప్ కోసం icloud యాప్ ను తొలిసారి ప్రవేశపెట్టారు. 2019 ఏడాది ఆరంభంలో యాప్ స్టోర్ మ్యాక్ లో మైక్రోసాఫ్ట్ ను లాంచ్ చేశారు. ఆ తర్వాత విండోస్ 10 కోసం ఐక్లౌడ్ యాప్ ను మైక్రోసాఫ్ట్, ఆపిల్ ప్రవేశపెట్టాయి. 

ఆపిల్ icloud యాప్ కోసం విండోస్ సపోర్ట్ పీజీని డిజైన్ చేశారు. ఐక్లౌడ్ డ్రైవ్ పై విండోస్ 10 షేరింగ్ ఫైల్స్ ఆప్టిమైజ్ ఫైల్స్ ను స్టోర్ చేస్తుంది. విండోస్ యూజర్లు కూడా తమ ఫైల్స్, డాక్యుమెంట్లను లోకల్ సిస్టమ్ లో పిన్ చేసుకోవచ్చు. యూజర్లు.. విండోస్ యాప్ కోసం ఐక్లౌడ్ ద్వారా తమ ఐక్లౌడ్ స్టోరేజీని మ్యానేజ్ చేయడమే కాకుండా అప్ గ్రేడ్ కూడా చేసుకోవచ్చు.

ఐక్లౌడ్ డ్రైవ్ ఫంక్షనాల్టీ మాత్రమే కాకుండా.. మిగిలిన లేటెస్ట్ రిలీజ్ ఐక్లౌడ్ ఫీచర్లు విండోస్ యూజర్లకు పెద్ద మొత్తంలో అందుబాటులో ఉన్నాయి. విండోస్ 10 PC యూజర్ల అందరూ విండోస్ యాప్ కోసం Icloud ను మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

Apple
iCloud app
 Windows 10
Microsoft Store
Windows 10 PCs
iCloud content
Windows app

మరిన్ని వార్తలు