అదిరిపోయే ఫీచర్లు : ఆపిల్ MacBook Pro వచ్చేస్తోంది 

Submitted on 25 June 2019
Apple to launch 16-inch MacBook Pro in September this year

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ మరో కొత్త ప్రొడక్టును మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. 2019 సెప్టెంబర్ లో 16 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో ల్యాపీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆపిల్.. మ్యాక్ బుక్ ప్రో లైనప్ 8వ, 9వ జనరేషనల్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లపై రన్ అయ్యే 13 అంగుళాలు, 15 అంగుళాల డివైజ్ లను రూపొందించింది. 

కానీ, ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో లైనప్ ను కొనసాగించాలని భావిస్తున్నట్టు ఓ నివేదిక తెలిపింది. అంతేకాదు.. ఐఫోన్ మేకర్.. 16అంగుళాల మ్యాక్ బుక్ ప్రోను మరో మూడు నెలల్లో లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది. 

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో కొత్త మ్యాక్ బుక్ ప్రో రిలీజ్ అవుతుందని అంచనా. అదే సమయంలో ఆపిల్ కొత్త ఐఫోన్లు కూడా రిలీజ్ కానున్నాయి. ఐఫోన్ ఎక్స్ ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ ఎస్ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లను కూడా ఆపిల్ లాంచ్ చేయనుంది. 

ఐహెచ్ఎస్ మార్కిట్ విశ్లేషకులు జెఫ్ లిన్ మాట్లాడుతూ.. ఆపిల్ 16 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో.. LG డిస్ ప్లేతో రూపొందించిన LCD డిస్ ప్లే తో రానుంది. ఈ డిస్ ప్లే ఫీచర్.. రెజుల్యుషన్ 3072x1920 ఫిక్సల్స్ వరకు ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ మ్యాక్ బుక్ ప్రో.. Mac OS క్యాటలినా, బ్రాండ్ న్యూ CPU ఫీచర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

16అంగుళాల మ్యాక్ బుక్ ప్రో మోడల్ రిలీజ్ తో పాటు ఆపిల్... మ్యాక్ బుక్ లైనప్ లో మరిన్ని అప్ డేట్స్ అందిస్తోంది. 13.3 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో, మ్యాక్ బుక్ ఎయిర్ మోడల్స్ లో కొత్త ప్రాసెసర్లతో కూడిన అప్ డేట్ రానుంది.  

Apple
16-inch MacBook Pro
MacBook Pro
MacBook Air models
LCD display
LG Display 

మరిన్ని వార్తలు